Gambhir : గంభీర్ వర్సెస్ సీనియర్లు.. టీమిండియాలో ఆల్ ఈజ్ నాట్ వెల్

Gambhir : రెండేళ్ల క్రితం ద్రవిడ్ పదవీకాలం ముగిసిన తర్వాత.. గంభీర్‌ను బీసీసీఐ ఏరికోరి తీసుకొచ్చింది. అతను అడిగిన అన్ని డిమాండ్లకు తలొగ్గి మరీ హెడ్ కోచ్‌గా బాధ్యతలు అప్పగించింది.

Gambhir

భారత క్రికెట్ జట్టులో అంతా సరిగానే ఉందా? హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై సీనియర్లు అసంతృప్తితో ఉన్నారా అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. తాజా పరిణామాలు చూస్తుంటే డ్రెస్సింగ్ రూమ్‌లో సీనియర్లు, గంభీర్ మధ్య లుకలుకలు తీవ్రస్థాయిలో ఉన్నట్టు అర్థమవుతోంది.

కోచ్ గంభీర్(Gambhir) వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న సీనియర్లు బీసీసీఐ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. జట్టు పరాజయాలకు గంభీర్(Gambhir) బాధ్యత తీసుకోవడం లేదనీ, తమనే  టార్గెట్ చేస్తున్నాడన్నది సీనియర్ల మాట. ఇదే మాటను బోర్డు పెద్దల ముందు ఉంచినట్టు సమాచారం.

జట్టు ఓడిపోయినప్పుడు కోచ్‌గా తాను బాధ్యత తీసుకోకుండా, ఆటగాళ్లను నిందిస్తున్నాడనేది సీనియర్ల ప్రధాన ఆరోపణ. అలాగే చాలా రోజులుగా తమ ఫ్యూచర్ విషయంలోనూ గంభీర్ అనుసరిస్తున్న విధానాలు సైతం సీనియర్లకు నచ్చడం లేదు.

రోహిత్, కోహ్లీ, అశ్విన్ వంటి సీనియర్లు గంభీర్ తీరు నచ్చకనే రిటైర్మెంట్ ఇచ్చేసారన్నది చాలా మందికి తెలుసు. ప్రస్తుతం కోహ్లీ, రోహిత్ వన్డే ఫార్మాట్ లో కొనసాగుతున్నా వచ్చే ప్రపంచకప్‌కు జట్టులో ఉంటారో లేదో తెలియని పరిస్థితి. దీంతో మిగిలిన సీనియర్లు కూడా ఇదే విషయంలో అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది.

బీసీసీఐ పెద్దలను కలిసిన సీనియర్లు వీటిపైనే ప్రధానంగా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. సీనియర్ల ఫిర్యాదుపై బీసీసీఐలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలుస్తోంది. కొందరు సీనియర్ల వాదనతో ఏకీభవిస్తూ గంభీర్ శైలిపై అసంతృప్తి వ్యక్తం చేయగా, మరికొందరు అతనికి మద్ధతుగా నిలిచినట్టు బోర్డు వర్గాలు చెబుతున్నాయి. జట్టు నిర్ణయాల్లో జోక్యం చేసుకోకూడదని మరికొందరు సూచించారని సమాచారం.

అయితే లంక పర్యటన తర్వాత ఈ మొత్తం పరిణామాలపై బీసీసీఐ సమీక్ష నిర్వహించే అవకాశముంది. రెండేళ్ల క్రితం ద్రవిడ్ పదవీకాలం ముగిసిన తర్వాత గంభీర్‌ను బీసీసీఐ ఏరికోరి తీసుకొచ్చింది. అతను అడిగిన అన్ని డిమాండ్లకు తలొగ్గి మరీ హెడ్ కోచ్‌గా బాధ్యతలు అప్పగించింది. అయితే గంభీర్ హయాంలో భారత జట్టు ప్రదర్శన అంత గొప్పగా ఏం లేదు.

Gambhir

టీ20 ఫార్మాట్‌లో ఛాంపియన్లుగా నిలిచినా టెస్టుల్లో మాత్రం దిగజారింది. స్వదేశంలో  న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల చేతిలో వైట్ వాష్ పరాభవాలను చవి చూసింది. ఇటీవల ఐర్లాండ్ , ఇంగ్లాండ్ చేతిలోనూ అవమానకర ఓటములు ఎదుర్కొంది.

ఇదిలా ఉంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే లంకపై భారత్ 2-0తో సిరీస్ గెలవాలి. ఒకవేళ శ్రీలంక చేతిలో సిరీస్ కోల్పోతే మాత్రం టెస్ట్ కోచ్‌గా గంభీర్ భవిష్యత్తు సందిగ్ధంలో పడినట్టేనని భావిస్తున్నారు.

Trisha : త్రిష పొలిటికల్ ఎంట్రీ ?.. మధురైలో పోస్టర్లు అదే కన్ఫమ్ చేస్తున్నాయా?

Exit mobile version