Trisha : త్రిష పొలిటికల్ ఎంట్రీ ?.. మధురైలో పోస్టర్లు అదే కన్ఫమ్ చేస్తున్నాయా?
Trisha : త్రిష రాజకీయ అరంగేట్రానికి ప్లాన్ చేసారన్న పుకార్లు ఇటీవల వినిపించాయి. అయితే ఏ రోజూ త్రిష మాత్రం వీటిపై స్పందించలేదు. రాజకీయాల్లోకి వస్తానని లేదా రానని క్లారిటీ ఇవ్వలేదు.
Trisha
తమిళనాడులో హీరో విజయ్ పార్టీ పెట్టిన కొద్దికాలంలోనే అధికారంలోకి వచ్చారు. కానీ విజయ్ పార్టీ పెట్టినప్పటి నుంచీ అక్కడి రాజకీయాలు మాత్రం హీరోయిన్ త్రిష(Trisha) చుట్టూనే తిరుగుతున్నాయి. విజయ్‌తో ఆమె సన్నిహితంగా ఉన్నట్టు వార్తలు రావడం, తర్వాత విజయ్ భార్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఎప్పుడైతే భార్య సంగీత కోర్టు మెట్లు ఎక్కారో త్రిషతో విజయ్ రిలేషన్ షిప్ గురించి అందరికీ స్పష్టత వచ్చేసింది. ఎన్నికల ఫలితాల సమయంలోనూ త్రిష(Trisha) తిరుమల వెళ్లి దర్శనం చేసుకోవడం, నేరుగా విజయ్ ఇంటికి వచ్చి సెలబ్రేషన్స్‌లో భాగమవడం కూడా హాట్ టాపిక్ అయ్యాయి.
అప్పటి నుంచి త్రిష రాజకీయాల్లోకి రావడం ఖాయమని చాలా వార్తలు వినిపించాయి. పైగా విజయ్ రెండు చోట్ల గెలవడంతో ఒక చోట రాజీనామా చేసారు. అక్కడ నుంచే త్రిష రాజకీయ అరంగేట్రానికి ప్లాన్ చేసారన్న పుకార్లు కూడా వినిపించాయి. అయితే ఏ రోజూ త్రిష మాత్రం వీటిపై స్పందించలేదు. రాజకీయాల్లోకి వస్తానని లేదా రానని కూడా క్లారిటీ ఇవ్వలేదు.
అయితే ఇదే సమయంలో ఏదో ఒకరోజు సీఎం అవుతానంటూ కొన్నేళ్ల క్రితం ఆమె ఇచ్చిన ఇంటర్యూ కూడా వైరల్ కావడంతో త్రిష పొలిటికల్ ఎంట్రీ ఖాయమని అంతా అనుకున్నారు.
తాజాగా త్రిష రాజకీయ అరంగేట్రం గురించి మరోసారి చర్చ మొదలైంది. తమిళనాడులోని మధురైలో ఏర్పాటు చేసిన పోస్టర్లే ఈ చర్చకు కారణం. త్రిష రాజకీయాల్లోకి రావాలని కోరుతూ కొందరు అభిమానులు కొన్ని పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. మధురై జిల్లా త్రిష నర్పణి మండ్రం పేరుతో వెలిసిన ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

ఎందుకంటే కొన్ని రోజులుగా త్రిష సినిమా కెరీర్ గురించి కూడా చాలా వార్తలు షికారు చేస్తున్నాయి. కొంతకాలంగా సినిమాలకు ఆమె దూరం కానున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో ఇలాంటి బ్యానర్లు ఏర్పాటు కావడం త్రిష పొలిటికల్ ఎంట్రీపై చర్చ తారాస్థాయికి చేరింది. ఇదిలా ఉంటే ఇప్పటికే విజయ్‌పై విమర్శలు చేస్తున్న కొంతమంది ప్రతిపక్ష నేతలు త్రిష పేరునే లాగుతున్నారు.
మరోవైపు ఉదయనిధి స్టాలిన్ ఆగస్ట్ 3న చేసిన పరోక్ష వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. టీవీకే నేతల ఫిర్యాదుతో ఉదయనిధి అరెస్ట్ కూడా అయ్యారు. అయితే కొద్ది సేపటికే హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదలయ్యారు. తమిళనాడులో త్రిషకు కూడా మంచి ఫాలోయింగే ఉంది. పైగా విజయ్‌తో రిలేషన్ షిప్ వార్తల తర్వాత టీవీకే కార్యకర్తలు, అభిమానులు ఆమె రాజకీయాల్లోకి రావాలని బలంగా కోరుతున్నారు.
Tariffs : వైట్‌హౌస్ వర్సెస్ 25 రాష్ట్రాలు.. అమెరికా కోర్టులో కొత్త లీగల్ వార్‌కు బ్రేకులు పడేనా





