Gambhir : గంభీర్ ప్లాన్స్ లో రోకో లేరా ?..వరల్డ్ కప్ ఆడతామంటున్న సీనియర్లు

Gambhir : వచ్చే వరల్డ్ కప్ ఆడాలనే ఆశతో రోకో జోడీ ఎదురుచూస్తుండగా, వారి భవిష్యత్తుపై హెడ్ కోచ్ గంభీర్ వైఖరి చర్చనీయాంశంగా మారింది.

Gambhir

వన్డే ప్రపంచకప్ కు ఇంకా 17 నెలలే మిగిలి ఉంది. 2023లో ట్రోఫీ తృటిలో చేజారిన వేళ ఈసారి ఎలాగైనా వరల్డ్ కప్ అందుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. ఈ మెగాటోర్నీ కోసం ఆఫ్ఘనిస్తాన్ తో వన్డే సిరీస్ నుంచే జట్టు కూర్పుపై కోచ్ గంభీర్ కసరత్తు చేస్తున్నాడు. అయితే జట్టులో సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ(రోకో జోడీ) భవిష్యత్తు ఏంటనేది చర్చనీయాంశంగా మారింది.

వచ్చే వరల్డ్ కప్ ఆడాలని రోకో జోడీ భావిస్తుండగా.. హెడ్ కోచ్ గంభీర్(Gambhir) మాత్రం అంత సానుకూలంగా లేడని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి రోహిత్, కోహ్లీ వన్డే రిటైర్మెంట్ కు కూడా కారణం గంభీరేనని చాలా మంది అభిమానుల అభిప్రాయం. అప్పుడు పొమ్మనలేక పొగబెట్టిన రీతిలో గంభీర్ వ్యవహరించడంతో రోకో జోడీ ఇప్పుడు వరల్డ్ కప్ ఆడుతుందా లేదా అనే చర్చ జరుగుతోంది.

ఎందుకంటే గంభీర్ కుర్రాళ్లను ఎక్కువగా ప్రోత్సహిస్తాడు. అలా అని రోహిత్, కోహ్లీలను పక్కన పెట్టే పరిస్థితి ఉండదు. వరల్డ్ కప్ ప్రారంభమయ్యే సమయానికి రోహిత్ , కోహ్లీ పూర్తి ఫిట్ గా ఉంటేనే తుది జట్టులో అవకాశం దక్కుతుంది. 2027 ప్రపంచకప్ సమయానికి కోహ్లీ 39కి, రోహిత్ శర్మ 41కి చేరువవుతారు.

వీరిద్దరిలో ఫిట్ నెస్ పరంగా కోహ్లీకి పేరు పెట్టే అవకాశమే లేదు. అయితే రోహిత్ శర్మ 41వ ఏట పూర్తి ఫిట్ నెస్ తో ఉంటాడా లేదా అన్నది చూడాలి. రోహిత్ తన ఫిట్ నెస్ కాపాడుకోవడం అంత సులువు కాదు. అలాగే ఫిట్ నెస్ తో పాటు ఫామ్ కూడా కొనసాగించాల్సిందే. వీరిద్దరిలో కోహ్లీకే కాస్త ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.

Gambhir

ఈ ఏడాదిన్నర కాలంలో టీమిండియా ఆడేది 9 మ్యాచ్ లే. దీంతో ప్రతీ మ్యాచ్ నూ తమ ఫామ్ నిరూపించుకునేందుకు, ఫిట్ గా ఉండేందుకు ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. అటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం సీనియర్లను వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో పక్కన పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

వారి స్థానంలో యువ ఆటగాళ్ల వైపే గౌతమ్ గంభీర్(Gambhir) మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఈ కారణంగానే కోహ్లీ, రోహిత్ ఇద్దరూ గంభీర్ పై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే తమ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్న విషయంపై నేరుగా బోర్డు పెద్దలతో మాట్లాడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. గంభీర్ తో తమకు సంబంధం లేదనీ, తమ ఫ్యూచర్ పై బీసీసీఐ పెద్దలే నిర్ణయించాలని కోరినట్టు ప్రచారం సాగుతోంది.

NEET Exam : విద్యార్థులకు బిగ్ రిలీఫ్..నీట్ ఎగ్జామ్స్ కు కొత్త రూల్స్

Exit mobile version