Harmanpreet : హర్మన్‌ప్రీత్‌కే పగ్గాలు..ఆసియా క్రీడలకు భారత జట్టు ఇదే

Harmanpreet : ఈసారి ఆసియా క్రీడలకు జపాన్‌లోని ఐచీ నగోయా నగరం ఆతిథ్యమిస్తోంది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకూ ఆసియాక్రీడలు జరగనున్నాయి.

Harmanpreet

ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల కోసం భారత మహిళల క్రికెట్ జట్టును ప్రకటించారు. ప్రస్తుత మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టినా మరోసారి సెలక్టర్లు హర్మన్‌ప్రీత్‌(Harmanpreet)  కౌర్ పైనే నమ్మకం ఉంచారు. ఏషియన్ గేమ్స్ కోసం హర్మన్ నే సారథిగా కొనసాగించారు.

కెప్టెన్‌గా స్మృతి మంధానను ఎంపిక చేశారు. నిజానికి టీ20 ప్రపంచకప్ వైఫల్యం కారణంగా హర్మన్‌ను తప్పిస్తారేమో లేకఆమె రిటైర్మెంట్ ప్రకటిస్తారేమో అన్న ప్రచారం జరిగింది. అయితే సెలక్టర్లు మాత్రం ఇప్పటికిప్పుడు కెప్టెన్సీ మార్పుపై సిద్ధంగా లేరని తెలుస్తోంది. అందుకే కెప్టెన్, వైస్ కెప్టెన్ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు.

అలాగే ప్రపంచకప్ లో ఆడిన జట్టునే దాదాపుగా కొనసాగించారు. వికెట్ కీపర్ యస్తికా భాటియాను తప్పించి 17 ఏళ్ల యువ సంచలనం కమలినికి పిలుపునిచ్చారు. దేశవాళీ క్రికెట్‌లో కమలిని నిలకడగా రాణిస్తోంది. ఇదిలా ఉంటే వరల్డ్ కప్ మధ్యలో గాయపడిన శ్రేయాంక పాటిల్‌ను ఆసియా క్రీడలకు ఎంపిక చేసారు. అయితే ఆమె ఫిట్‌నెస్ సాధిస్తేనే తుది జట్టులో ఆడే అవకాశం ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది.

గత ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత మహిళల జట్టు మరోసారి బంగారు పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్ లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి , షెఫాలీ వర్మ , జెమీమా రోడ్రిగ్స్ , రిచా ఘోష్‌తో బలంగానే ఉంది. బౌలింగ్ లో మరోసారి స్పిన్నర్లే కీలకం కాబోతున్నారు.

Harmanpreet

ప్రపంచకప్ లో అదరగొట్టిన తెలుగమ్మాయి శ్రీచరణి, దీప్తి శర్మ చోటు దక్కించుకున్నారు. అటు పేస్ ఎటాక్ లో రేణుకా సింగ్ , క్రాంతి గౌడ్ , అరుంధతి రెడ్డి, నందిని శర్మ బాధ్యతలు పంచుకోనున్నారు. ఈసారి ఆసియా క్రీడలకు జపాన్‌లోని ఐచీ నగోయా నగరం ఆతిథ్యమిస్తోంది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకూ ఆసియాక్రీడలు జరగనున్నాయి.

ఆసియా క్రీడలకు భారత మహిళల జట్టు ః
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి.కమలిని (వికెట్ కీపర్), భారతి ఫుల్మాలి, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, నందిని శర్మ.

What’s App : వాట్సాప్‌లో నో మోర్ ఫోన్ నెంబర్స్.. మీ యూజర్‌నేమ్ ఇప్పుడే లాక్ చేసుకోండి

Exit mobile version