IND vs SL
శ్రీలంక వేదికగా జరుగుతున్న ఏ జట్ల ట్రై సిరీస్ ఉత్కంఠతో ఊపేస్తోంది. అన్ని జట్లలోనూ యువ ఆటగాళ్లు అద్భుతంగా పోరాడుతుండడంతో మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. తాజాగా ఈ టోర్నీలో భారత్ కు మరో ఓటమి ఎదురైంది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన పోరులో విజయం ఇరు జట్లతో దోబూచులాడగా.. చివరకు శ్రీలంక(IND vs SL) ఏ జట్టు సూపర్ ఓవర్లో గెలిచింది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ ఏ 39 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. వైభవ్ సూర్యవంశీ (21) , ప్రభ్ సిమ్రన్ సింగ్ (11) నిరాశపరిచారు. తర్వాత తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ పార్టనర్ షిప్ తో ఆదుకున్నారు. తిలక్ వర్మ 23, రుతురాజ్ 37 పరుగులకు ఔటవగా.. ఇక్కడ నుంచి భారత్ మరో 3 వికెట్లు చేజార్చుకుంది. ఆయుశ్ బదోనీ (15), నిశాంత్ సింధు (6), అంకుల్ రాయ్ (8) విఫలమయ్యారు.
ఈ దశలో సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్ అద్భుతమైన పార్ట్ నర్ షిప్ తో ఆదుకున్నారు. వీరిద్దరూ 8వ వికెట్ కు 104 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి పార్ట్ నర్ షిప్ తోనే స్కోరు 250 దాటగలిగింది.
సూర్యాంశ్ 66 బంతుల్లో 72 (3 ఫోర్లు, 2 సిక్సర్లు) , విప్రజ్ 49 బంతుల్లో 51 ( 6 ఫోర్లు) పరుగులు చేశారు. దీంతో భారత్ ఏ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. లంక ఏ బౌలర్లలో మహ్మద్ షిరాజ్ 3 , విజయ్ కాంత్ 3 వికెట్లు తీశారు.
తర్వాత ఛేజింగ్ ప్రారంభం కాకముందే భారత్ కు అంపైర్లు భారీ షాక్ ఇచ్చారు. భారత బ్యాటర్లు పిచ్ పై పరిగెత్తడంతో అంపైర్లు 10 పరుగులు పెనాల్టీగా విధించారు. దీంతో ఒక బంతి కూడా పడకుండానే శ్రీలంకకు 10/0 పరుగులు వచ్చాయి. ఓపెనర్లు శ్రీలంక ఏ జట్టుకు మంచి ఆరంభాన్నే ఇచ్చారు.
తొలి వికెట్ కు 5 ఓవర్లలోనే 56 పరుగులు జోడించారు. ఆ తర్వాత లంక ఏ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. వికెట్లు పడినా సదీరా సమరవిక్రమ ఒంటరిగా పోరాడాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. కీలక సమయంలో ఔటై శతకం చేజార్చుకున్నాడు.
శ్రీలంక విజయానికి చివరి 6 బంతుల్లో 5 పరుగులు కావాల్సిన సమయంలో 8వ వికెట్‌గా సమరవిక్రమ ఔటవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. తర్వాతి నాలుగు బంతుల్లో భారత్ ఏ జట్టు 4 పరుగులే ఇవ్వడంతో మ్యాచ్ టై అయింది. తర్వాత సూపర్ ఓవర్లో శ్రీలంక(IND vs SL) విజయాన్ని అందుకుంది. లంక ఏ జట్టు 16 పరుగులు చేయగా.. భారత్ ఏ 9 పరుగులే చేయగలిగింది.
Nara Lokesh : లోకేష్, బ్రాహ్మణిల భక్తి రూపం..ఏకాదశ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం విశిష్టత ఇదే..
