Just Andhra PradeshJust SpiritualLatest News

Nara Lokesh : లోకేష్, బ్రాహ్మణిల భక్తి రూపం..ఏకాదశ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం విశిష్టత ఇదే..

Nara Lokesh :లోకేష్ దంపతులు నిర్వహించిన ఈ పూజతో.. అసలు ఈ ఏకాదశ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అంటే ఏంటి, దీనిని ఎందుకు నిర్వహిస్తారు

Nara Lokesh

ఏపీ మంత్రి నారా లోకేష్ తన భార్య బ్రాహ్మణితో కలిసి శివార్చనలో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. లోకేష్ దంపతులిద్దరూ సాంప్రదాయ వస్త్రాలు ధరించి శాస్త్రోక్తంగా ..ఏకాదశ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు.

దీనికి సంబంధించిన ఫోటోలను లోకేష్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. లోకేష్(Nara Lokesh )దంపతులు నిర్వహించిన ఈ పూజతో.. అసలు ఈ ఏకాదశ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అంటే ఏంటి, దీనిని ఎందుకు నిర్వహిస్తారు, దీని వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు, ఫలితాలు ఎలా ఉంటాయనే చర్చ మొదలయింది.

హిందూ సనాతన ధర్మంలో, ప్రధానంగా శైవ ఆరాధనలో ఈ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకానికి అత్యున్నతమైన స్థానం ఉన్నట్లు పెద్దలు చెబుతుంటారు.

శాస్త్రాలు చెబుతున్న దాని ప్రకారం, నమకం, చమకం అనే వేద మంత్రాలలోని న్యాస భాగాలను బాడీపై స్మరిస్తూ చేసే ఈ పూజ అత్యంత కఠినమైనది. అంతే శక్తివంతమైనది. న్యాసం అంటే భగవంతుని శక్తులను మనిషి శరీరంలోని వివిధ భాగాలలో ఆవాహన చేసుకోవడమని అర్థం.

ఈ పూజ చేసే సమయంలో రుద్రుని యొక్క 11 రూపాలను అంటే ఏకాదశ రుద్రులను ధ్యానిస్తూ, మహాన్యాస మంత్రాల ఉచ్ఛారణతో.. శివలింగానికి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేస్తారు.

Nara Lokesh
Nara Lokesh

సాధారణ అభిషేకంతో పోలిస్తే, ఈ ఏకాదశ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని వేద పండితులు చెబుతుంటారు. లౌకిక పరమైన సమస్యల నుంచి బయటపడటానికి, మానసిక ప్రశాంతత కోసం ,జీవితంలో అనుకున్న విజయాలు సాధించడం కోసం ఈ మహా క్రతువును నిర్వహిస్తారు.

ఈ విశిష్ట పూజని భక్తితో ఆచరించిన వారికి అకాల మృత్యు భయం తొలిగిపోయి దీర్ఘాయుష్షు లభిస్తుంది. జాతకంలో ఉండే ఘోరమైన కాలసర్ప దోషాలు, రాహు-కేతు దోషాలు , నవగ్రహాల ప్రతికూల ప్రభావాలు వంటివి ఈ పూజ మహిమ వల్ల శాంతించి అనుకూలంగా మారుతాయి.

Nara Lokesh
Nara Lokesh

అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ రుద్రాభిషేకం చేయడం వల్ల శారీరక దృఢత్వం, సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరగడానికి అలాగే వ్యాపార , రాజకీయ రంగాలలో ఉన్నవారికి శత్రు పీడ విముక్తి కలిగి విజయాలు దక్కడానికి ఈ పూజ అద్భుతంగా పనిచేస్తుంది.

కాగా నారా లోకేష్,బ్రాహ్మణి దంపతులు లోకకల్యాణార్థం , కుటుంబ శ్రేయస్సు కోసం ఇంత శక్తివంతమైన పూజను నిర్వహించినట్లు తెలుస్తోంది.

Pawan Kalyan : ఢిల్లీకొచ్చి మెడలు వంచుతామన్న వాళ్లేరి?.. ఢిల్లీ వేదికగా పవన్ పవర్‌ఫుల్ ప్రశ్న

Related Articles

Back to top button