IPL PlayOff : ప్లే ఆఫ్స్ కు రాజస్థాన్..పంజాబ్, కోల్ కతా ఔట్

IPL PlayOff : ఐపీఎల్ ప్లేఆఫ్ రేసులో ఎవరెక్కడ ?

IPL PlayOff

ఐపీఎల్ 19వ సీజన్ చివరి బెర్తుపై నెలకొన్న సస్పెన్స్ కు తెరపడింది. ముంబై ఇండియన్స్ ను ఓడించి 16 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ ఆద్యంతం అనూహ్య మలుపులు తిరుగుతూ సాగింది. ఒక దశలో ముంబై గెలిచేలా కనిపించినా డెత్ ఓవర్లలో రాయల్స్ అద్భుతంగా పుంజుకుని గెలిచింది. ఫలితంగా చేజేతులా ఓడిన ముంబై తనతో పాటు పంజాబ్ , కోల్ కతాను కూడా ఇంటికి పంపించింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ కావడంతో రాజస్థాన్ బ్యాటర్లు కాస్త ఒత్తిడిలో కనిపించారు. దానికి తగ్గట్టే ఆరంభంలో వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయింది. అంచనాలు పెట్టుకున్న జైస్వాల్ (27), వైభవ్ సూర్యవంశీ (2) నిరాశ పరిచారు. రియాన్ పరాగ్(14) సైతం మరోసారి ఫెయిలయ్యాడు. ఈ దశలో ధృవ్ జురెల్ , దసున్ శనక ఆదుకునే ప్రయత్నం చేశారు.

వీరిద్దరూ నాలుగో వికెట్ కు 45 పరుగులు జోడించారు. శనక 15 బంతుల్లో 29 (3 సిక్సర్లు) ధాటిగా ఆడే క్రమంలో ఔటవగా.. జురెల్ 26 బంతుల్లో 38 (3 ఫోర్లు, 2 సిక్సర్లు) రన్స్ కు వెనుదిరిగాడు. ఇక్కడ నుంచి రాజస్థాన్ వరుసగా వికెట్లు కోల్పోయినా కీలక భాగస్వామ్యాలు నెలకొల్పింది. ఫెరీరా 18 పరుగుల చేయగా.. ఆర్చర్ మెరుపులు మెరిపించాడు. 15 బంతుల్లోనే 1 ఫోర్, 3 సిక్సర్లతో 32 పరుగులు చేశాడు. చివర్లో రవీంద్ర జడేజా(18) నాటౌట్ , బర్గర్ (10) నాటౌట్ గా నిలవడంతో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 205 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో దీపక్ చాహర్ 2, శార్థూల్ ఠాకూర్ 2 వికెట్లు తీసారు.

ఛేజింగ్ లో ముంబై ఇండియన్స్ కు ఆరంభంలో భారీ షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌటయ్యాడు. కాసేపటికే రికెల్టన్ (12), నమన్ ధీర్ (6), తిలక్ వర్మ (3) ఔటవడంతో ముంబై 38 రన్స్ కే 4 వికెట్లు కోల్పోయింది. భారీ లక్ష్యఛేదనలో పవర్ ప్లేలోనే 4 కీలక వికెట్లు చేజార్చుకోవడంతో ముంబై ఓటమి ఖాయమనుకున్నారు.

IPL PlayOff

ఈ దశలో ఫామ్ లో లేని సూర్యకుమార్ యాదవ్ , విల్ జాక్స్ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ 63 పరుగులు జోడించారు. విల్ జాక్స్ 33 (18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔటైన తర్వాత హార్థిక్ పాండ్యాతో కలిసి సూర్యకుమార్ ఇన్నింగ్స్ కొనసాగించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు క్రీజులోకి వస్తూనే పాండ్యా కూడా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ 48 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పడంతో ముంబై గెలుపు ఖాయమనిపించింది.

అయితే అనూహ్యంగా డెత్ ఓవర్లలో రాజస్థాన్ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. వరుసగా పాండ్యా ( 15 బంతుల్లో 34 )తో పాటు సూర్యకుమార్, కార్బిన్ బోస్చ్ లను ఔట్ చేసారు. ఇక్కడ నుంచి ముంబై కోలుకోలేకపోయింది. ఫలితంగా 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులే చేయగలిగింది. ముంబై ఓటమితో పంజాబ్ , కోల్ కతా కూడా నిష్క్రమించాయి.

HILT Policy:హిల్ట్ పాలసీపై రాజుకున్న రాజకీయ రచ్చ.. ప్రతిపక్షాల ఆరోపణల నడుమే గైడ్‌లైన్స్ విడుదల

Exit mobile version