Punjab Kings : 265 ఊదేశారు…పంజాబ్ రికార్డు ఛేజింగ్

Punjab Kings : ఐపీఎల్ 19వ సీజన్ లో పంజాబ్ కింగ్స్ కు ఎదురులేకుండా పోతోంది. వరుస విజయాలతో దుమ్మురేపుతోంది. అది కూడా రికార్డుల మోత మోగిస్తూ జైత్రయాత్ర కొనసాగిస్తోంది

Punjab Kings

ఐపీఎల్ 19వ సీజన్ లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) కు ఎదురులేకుండా పోతోంది. వరుస విజయాలతో దుమ్మురేపుతోంది. అది కూడా రికార్డుల మోత మోగిస్తూ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. 265 పరుగుల టార్గెట్ ను అలవోకగా అందుకుని సరికొత్త హిస్టరీ క్రేయేట్ చేసింది.

ఇంత భారీస్కోరు చేసినా పేలవ బౌలింగ్ తో ఢిల్లీ పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్ లో ఎవ్వరూ ఊహించని విధంగా పరుగుల వరద పారింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి సరైన ఆరంభం దక్కలేదు. నిస్సాంక మరోసారి నిరాశపరిచాడు. అయితే నితీష్ రాణా, కేఎల్ రాహుల్ తర్వాత విధ్వంసం సృష్టించారు.

పవర్ ప్లేలో 68 పరుగులు చేసిన పంజాబ్ తర్వాత చెలరేగిపోయింది. రాహుల్, రాణా దొరికిన బంతిని దొరికినట్టుగా స్టాండ్స్ లోకి పంపిస్తూనే ఉన్నారు. దీంతో అరుణ్ జైట్లీ స్టేడియం బౌండరీలు, సిక్సర్లతో తడిసిముద్దయింది. వీరిద్దరూ రెండో వికెట్ కు 95 బంతుల్లోనే 220 పరుగులు జోడించారంటే వారి విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు.

నితీష్ రాణా 44 బంతుల్లో 91 (11 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులకు ఔటవగా.. రాహుల్ 47 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. రాహుల్ ఐపీఎల్ కెరీర్ లో ఇదే ఆరో సెంచరీ. శతకం తర్వాత మరింత దూకుడుగా ఆడిన రాహుల్ ఢిల్లీకి 264 పరుగుల భారీస్కోరు అందించాడు. ఈ క్రమంలో ఐపీఎల్ కెరీర్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు. కెఎల్ రాహుల్ 67 బంతుల్లో 152 (16 ఫోర్లు, 9 సిక్సర్లు) పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

తర్వాత భారీ లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్(Punjab Kings) పక్కా వ్యూహంతో ఆడింది. ఫ్లాట్ పిచ్ కావడంతో పవర్ ప్లేలో వీలైనన్ని ఎక్కువ రన్స్ చేయడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ సిక్సర్లతోనే పవర్ ప్లేలో హోరెత్తించారు. భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ఫలితంగా పవర్ ప్లేలోనే పంజాబ్ కింగ్స్ వికెట్ కోల్పోకుండా 116 పరుగులు చేసింది.

Punjab Kings

ముకేశ్ కుమార్ వేసిన ఆరో ఓవర్లో ప్రభ్ సిమ్రన్ వరుసగా ఆరు ఫోర్లు బాదాడు. తొలి వికెట్ కు వీరిద్దరూ 126 పరుగులు జోడించగా ప్రియాన్ష్ ఆర్య (43) పరుగులకు ఔటయ్యాడు. తర్వాత కూపర్ కన్నోలీ (17), ప్రభ్ సిమ్రన్ సింగ్ 26 బంతుల్లో 76 ( 9 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగులకు ఔటయ్యారు. దీంతో పంజాబ్ టార్గెట్ ఛేజ్ చేయగలదా అనిపించింది.

ఈ దశలో శ్రేయాస్ అయ్యర్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. నేహల్ వధేరా, శశాంక్ సింగ్ లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. శ్రేయాస్ కేవలం 36 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 71 నాటౌట్ గా నిలిచాడు. శ్రేయాస్ దూకుడుతో పంజాబ్ కింగ్స్ మరో 7 బంతులు మిగిలుండగానే టార్గెట్ ను ఛేదించింది. టీ20 చరిత్రలోనే ఇదే అత్యధిక ఛేదన. శ్రేయాస్ అయ్యర్ ఇచ్చిన క్యాచ్ లను వదిలేయడం కూడా ఢిల్లీ ఓటమికి కారణమైంది.

CSK : చెన్నై జోరుకు గుజరాత్ బ్రేక్ వేస్తుందా ?..చెపాక్ వేదికగా కీలక మ్యాచ్

Exit mobile version