Punjab Kings : చెపాక్ లో పంజాబ్ ధనాధన్…చెన్నై కు మరో ఓటమి

Punjab Kings : వేదిక మారినా చెన్నై సూపర్ కింగ్స్ కు విజయం అందలేదు. సొంతగడ్డపై బ్యాట్ తో అదరగొట్టినా బౌలర్లు రాణించకపోవడంతో సీఎస్కే వరుసగా రెండో ఓటమి చవిచూసింది.

Punjab Kings

వేదిక మారినా చెన్నై సూపర్ కింగ్స్ కు విజయం అందలేదు. సొంతగడ్డపై బ్యాట్ తో అదరగొట్టినా బౌలర్లు రాణించకపోవడంతో సీఎస్కే వరుసగా రెండో ఓటమి చవిచూసింది. చెపాక్ పిచ్ పై టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్(Punjab Kings) బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ తో పోలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ సొంతగడ్డపై అదరగొట్టింది.

పేలవ బ్యాటింగ్ ను అధిగమిస్తూ భారీస్కోరు సాధించింది. నిజానికి భారీ అంచనాలు పెట్టుకున్న సంజూ శాంసన్ (7) మరోసారి ఫెయిలయ్యాడు. అయితే ఆయుష్ మాత్రే, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దుమ్మురేపారు. ముఖ్యంగా చిచ్చర పిడుగు మాత్రే రెచ్చిపోయాడు. పంజాబ్(Punjab Kings) బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.

అటు రుతురాజ్ కూడా ధాటిగానే ఆడాడు. వీరిద్దరూ 55 బంతుల్లోనే 96 పరుగుల పార్టనర్ షిప్ సాధించారు. రుతురాజ్ గైక్వాడ్ 22 బంతుల్లో 28 పరుగులు చేసి ఔటవగా.. ఆయుశ్ మాత్రే 43 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 73 రన్స్ చేశాడు. తర్వాత కార్తీక్ శర్మ విఫలమైనా.. శివమ్ దూబే, సర్ఫరాజ్ ఖాన్ మెరుపులు మెరిపించారు.

సర్ఫరాజ్ ఖాన్ కేవలం 12 బంతుల్లోనే 32 (6 ఫోర్లు, 1 సిక్సర్ ) పరుగులు చేయగా… దూబే కూడా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 27 బంతుల్లోనే 45 ( 5 ఫోర్లు, 1 సిక్సర్ ) పరుగులు చేశాడు. ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్ 209 పరుగులు చేసింది, పంజాబ్ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ 2 వికెట్లు, చాహల్ 1 వికెట్ పడగొట్టారు. అయితే అర్షదీప్ సింగ్ 41, బార్ట్ లెట్ 48 , జాన్సన్ 43 పరుగులు సమర్పించుకున్నారు.

Punjab Kings

పిచ్ ఫ్లాట్ గా ఉండడంతో పంజాబ్ కింగ్స్(Punjab Kings) ఆరంభం నుంచే రెచ్చిపోయింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ తొలి వికెట్ కు కేవలం 4.2 ఓవర్లలోనే 61 పరుగులు జోడించారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ప్రియాన్ష్ ఆర్య చెన్నై బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 11 బంతుల్లోనే 39 (3 ఫోర్లు, 4 సిక్సర్లు) బాదాడు.

అటు ప్రభ్ సిమ్రన్ సింగ్ కూడా దూకుడుగా ఆడడంతో పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేలో 68 పరుగులు చేసింది. ప్రభ్ సిమ్రన్ సింగ్ 34 బంతుల్లో 43 (6 ఫోర్లు, 1 సిక్సర్ ) పరుగులు చేయగా.. తర్వాత శ్రేయాస్ అయ్యర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నై బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కూపర్ కన్నోలీతో కలిసి 32 , నేహల్ వధేరాతో కలిసి 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

ఈ క్రమంలో కేవలం 29 బంతుల్లోనే 50 (4 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేశాడు. అటు కూపర్ కన్నోలీ 36 పరుగులకు ఔటైనా శశాంక్ సింగ్, స్టోయినిస్ పంజాబ్ విజయాన్ని పూర్తి చేశారు. పంజాబ్ మరో 8 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది.

Kurukshetram : ”కురుక్షేత్రం”కు బాలయ్య రెడీ…యంగ్ డైరెక్టర్ తో పౌరాణికం

Exit mobile version