Kurukshetram : ”కురుక్షేత్రం”కు బాలయ్య రెడీ…యంగ్ డైరెక్టర్ తో పౌరాణికం
Kurukshetram : బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబోలో ‘కురుక్షేత్రం’.. అంచనాలు పెంచుతున్న లేటెస్ట్ అప్డేట్
Kurukshetram
నందమూరి బాలకృష్ణ సినిమాల ఎంపికలో ట్రెండ్ మారుస్తూ వస్తున్నారు. రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ స్టోరీలతో ఒకప్పుడు టాలీవుడ్ ను షేక్ చేసిన బాలయ్య మధ్య మధ్యలో పౌరాణిక టచ్ ఉన్న చిత్రాల్లోనూ సందడి చేశారు. మాస్ ఆడియన్స్ కోసం సీనియర్ దర్శకులతో వరుస సినిమాలు చేస్తున్న నందమూరి నటసింహం.. ఇటు యంగ్ డైరెక్టర్స్ పైనా కన్నేశారు.
డిఫరెంట్ స్టోరీలతో ట్రెండింగ్ లో ఉండే యువ దర్శకులను గమనిస్తూ వారికి అవకాశాలిస్తుంటారు. తాజాగా అంటే సుందరానికీ, సరిపోదా శనివారం వంటి చిత్రాలతో టాలీవుడ్ లో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయతో బాలయ్య మూవీ చేయబోతున్నారు. అది కూడా పౌరాణిక కథకు కమిట్ అయ్యారని సమాచారం.
త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ విలక్షణమైన కథలతో తన కంటూ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్నారు. అలాంటి డైరెక్టర్ తో బాలకృష్ణ చేయబోతున్న పౌరాణిక చిత్రానికి కురుక్షేత్రం(Kurukshetram) టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

ఈ టైటిల్ ను బట్టి పౌరాణిక కథగా భావిస్తున్నారు. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న కథల్లోనూ బాలయ్య పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో ఆయన శ్రీ రామ రాజ్యం, ‘ గౌతమీపుత్ర శాతకర్ణి’ తో ఎలా ఆకట్టుకున్నారో అభిమానులు చూశారు. ఇప్పుడు వివేక్ ఆత్రేయ విలక్షణమైన కథకు, డైరెక్షన్ కు బాలయ్య అదే నటన వేరే లెవెల్ అంటూ ఫ్యాన్స్ హల్ చల్ చేస్తున్నారు. కాగా ఈ మూవీకి మైత్రి మూవీమేకర్స్ నిర్మాతగా వ్యవహరించనుంది.
ప్రస్తుతం బాలకృష్ణ వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన మలినేని గోపీచంద్ దర్శకత్వంలోమూవీ చేస్తున్నారు. ఇది ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగే పవర్ ఫుల్ గ్యాంగ్స్టర్ కథగా చెబుతున్నారు. దీనిలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీని సంక్రాంతి 2027 కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
సంక్రాంతి బరిలో నిలిచిన ప్రతీసారీ బాలయ్య సూపర్ హిట్లను సొంతం చేసుకున్నారు. దీంతో ఆ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు మేకర్స్. గోపీచంద్ మలినేని మూవీ తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్న బాలకృష్ణ కురుక్షేత్రం(Kurukshetram) కోసం ఎప్పుడు డేట్లు ఇస్తారో చూడాలి.
Summer Holidays : ఇక వేసవి సెలవులు..పిల్లలకు మీరు నేర్పాల్సినవి ఇవే





