IPL Final : ఐపీఎల్ ఫైనల్ కు వర్షం ముప్పుందా ?..మ్యాచ్ రద్దయితే విజేత ఆ జట్టే

IPL Final : నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యమిస్తున్న ఈ మెగా ఐపీఎల్ ఫైనల్ కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

IPL Final

ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్ కు కౌంట్ డౌన్ మొదలైంది. అహ్మదాబాద్ వేదికగా జరగబోయే టైటిల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ వరుసగా రెండో టైటిల్ టార్గెట్ గా బరిలోకి దిగుతుంటే.. మూడోసారి ఫైనల్ చేరిన గుజరాత్ కూడా రెండో టైటిల్ కోసం ఎదురుచూస్తోంది. క్వాలిఫైయర్ 1ను రిపీట్ చేయాలని ఆర్సీబీ భావిస్తుంటే రివెంజ్ కోసం గుజరాత్ ఉవ్విళ్లూరుతోంది.

నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యమిస్తున్న ఈ మెగా ఫైనల్ కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 30 శాతం వరకు వర్షం కురిసే అవకాశముందని సమాచారం. దీంతో మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుందనే దానిపై చర్చ మొదలైంది. మిగిలిన నాకౌట్ మ్యాచ్‌ల మాదిరిగానే ఈ మ్యాచ్‌కు కూడా 120 నిమిషాల ఎక్స్ ట్రా టైం ఇస్తారు.

అయితే ఫైనల్(IPL Final) కు రిజర్వ్ డే కేటాయించారు. వీలైనంతగా ఆదివారమే మ్యాచ్ పూర్తి చేసేందుకు అంపైర్లు ప్రయత్నిస్తారు. సమయం మించిపోతుంటే ఓవర్లను కుదిస్తూ వస్తారు. ఫలితం తేలాలంటే ఇరు జట్లు కనీసం 5 ఓవర్ల చొప్పున ఆడాలి.. 5 ఓవ‌ర్ల మ్యాచ్ నిర్వ‌హించ‌డానికి చివరి కటాఫ్ టైం రాత్రి 11.55 గంటల వరకూ ఉంటుంది.

ఐదు ఓవర్ల మ్యాచ్ నిర్వహణ కూడా కుదరకపోతే అర్థరాత్రి 12.50 లోపు సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. దానికి కూడా వాతావరణం అనుకూలంగా లేకుంటే మ్యాచ్ ను రిజర్వ్ డేకు మారుస్తారు. మ్యాచ్ ఆరంభమై ఆగిపోతే ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచి రిజర్వ్ డే రోజున మ్యాచ్ ను కొనసాగిస్తారు.

IPL Final

రిజ‌ర్వ్ డే రోజు కూడా మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాక‌పోతే లీగ్ ద‌శ‌లో పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో నిలిచిన జ‌ట్టును విజేత‌గా ప్ర‌క‌టిస్తారు. దీని ప్రకారం గ్రూప్ స్టేజ్ లో ఆర్సీబీ అగ్రస్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది.

ఇక్కడ యావరేజ్ స్కోరు 186 పరుగులుగా ఉంది. అయితే ఫైనల్(IPL Final) కావడంతో రెండు జట్లలోనూ టీ20 స్టార్స్ ఉన్న నేపథ్యంలో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. 200 ప్లస్ స్కోర్లు నమోదవచ్చు. గత రికార్డుల విషయానికొస్తే 9 మ్యాచ్ లలో బెంగళూరు ఐదు సార్లు, గుజరాత్ నాలుగింటిలో గెలిచాయి.

Blue Moon :3 ఏళ్ల తర్వాత అరుదైన బ్లూ మూన్ వింత..భారత్‌లో ఎప్పుడు కనిపిస్తుందో తెలుసా?

Exit mobile version