Rohit Sharma : లండన్‌కు రోహిత్ పేరెంట్స్..సెలక్టర్లతో హిట్ మ్యాన్ వాగ్వాదం..అసలేం జరుగుతోంది ?

Rohit Sharma : రోహిత్ శర్మకు ప్రపంచకప్‌లో అద్భుతమైన రికార్డుంది. మెగాటోర్నీ అంటే చాలు పూనకం వచ్చినట్టుగా చెలరేగిపోతాడు.

Rohit Sharma

రెండురోజులుగా రోహిత్ శర్మ(Rohit Sharma) రిటైర్మెంట్ గురించి మీడియాలో ఎడతెగని చర్చ జరుగుతోంది. వన్డే ప్రపంచకప్ ప్లాన్స్‌లో రోహిత్ లేడని సెలక్టర్లు అతనికి చెప్పారని, లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగే మూడో వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌కు రోహిత్ వీడ్కోలు పలకబోతున్నాడనే ప్రచారం తారాస్థాయికి చేరింది.

అయితే దీనిపై ఇప్పటి వరకూ బీసీసీఐ నుంచి గానీ, ఇటు రోహిత్ వైపు నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. భారత క్రికెట్ జట్టు మేనేజ్‌మెంట్ సైతం దీనిపై స్పందించలేదు. అయినా జరుగుతున్న కొన్ని వరుస పరిణామాలతో రోహిత్ రిటైర్మెంట్ దాదాపుగా ఖాయమైందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ఇంగ్లాండ్‌తో మూడో వన్డేకు ముందు రోహిత్(Rohit Sharma) తల్లిదండ్రులు లండన్ చేరుకున్నారు. నిజానికి గతంలో ఎప్పుడూ కూడా రోహిత్ పేరెంట్స్ స్టేడియానికి వచ్చి మ్యాచ్‌లు చూసిన సందర్భాలు లేవు.

అలాంటిది ఇప్పుడు ఏకంగా లండన్‌కు రావడంతో ఏదో కీలక నిర్ణయమేనని కొంతమంది భావిస్తున్నారు. తమ కుమారుడిని చివరిసారిగా టీమిండియా జెర్సీలో ప్రత్యక్షంగా చూసుకోవడానికే రోహిత్ తల్లిదండ్రులు లండన్‌కు వచ్చారని అంటున్నారు.

మరోవైపు ఇంగ్లాండ్‌తో రెండో వన్డే సందర్భంగా కోహ్లీ, రోహిత్ పక్కపక్కనే కూర్చున్న ఫోటో వైరల్ అవుతోంది. గతేడాది ఆసీస్ టూర్ సందర్భంగా అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటనకు ముందు అతని పక్కనే కూడా కోహ్లీ కూర్చున్నాడు. దీంతో అదే సీన్ మళ్లీ రిపీట్ అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉంటే ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ఆరంభానికి ముందే సెలక్టర్లు హిట్ మ్యాన్‌తో మాట్లాడినట్టు తెలిసింది. ప్రపంచకప్‌కు యువ జట్టునే అనుకుంటున్నామనీ, ఆ ప్లాన్స్‌లో లేవంటూ రోహిత్‌కు అగార్కర్ చెప్పేసినట్టు సమాచారం. దీనిపై రోహిత్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

తాను ఫిట్నెస్‌పై మరింత ఫోకస్ పెట్టి జట్టులో కొనసాగుతానని హిట్ మ్యాన్ చెప్పగా , సెలక్టర్లు నిరాకరించినట్టు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతోనే లార్డ్స్ వేదికగానే రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పబోతున్నట్టు తెలుస్తోంది.

Rohit Sharma

కాగా రోహిత్ శర్మకు ప్రపంచకప్‌లో అద్భుతమైన రికార్డుంది. మెగాటోర్నీ అంటే చాలు పూనకం వచ్చినట్టుగా చెలరేగిపోతాడు. అలాంటి హిట్ మ్యాన్‌ను ఇప్పుడు అదే ప్రపంచకప్‌కు పక్కన పెట్టడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించిన రోహిత్.. ఇక మీదట టీమిండియాలో కనిపించడన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Sonam Wangchuk : చనిపోయినా దెయ్యంగానైనా తిరిగొస్తా..సోనమ్ వాంగ్‌చుక్ వ్యాఖ్యలు వారిని కదిలిస్తాయా?

Exit mobile version