Sunrisers Hyderabad
సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) టాప్ లేపింది. పంజాబ్ కింగ్స్ పై రివెంజ్ తీర్చుకుంది. కోల్ కతా చేతిలో ఓటమి నుంచి త్వరగానే కోలుకున్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ కు దూరమైన సన్ రైజర్స్(Sunrisers Hyderabad) ఆల్ రౌండర్ నితీష్ రెడ్డి తిరిగి వచ్చాడు.
ఎప్పటిలానే హైదారాబాద్ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ పంజాబ్ బౌలర్లను ఆటాడుకున్నారు. తొలి వికెట్ కు 3.3 ఓవర్లలోనే 54 పరుగులు జోడించారు. భారీ షాట్ ఆడే క్రమంలో అభిషేక్ శర్మ 13 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 35 పరుగులకు ఔటయ్యాడు. తర్వాత ఇషాన్ కిషన్, హెడ్ రెండో వికెట్ కు 30 పరుగులు జోడించారు.
హెడ్ 38 ( 3 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులకు ఔటైన తర్వాత క్లాసెన్ ఎంట్రీతో సన్ రైజర్స్(Sunrisers Hyderabad) స్కోరు బోర్డు టాప్ గేర్ లో సాగింది. ఇషాన్ కిషన్ ఒకవైపు, క్లాసెన్ మరోవైపు పంజాబ్ బౌలర్లను ఊచకోత కోసారు. కొడితే సిక్సర్ లేకుంటే ఫోర్ అన్న రీతిలో వీరి బ్యాటింగ్ సాగింది. ఈ క్రమంలో క్లాసెన్, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.
ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 55 (2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఔటైనా క్లాసెన్ , నితీష్ కుమార్ రెడ్డితో కలిసి విధ్వంసాన్ని కొనసాగించాడు. వీరిద్దరూ చెలరేగి ఆడడంతో చివర్లో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిసింది. క్లాసెన్ 43 బంతుల్లో 69 ( 3 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులకు చివరి బంతికి ఔటయ్యాడు. ప్రస్తుతం క్లాసెన్ ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ ప్లేస్ కు దూసుకొచ్చాడు.
చివర్లో నితీశ్ రెడ్డి 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 235 పరుగులు చేసింది. ఫీల్డింగ్ లో పంజాబ్ పలు క్యాచ్ లను జారవిడవడం కూడా సన్ రైజర్స్ కు బాగా కలిసొచ్చింది.
భారీ టార్గెట్ అయినా ఫ్లాట్ వికెట్ కావడంతో పంజాబ్ కింగ్స్ చెలరేగుతుందని అంతా అనుకున్నారు. అయితే సన్ రైజర్స్ బౌలర్లు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. తొలి ఓవర్ నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఈ క్రమంలో పంజాబ్ ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (1), ప్రభ్ సిమ్రన్ సింగ్ (3) పరుగులకే వెనుదిరిగారు.
శ్రేయాస్ అయ్యర్ (3) కూడా త్వరగానే ఔటవడంతో పంజాబ్ పై ఒత్తిడి పెరిగింది. స్టోయినిస్(28)ధాటిగా ఆడినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. సుయాన్ష్ (25), శశాంక్ సింగ్ నిరాశపరిచారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కూపర్ కన్నోలీ మాత్రం పోరాడాడు. టెయిలెండర్ మార్కో జెన్సన్ తో కలిసి దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ 68 పరుగులు జోడించారు. కూపర్ కన్నోలీకి మరో హిట్టర్ తోడుంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది. ఎందుకంటే కన్నోలీ చివర్లో సిక్సర్లతో చెలరేగిపోయాడు.
ఈ క్రమంలో సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. కూపర్ కన్నోలీ పోరాడడంతోనే పంజాబ్ స్కోరు 200 దాటగలిగింది. కన్నోలీ 59 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 107 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. సన్ రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 2 , శివాంగ్ కుమార్ 2 వికెట్లు పడగొట్టారు.
Gond Kathira :గోంద్ కతీరా పేరు ఎప్పుడైనా విన్నారా? ఈ సమ్మర్‌లో అస్సలు లైట్ తీసుకోకండి..
