Team India
గువాహటి వేదికగా బుధవారం సెప్టెంబర్ 30న జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ జంట.. విండీస్ బౌలింగ్ అటాక్‌ను ఊచకోత కోసింది. విండీస్ జట్టు నిర్దేశించిన 406 పరుగుల భారీ టార్గెట్‌ను చూసి ఎవరైనా కాస్త వెనకడుగు వేస్తారేమో .. టీమిండియా మాత్రం ఇదేం పెద్ద లెక్కే కాదన్నట్లు విరుచుకుపడింది.
రోహిత్ శర్మ సెంచరీ మోత, గిల్ రికార్డుల డబుల్ సెంచరీ ధాటికి కొండంత టార్గెట్ ఒక్కసారిగా చాపచుట్టేసింది. కేవలం 43.3 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లను మాత్రమే కోల్పోయి 8 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించిన భారత్, మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సొంతం చేసుకుంది.
మరోవైపు వెస్టిండీస్ బౌలర్లు వేసిన ప్రతీ బాల్‌ను స్టేడియం దాటిస్తూ శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ క్రియేట్ చేసిన రికార్డుల విస్ఫోటనం ..క్రికెట్ చరిత్రలోనే సరికొత్త హిస్టరీని లిఖించింది. గువాహటి వేదికగా జరిగిన రెండో వన్డేలో ఈ ఇద్దరు బ్యాటర్లు పాత రికార్డులను దుమ్ముదులిపేస్తూ వరల్డ్ క్రికెట్‌ను తమ వైపు తిప్పుకున్నారు. మ్యాచ్ రిజల్ట్ కంటే కూడా వీరు నమోదు చేసిన చారిత్రక గణాంకాలే ఇప్పుడు క్రీడా ప్రపంచాన్ని ఊపేస్తున్నాయి.
ఈ మ్యాచ్‌లో అసలైన సింహస్వప్నం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అనక తప్పదు. స్టార్టింగ్ నుంచే విండీస్ బౌలింగ్ అటాక్‌ను అడ్డుకున్న గిల్, కేవలం 62 బాల్స్‌లోనే శతకం బాది భారత(Team India) వన్డే కెప్టెన్లలోనే అత్యంత ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. అక్కడితో ఆగిపోకుండా మరింత విధ్వంసకరంగా మారి కేవలం 117 బంతుల్లోనే డబుల్ సెంచరీని కూడా కంప్లీట్ చేశాడు.
దీంతో గతంలో వన్డే చరిత్రలోనే ఇషాన్ కిషన్ పేరుతో ఉన్న 126 బంతుల్లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ ప్రపంచ రికార్డును గిల్ బ్రేక్ చేశాడు. గిల్ కెరీర్‌లో ఇది సెకండ్ వన్డే డబుల్ సెంచరీ కావడం మరో విశేషం. 2023లో న్యూజిలాండ్‌పై హైదరాబాద్‌లో తొలి డబుల్ సెంచరీ చేసిన గిల్, వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు బాదిన రెండో బ్యాటర్‌గా రోహిత్ శర్మ పక్కకు చేరాడు.
చివరకు 223 నాటౌట్ రన్స్‌తో తన కెరీర్ బెస్ట్ స్కోరును ఎంటర్ చేయడమే కాకుండా, వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఏకంగా 333 రన్స్ సాధించి మార్టిన్ గప్తిల్ (342 రన్స్) తర్వాతి ప్లేస్‌లో నిలిచాడు. అంతేకాదు, 2022 నుంచి వన్డేల్లో ఏకంగా 10 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకుని రికార్డుల వేటలో టాప్‌లో నిలబడ్డాడు.
మరోవైపు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్‌లో ఏమాత్రం తగ్గకుండా గాడ్ ఆఫ్ క్రికెట్ అని ముద్దుగా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ ఆల్ టైమ్ రికార్డును తుడిచిపెట్టేశాడు. కేవలం 72 బాల్స్‌లోనే సెంచరీ కంప్లీట్ చేసిన రోహిత్, వన్డేల్లో 12వేల పరుగుల చారిత్రక మైల్‌స్టోన్‌ను దాటేశాడు.
భారత(Team India) తరఫున సచిన్, కోహ్లీ తర్వాత ఈ క్రెడిట్ సాధించిన మూడో బ్యాటర్‌గా, వరల్డ్ వైడ్‌గా చూస్తే ఏడో ఆటగాడిగా నిలిచాడు. అయితే ఇక్కడ విశేషమేమిటంటే రోహిత్ ఈ 12వేల పరుగుల మైల్‌స్టోన్‌ను కేవలం 282 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించాడు. అంటే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ (300 ఇన్నింగ్స్‌లు) కంటే 18 ఇన్నింగ్స్‌ల ముందే ఈ రికార్డును రీచయ్యాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (242 ఇన్నింగ్స్‌లు) మాత్రం రోహిత్ కంటే ముందే ఉన్నాడు.
Emotional Immaturity : ఎమోషనల్ ఇన్ మెచ్యూరిటీకి చెక్ పెట్టే 4 గోల్డెన్ రూల్స్
