Vaibhav Sooryavanshi : బుడ్డోడు కాదురా బుల్డోజర్..వైభవ్ విధ్వంసానికి నో బ్రేక్

Vaibhav Sooryavanshi : గత ఏడాది కాలంగా అండర్ 19 క్రికెట్ లో దుమ్మురేపిన ఈ చిచ్చర పిడుగు ఐపీఎల్ లో మరోసారి విరుచుకుపడుతున్నాడు

Vaibhav Sooryavanshi

15 ఏళ్ల వయసులో ఏ కుర్రాడైనా ఏం చేస్తాడు దోస్తులతో గల్లీలో క్రికెట్ ఆడతాడు లేకుంటే స్కూల్ స్థాయిలో మ్యాచ్ లు ఆడతాడు. ఇంకా, టాలెంట్ తో అయితే స్టేట్ లెవెల్ టీమ్ లో ఆడతాడు. కానీ వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) మాత్రం వేరే లెవెల్. 13 ఏళ్ల నుంచే రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతూ ఇప్పుడు 15 ఏళ్లకే ఐపీఎల్ లో సంచలనాలు సృష్టిస్తున్నాడు.

గత ఏడాది కాలంగా అండర్ 19 క్రికెట్ లో దుమ్మురేపిన ఈ చిచ్చర పిడుగు ఐపీఎల్ లో మరోసారి విరుచుకుపడుతున్నాడు. ప్రత్యర్థి బౌలర్లు ఏదో దేశవాళీ క్రికెట్ లో బౌలింగ్ చేసే వాళ్లేం కాదు. అంతర్జాతీయ క్రికెట్ లో ఎంతో అనుభవమున్న బౌలర్లు. అలాంటి బౌలర్లను ఉతికారేస్తున్నాడు. బుమ్రా నుంచి కమిన్స్ వరకూ బౌలింగ్ చేసేది ఎవ్వరైనా బుడ్డోడి టార్గెట్ మాత్రం బౌండరీనే. ఒకప్పుడు భారత్ మ్యాచ్ ఆడుతుందంటే దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ను ఔట్ చేయడం కోసం ప్రత్యర్థి బౌలర్లు ప్రణాళికలు రచించేవారు.

ఇప్పుడు ఐపీఎల్ లో రాజస్థాన్ తో మ్యాచ్ అంటే 15 ఏళ్ల వైభవ్ కోసం ప్రత్యర్థి కెప్టెన్ల వ్యూహాలు అన్నీ ఇన్నీ కావు. ఎంత త్వరగా బుడ్డోడిని ఔట్ చేస్తే మ్యాచ్ అంత త్వరగా గెలిచే అవకాశముంటుందని వాళ్లకి అర్థమైపోయింది. వైభవ్ ను ఔట్ చేసేందుకు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సీ ఇలాంటి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారంటేనే అర్థమవుతోంది బడ్డోడు ప్రత్యర్థి జట్లకు ఏ విధంగా నిద్ర లేకుండా చేస్తున్నాడనేది.

గత సీజన్ అరంగేట్రంలోనే సెంచరీ బాదిన వైభవ్ ఈ ఏడాది ఐపీఎల్ లోనూ పరుగుల వరద పారిస్తున్నాడు. రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. స్ట్రైక్ రేట్ లో అయితే వైభవ్ ను కొట్టేవాడే లేడు అన్నట్టుగా ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో అయితే సన్ రైజర్స్ బౌలర్లను చీల్చి చెండాడాడు.

Vaibhav Sooryavanshi

కేవలం 16 బంతుల్లోనే ఫిఫ్టీ బాదేసాడు. దీనిలో 8 సిక్సర్లు , ఒక ఫోర్ ఉన్నాయి. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ , సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను అయితే ఉతికారేశాడు. కమిన్స్ వేసిన రెండో ఓవర్లోనే వరుసగా మూడు సిక్సర్లు బాదేసాడు. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో వైభవ్(Vaibhav Sooryavanshi) కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేయగా… దీనిలో 12 సిక్సర్లున్నాయి.

ఈ సీజన్ లో ఏకంగా 65 సిక్సర్లు బాదిన వైభవ్, క్రిస్ గేల్ (59) రికార్డును బ్రేక్ చేశాడు. అలాగే ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ కూడా అతని దగ్గరే ఉంది. ఇప్పటి వరకూ 15 మ్యాచ్ లలో 45కు పైగా సగటుతో 240కి పైగా స్ట్రైక్ రేట్ తో 680 పరుగులు చేశాడు.

Esha Singh : చరిత్ర సృష్టించిన ఈషా సింగ్..వరల్డ్ కప్ లో సరికొత్త ప్రపంచ రికార్డ్

Exit mobile version