Virat Kohli : విరాట్ విధ్వంసం..సచిన్, గవాస్కర్ ఆల్ టైమ్ రికార్డులు బ్రేక్..

Virat Kohli : ఎంతమంది కొత్త ప్లేయర్స్ వచ్చినా, ఫార్మాట్లు మారినా వన్డే క్రికెట్‌లో తన రాచరికాన్ని శాసించేది మాత్రం తానేనని విరాట్ కోహ్లీ మరోసారి ప్రూవ్ చేశాడు.

Virat Kohli

కోహ్లీ క్రీజులోకి దిగాడంటే చాలు రికార్డులు బద్దలు కొట్టాల్సిందే.. బౌలర్ల గుండెల్లో బులెట్ ట్రైన్స్ పరిగెత్తాల్సిందే. సెప్టెంబర్ 27వ తేదీన తిరువనంతపురం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన ఫస్ట్ వన్డేలో టీమిండియా రన్ మెషీన్ విరాట్ మరోసారి క్లాస్ అండ్ మాస్ బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు.

హాఫ్ సెంచరీ సాధించడానికే అంతా తిప్పలు పడే పిచ్‌లపై, ఏకంగా గుడాకేశ్ మోటీ బౌలింగ్‌లో లాంగ్ ఆన్ మీదుగా భారీ సిక్సర్‌లు బాది 74 బంతుల్లోనే తన 55వ వన్డే సెంచరీని పూర్తి చేసి స్టేడియంను హోరెత్తించాడు. మైదానంలో విరాట్ విశ్వరూపానికి 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో ఏకంగా 143.21 స్ట్రైక్ రేట్‌తో రన్స్ వరదలా పారాయి. అంతకుముందు సిక్సర్‌తోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసిన విరాట్, సెంచరీని కూడా అదే రేంజ్ సిక్సర్‌తో సాధించడం విశేషంగా నిలిచింది. ఈ ఊచకోత ఇన్నింగ్స్‌తో ఆల్ టైమ్ రికార్డులను కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు.

లిస్ట్-ఏ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ను కొహ్లీ ఈక్విల్ చేశాడు. వెస్టిండీస్‌పై బాదిన ఈ ధనాధన్ సెంచరీతో కోహ్లీకి లిస్ట్-ఏ క్రికెట్‌లో అంటే దేశవాళీ ప్లస్ ఇంటర్నేషనల్ 50 ఓవర్ల ఫార్మాట్ కలిపి ఇది 60వ సెంచరీగా నమోదైంది. దాంతో సరిగ్గా 60 సెంచరీలతో టాప్‌లో ఉన్న సచిన్ పక్కన విరాట్ సగర్వంగా నిలిచాడు. ఈ లిస్ట్‌లో సచిన్, కోహ్లీ 60 సెంచరీలతో టాప్‌లో ఉండగా.. గ్రాహమ్ గూచ్ 44, గ్రేమ్ హిక్ 40, కుమార సంగక్కర 39 సెంచరీలతో తర్వాతి ప్లేసుల్లో ఉన్నారు.

అలాగే వన్డేల్లో ఒకే ప్రత్యర్థి జట్టుపై ఎక్కువ సెంచరీలు బాదిన రికార్డును కూడా కొహ్లీ సాధించాడు. తిరువనంతపురం సెంచరీతో విండీస్‌పై కోహ్లీకి వన్డేల్లో 10వ సెంచరీ పూర్తయింది. గతంలో శ్రీలంకపై మాత్రమే తాను సాధించిన 10 శతకాల రికార్డును ఇప్పుడు వెస్టిండీస్‌పై కూడా రీప్రొడ్యూస్ చేశాడు. వన్డేలో ఒకే టీమ్‌పై 10 సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా కోహ్లీ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. ఆస్ట్రేలియాపై సచిన్, రోహిత్ శర్మ చెరో 9 సెంచరీలతో నెక్స్ట్ లైన్‌లో ఉండగా, ఆసీస్‌పై కోహ్లీకి, శ్రీలంకపై సచిన్‌కు చెరో 8 సెంచరీలు ఉన్నాయి.

ఇక 2025 నుంచి వన్డేల్లో అత్యధిక సెంచరీల ఘనత కూడా కొహ్లీదే. 2025 స్టార్టింగ్ నుంచి విరాట్(Virat Kohli) బ్యాట్ కంటిన్యూగా రన్స్ వర్షం కురిపిస్తూనే ఉంది. విండీస్‌తో మ్యాచ్‌లో చేసిన సెంచరీతో ఈ కాలంలో విరాట్‌ది 5వ వన్డే సెంచరీ కావడం విశేషంగా నిలిచింది. కేవలం 20 ఇన్నింగ్స్‌ల్లోనే కోహ్లీ 5 శతకాలు సాధించి ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా.. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ 24 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు, మనదేశానికి చెందిన శుభ్‌మన్ గిల్ 20 ఇన్నింగ్స్‌ల్లో 4 శతకాలతో కోహ్లీ తర్వాతి ప్లేసులలో కొనసాగుతున్నారు.

అంతేకాకుండా కరీబియన్లపై అన్ని ఇంటర్నేషనల్‌ ఫార్మాట్లలో కలిపి ఎక్కువ సెంచరీలు సాధించిన సునీల్ గవాస్కర్ ఆల్ టైమ్ రికార్డును కూడా ఇప్పుడు విరాట్(Virat Kohli) ఈక్విల్ చేశాడు. టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి వెస్టిండీస్‌పై కోహ్లీ చేసిన అంతర్జాతీయ శతకాల సంఖ్య ఇప్పుడు 13కి చేరింది. గతంలో ఇండియన్ లెజెండ్ సునీల్ గవాస్కర్ విండీస్‌పై 13 సెంచరీలు సాధించగా, కోహ్లీ ఇప్పుడు ఆయన పక్కన చేరాడు. దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కలిస్ 12 శతకాలు, ఏబీ డివిలియర్స్, జో రూట్‌ చెరో 11 శతకాలతో ఈ రేసులో వెనుకంజలో ఉన్నారు.

Virat Kohli

మొత్తంగా ఎంతమంది కొత్త ప్లేయర్స్ వచ్చినా, ఫార్మాట్లు మారినా వన్డే క్రికెట్‌లో తన రాచరికాన్ని శాసించేది మాత్రం తానే అని విరాట్ కోహ్లీ(Virat Kohli) మరోసారి ప్రూవ్ చేశాడు. ఏజ్ పెరుగుతున్నా.. బ్యాటింగ్ ఫిట్‌నెస్, సిక్సర్లు బాదే టైమింగ్ ఏమాత్రం తగ్గలేదని ఈ ఇన్నింగ్స్‌తో క్లారిటీ ఇచ్చాడు. రాబోయే మ్యాచుల్లో కోహ్లీ సచిన్ లిస్ట్-ఏ రికార్డును, గవాస్కర్ విండీస్ రికార్డును కూడా బ్రేక్ చేసి టాప్‌లో ఎలా నిలుస్తాడో చూడాలి మరి.

UPI PIN : యూపీఐ పిన్ నెంబర్ మర్చిపోయారా? ఇలా కొత్త పిన్ సెట్ చేసుకోండి..

↑
Exit mobile version