Elon Musk Neuralink
ఒక వ్యక్తి తన పార్ట్‌నర్‌కి ‘ఐ లవ్ యూ’ అని ప్రేమగా చెప్పాలి అనుకున్నాడు. కొన్నాళ్లుగా అతని శరీరం సహకరించడం మానేసింది. ఆయన గొంతు కూడా మూగబోయింది. అయినా కూడా తను ఇన్నాళ్లుగా చెప్పలేని ఆ మాటలను తన పార్ట్‌నర్‌కు చెప్పేశాడు. అది కూడా నోటి నుంచి చిన్న శబ్దం కూడా రాకుండానే, ఆయన మనసులో అనుకున్న ఆ మాటను ఎదురుగా ఉన్న కంప్యూటర్ క్లియర్‌గా పలికింది.
సాధారణంగా ఇటువంటి సీన్స్ అన్నీ సైన్స్ ఫిక్షన్ సినిమాలలో చూస్తుంటాం. కానీ ఇది రియల్‌గా జరిగిన సంఘటన. ఎలాన్ మస్క్‌కి చెందిన న్యూరాలింక్ కంపెనీ సాధించిన ఒక అద్భుత దృశ్యం ఇది. బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ (BCI) టెక్నాలజీతో మాటలు పూర్తిగా కోల్పోయిన ఒక వ్యక్తి, కేవలం తన మైండ్‌లోని ఆలోచనల ద్వారానే మాట్లాడిన అద్భుతాన్ని వీడియో ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు.
టెర్రీ అనే వ్యక్తి బల్బార్-ఆన్‌సెట్ అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ (ALS) అనే చాలా భయంకరమైన న్యూరోలాజికల్ ప్రాబ్లెమ్‌తో బాధపడుతున్నారు. ఈ కండిషన్ వల్ల టెర్రీ మాట్లాడే కెపాసిటీని పూర్తిగా కోల్పోయారు. కానీ న్యూరాలింక్ నిపుణులు తన బ్రెయిన్‌లో అమర్చిన ‘N1’ అనే చిన్న ఇంప్లాంట్ సాయంతో టెర్రీ మైండ్‌లోని ఆలోచనలను డికోడ్ చేసి సింథటిక్ వాయిస్‌గా బయటకు తీసుకురాగలిగారు. టెర్రీ తన పార్ట్‌నర్‌కు చెప్పిన ఆ మాటలు ఆయన ఓన్ వాయిస్ కాకపోయినా, ఆయన బ్రెయిన్‌కు పంపిన సిగ్నల్స్‌ను పర్ఫెక్ట్‌గా రీడ్ చేసి కంప్యూటర్ జనరేట్ చేసిన గొంతు కావడమే టెక్ వరల్డ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ టెక్నాలజీ వెనక ఉన్న మ్యాజిక్ ఏంటనే ఆరాలు తీయడం మొదలయింది. ఈ ప్రాసెస్ కోసం బ్రెయిన్‌లో మాటలకు సంబంధించిన పార్ట్‌లో చాలా పల్చని ఎలక్ట్రోడ్ వైర్లతో కూడిన ‘N1’ ఇంప్లాంట్‌ను సర్జరీ ద్వారా అమరుస్తారు.
మనం ఒక వర్డ్ అనుకున్నప్పుడు బ్రెయిన్‌లోని న్యూరాన్లు కొన్ని సిగ్నల్స్‌ను క్రియేట్ చేస్తాయి. ఈ ఇంప్లాంట్ ఆ సిగ్నల్స్‌ను రికార్డ్ చేసిన తర్వాత.. ఒక హై ఎండ్ సాఫ్ట్‌వేర్ అల్గారిథం ఆ సిగ్నల్స్‌ను ప్రాసెస్ చేసి, సదరు వ్యక్తి మనసులో ఏ పదాన్ని అనుకుంటున్నారో కచ్చితంగా గుర్తు పడుతుంది. ఆపై దాన్ని స్క్రీన్ మీద టెక్స్ట్‌గా మార్చడం లేదా కంప్యూటర్ వాయిస్‌తో వినిపించడం చేస్తుంది.
ఈ అక్యూరసీ రావడానికి టెర్రీ స్టార్టింగ్‌లో చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేశారు. మొదట వర్డ్స్ పలకకుండా కేవలం పెదవులను మైమింగ్ చేస్తూ అల్గారిథంకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ సిస్టమ్ బ్రెయిన్ సిగ్నల్స్‌ను పూర్తిగా అర్థం చేసుకున్నాక, తర్వాత లిప్స్ కూడా కదపకుండా కేవలం మనసులో ఆలోచించినా వెంటనే ఆ మాటలను పసిగట్టేలా రీచ్ అయింది. ఇప్పుడు న్యూరాలింక్ నిర్వహిస్తున్న ‘VOICE’ క్లినికల్ ట్రయల్స్‌లో భాగమే ఈ ఎక్స్‌పెరిమెంట్. ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వల్ల వాయిస్ కోల్పోయిన వారు మళ్లీ కమ్యూనికేట్ చేసేలా చేయడమే ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ గోల్.
అయితే ఈ టెక్నాలజీ వల్ల నోటి ద్వారా మాట్లాడే పవర్ అయితే తిరిగి రాదు కానీ, ఏఎల్ఎస్, పెరాలిసిస్, స్పైన్ కార్డ్ గాయాల వల్ల మాట పడిపోయిన వాళ్లకి తమ ఫీలింగ్స్‌ను పంచుకోవడానికి ఇది ఒక వండర్‌ఫుల్ ఆప్షన్‌గా మారుతుంది. ఈ ఇయర్ స్టార్టింగ్‌లోనే కెన్నెత్ షాక్ అనే మరో ఏఎల్ఎస్ పేషెంట్ కూడా సేమ్ టెక్నాలజీతో విజయం సాధించారు.
అయితే, ఇదంతా కూడా ఇంకా ఎక్స్‌పెరిమెంటల్ స్టేజ్‌లోనే ఉంది.
Through the VOICE trial, Terry is using his Neuralink implant to help fine-tune a brain-to-voice interface for himself and others who can’t speak. He trained the algorithm first by miming speech as best he could, then by simply thinking the words and hearing them come out in his… pic.twitter.com/IBmgDgNz1c
— Neuralink (@neuralink) September 18, 2026
