Gemma 4 : ఇంటర్నెట్ అక్కర్లేదు.. ఆఫ్‌లైన్‌లో పనిచేసే గూగుల్ కొత్త యాప్ ఎలా పనిచేస్తుంది?

Gemma 4: క్లౌడ్ సర్వర్ల మీద డిపెండ్ అవకుండా డైరెక్ట్‌గా మన స్మార్ట్‌ఫోన్ లేదా డివైజ్‌లోని ప్రాసెసింగ్ శక్తిని ఉపయోగించుకుని ఇది పనిచేస్తుంది.

Gemma 4

ఏఐ (AI) ప్రపంచంలో గూగుల్ సంస్థ ఒక నూతన విప్లవానికి తెరలేపింది. తాజాగా ఆవిష్కరించిన AI ఎడ్జ్ గ్యాలరీ అనే అప్లికేషన్ టెక్నాలజీ రంగంలో నయా చర్చకు దారితీస్తోంది. ఇప్పటివరకు మనం చూసిన చాట్ బాట్లు కానీ ఏఐ అసిస్టెంట్లు కానీ పనిచేయాలంటే ఇంటర్నెట్ తప్పనిసరిగా కావాల్సి వస్తుంది.

కానీ గూగుల్ డీప్‌మైండ్ రూపొందించిన జెమ్మా 4(Gemma ) మోడళ్ల సాయంతో పనిచేస్తున్న ఈ కొత్త యాప్, ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా అంటే పూర్తిగా ఆఫ్‌లైన్‌లో ఉన్నా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. క్లౌడ్ సర్వర్ల మీద డిపెండ్ అవకుండా డైరెక్ట్‌గా మన స్మార్ట్‌ఫోన్ లేదా డివైజ్‌లోని ప్రాసెసింగ్ శక్తిని ఉపయోగించుకుని ఇది పనిచేస్తుంది.

ఈ టెక్నికల్ మార్పు వల్ల దీనిని వాడేవారికి కలిగే అతిపెద్ద ప్రయోజనం డేటా సేఫ్టీ అండ్ ప్రైవసీ అని నిపుణులు అంటున్నారు. మన పర్సనల్ డేటానే కాదు ఇతర ఏ డేటా ఏదీ కూడా సర్వర్లకు చేరకుండా, కేవలం మన డివైజ్‌లోనే భద్రంగా ఉంటుంది. దీనివల్ల హ్యాకింగ్, డేటా లీకేజీ భయాలు ఉండవు.

అంతేకాకుండా, ఇంటర్నెట్ సిగ్నల్ తక్కువగా ఉండటమే కాదు అసలు లేకపోయినా కూడా ఏఐ సేవలు మాత్రం ఆగకుండా కంటిన్యూగా అందుతూనే ఉంటాయి. జెమ్మా 4(Gemma 4) మోడళ్ల స్పెషాలిటీ ఏమిటంటే, ఇవి కేవలం టెక్స్ట్ రూపంలోనే కాకుండా ఆడియో , విజువల్ డేటాను కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయగలవు. క్లిష్టమైన పనులను స్టెప్ బై స్టెప్ వారీగా పూర్తి చేయడంలో ఇవి అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా సుమారు 140 భాషలకు సపోర్ట్ చేస్తున్న ఈ యాప్ ద్వారా భాషా పరమైన ఇబ్బందులు కూడా ఉండవు. కేవలం సాధారణ వినియోగదారులకే కాకుండా డెవలపర్ల కోసం కూడా గూగుల్ ప్రత్యేక సదుపాయాలను కల్పించింది. గిట్‌హబ్ (GitHub) వేదికగా ఒక స్పెషల్ హబ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా, కొత్త ఏఐ అప్లికేషన్లను రూపొందించే వారికి మార్గం ఈజీ చేసింది.

Gemma 4

దీనివల్ల ఫ్యూచర్‌లో మన ఫోన్లలో ఇంటర్నెట్ అవసరం లేని మరిన్ని యాప్‌లు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది గూగుల్‌కు కేవలం ఒక యాప్ మాత్రమే కాదు, యాపిల్, క్వాల్‌కామ్ , ఎన్‌వీడియా వంటి దిగ్గజ కంపెనీలతో పోటీలో నిలవడానికి ఒక వ్యూహాత్మక అడుగుగా గూగుల్ భావిస్తోంది.

అయితే ఈ లేటెస్ట్ సాంకేతికతను వాడాలంటే మన డివైజ్‌ల హార్డ్‌వేర్ సామర్థ్యం కూడా బలంగా ఉండాలి. తక్కువ ర్యామ్ కానీ పాత ప్రాసెసర్లు ఉన్న ఫోన్లలో కానీ ఈ యాప్ పనితీరు స్లోగా ఉండే అవకాశం ఉంది. ఈ ఛాలెంజెస్ ఉన్నా సరే..ఏఐ ఎడ్జ్ గ్యాలరీ రాకతో ఏఐ వినియోగమనేది క్లౌడ్ సర్వర్ల నుంచి మన చేతిలో ఉన్న చిన్నపాటి డివైజ్‌ల వైపు మళ్లుతోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Asha Bhosle : దిగ్గజ గాయని ఆశా భోస్లే ఇకలేరు…సంగీత ప్రపంచం ఘన నివాళి

Exit mobile version