Phone
ఒక్కోసారి మొబైల్ ఎక్కడో పెట్టి మర్చిపోతుంటాం . అలాగే ఒక్కోసారి ఫోన్(Phone)ను ఎక్కడో పోగొట్టుకోవడమో , లేదా ఎవరైనా చోరీ చేయడమో జరుగుతాయి. అయితే అలా జరిగితే ఇకపై ఏం టెన్షన్ పడక్కరలేదట. చివరకు ఆ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసినా కూడా వెతికేయొచ్చట.
సాధారణంగా ఎవరిది అయినా ఫోన్(Phone) ఎక్కడైనా పోయినా లేదా ఎవరైనా చోరీ చేసినా మొదటిగా వారి మొబైల్‌కు డయల్ చేస్తారు. కానీ అవతలి వ్యక్తి ఫోన్‌ను మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే మాత్రం ఇక అంతేసంగతులు. ఇక దాన్ని కనిపెట్టడం అసాధ్యమని ఇప్పటి వరకు అందరూ అనుకునేవారు. అయితే ఇప్పుడు ఆ టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది.
ఫోన్ ఆఫ్ చేసినా, అందులో ఇంటర్నెట్ లేకపోయినా సరే, అది ఎక్కడుందో ఇట్టే పట్టుకునే సరికొత్త ..ఆఫ్‌లైన్ ఫైండ్ మై డివైజ్ టెక్నాలజీని గూగుల్ , యాపిల్ కంపెనీలు అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఇది సామాన్య మొబైల్ కస్టమర్లకు ఒక పెద్ద వరమనే చెప్పాలి.
అసలు ఫోన్ ఆఫ్‌లో ఉంటే ఎలా దొరుకుతుందనే డౌట్ రావొచ్చు. దీని వెనుక ఒక స్మార్ట్ టెక్నాలజీ ఉంది. దీంతో ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా సరే, దీనిలోని బ్లూటూత్ చిప్ చాలా తక్కువ పవర్‌తో పని చేస్తూ ఉంటుంది. అది తన చుట్టుపక్కల ఉన్న ఇతర ఆండ్రాయిడ్ , ఐఫోన్ల సహాయంతో ఒక సీక్రెట్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంటుంది.
మీ ఫోన్ పంపే బ్లూటూత్ సిగ్నల్స్‌ను వేరే ఫోన్లు రిసీవ్ చేసుకుని, వాటి లొకేషన్ వివరాలను సర్వర్‌కు పంపిస్తాయి. దీనివల్ల మీ ఫోన్ ఆఫ్‌లో ఉన్నా సరే, అది కచ్చితంగా ఏ వీధిలో, ఏ బిల్డింగ్‌లో ఉందో మ్యాప్‌లో చూసే అవకాశం కలుగుతుంది.
గూగుల్ తన అప్‌డేట్ ద్వారా కోట్ల కొద్దీ ఉన్న ఆండ్రాయిడ్ డివైజ్‌లను ఒక నెట్‌వర్క్‌లా మార్చేసింది. దీనివల్ల దొంగలు ఫోన్ దొంగిలించి సిమ్ కార్డు తీసేసినా, డేటా ఆఫ్ చేసినా సరే దొరికిపోయే ప్రమాదముంది.
గతంలో కేవలం ఐఫోన్లలో మాత్రమే ఉన్న ఈ సదుపాయం, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఫీచర్ పని చేయడానికి మీరు ఫోన్ సెట్టింగ్స్‌లో ఫైండ్ మై డివైజ్ ఆప్షన్‌ను ముందే ఆన్ చేసి ఉంచుకోవాలి. అయితే టెక్నాలజీ ఎంత పెరిగినా మన జాగ్రత్తలో మనం ఉండటం ముఖ్యం.
