Mind Reading AI
గూగుల్‌లో మనమెప్పుడైనా ఏదైనా ఒక వస్తువు గురించి వెతికితే, వెంటనే దానికి సంబంధించిన యాడ్స్ సోషల్ మీడియాలో కనిపిస్తాయి. అరే.. నేను ఇప్పుడే దీని గురించి అనుకున్నా కదా, అప్పుడే యాడ్ వచ్చేసిందేంటి అని ఆశ్చర్యపోతాం.
కానీ, ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కేవలం మీ సెర్చ్ హిస్టరీని మాత్రమే కాదు, మీ ఆలోచనను కూడా ముందే ఊహించే రోజే కనుక వస్తే ఎలా ఉంటుంది? రేపు పొద్దున ఏ బ్రాండ్ షర్ట్ కొనబోతున్నారనే విషయాలే కాదు చివరకు మీ లైఫ్‌లోకి ఎలాంటి పార్ట్‌నర్ రాబోతున్నారు, అసలు ఇప్పుడు చేస్తున్న జాబ్‌ను ఎప్పుడు రిజైన్ చేయబోతున్నారనే విషయాలు మీకంటే ముందే AI చెప్పేస్తే ఎలా ఉంటుంది?
వినడానికి ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా అనిపించినా.. టెక్నాలజీ వెళ్తున్న స్పీడ్ చూస్తుంటే ఇది త్వరలోనే నిజం కాబోతుందేమోనని అనిపిస్తోందని టెక్ నిపుణులు అంటున్నారు.
నిజానికి ఒక మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది. అతని అలవాట్లు ఏంటి? అతని ఆలోచనా విధానం ఎలా ఉంటుందనే విషయాలను కోట్లాది డేటా పాయింట్ల ద్వారా విశ్లేషించే శక్తి ఏఐ( AI) కి ఉంది.
మనం డైలీ లైఫ్‌లో చేసే చిన్న చిన్న పనులు, ఫోన్ చూసే విధానం అంతెందుకు చివరకు మన మూడ్ స్వింగ్స్ అన్నింటినీ గమనిస్తూ అది ఒక ప్రొఫైల్ కూడా క్రియేట్ చేసుకుంటుంది.
దీనివల్ల ఒక సిట్యువేషన్‌లో మనం నెక్స్ట్ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నామో ఏఐ చాలా ఈజీగా గెస్ చేసేయగలదు.
ఉదాహరణకు, మీ ప్రస్తుత కంపెనీలో మీ పర్ఫార్మెన్స్, మీ మూడ్, మీ బ్రౌజింగ్ హిస్టరీని బట్టి మీరు వచ్చే నెలలో జాబ్ మానేస్తారని ఏఐ మీకు నోటిఫికేషన్ పంపితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలాగే, మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్లు నచ్చుతారో మీకంటే బాగా ఏఐ అంచనా చేసి, ఇదిగో.. ఈ పర్సన్‌ని నువ్వు ప్రేమించబోతున్నావని చెబితే లైఫ్ చాలా వింతగా మారిపోతుంది కదూ!
అయితే, దీనిలో ఎంత మ్యాజిక్ ఉందో, అంతే భయం కూడా దాగి ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మనిషికి ఉండే అతిపెద్ద శక్తి..స్వేచ్ఛగా ఆలోచించడమే. అలాగే తప్పులు చేస్తూ కొత్త విషయాలు నేర్చుకుంటాడు.
కానీ, ఇప్పుడు ప్రతిదీ ఏఐ ముందే డిసైడ్ చేసి చెప్పేస్తుంటే.. ఇక మనిషి సొంతంగా ఆలోచించడం మానేస్తాడు. మన జీవితం మన చేతుల్లో లేకుండా ఒక అల్గారిథమ్ చేతుల్లోకి వెళ్లిపోతుంది. మనకు ఏం కావాలో మన మనసు చెప్పే పరిస్థితి నుంచి, స్క్రీన్ మీద కనిపించే ఏఐ ప్రిడిక్షనే ఎక్కువ నమ్మే సిట్యువేషన్ వస్తుంది.
అంతెందుకు దీనివల్ల ప్రేమ, కెరీర్, షాపింగ్ వంటి పర్సనల్ విషయాల్లో చూద్దామన్నా కూడా సర్ప్రైజ్‌లు అనేవే ఉండవు. అంతా ఒక స్క్రిప్ట్ ప్రకారం జరిగిపోతున్నట్లే అనిపిస్తుంది.
అందుకే టెక్నాలజీ మనకు హెల్ప్ చేయడానికి ఉండాలి కానీ.. మన లైఫ్‌ని కంట్రోల్ చేసేలా మారకూడదు. ఆలోచనలను ముందే ఊహించే ఏఐ వస్తే లైఫ్ ఈజీ అవ్వచ్చు కానీ, మనిషిలోని ఆ ఎమోషన్, ఆ సస్పెన్స్ మాత్రం మిస్ అయిపోతాయనడంలో ఎలాంటి డౌట్ లేదు.
Obesity : తల్లుల నుంచే కూతుర్లకు ఒబెసిటీ..జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ షాకింగ్ రిపోర్ట్
