Pod Taxi
భారత్ ఆర్థిక రాజధాని, రద్దీకి కేరాఫ్ అడ్రస్ అయిన ముంబై త్వరలోనే సరికొత్త ఫ్యూచరిస్టిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థకు వేదిక కాబోతోంది. హాలీవుడ్ మూవీల్లో చూపించే డ్రైవర్ లేని గాల్లో తేలే కార్ల వంటి టెక్నాలజీని ముంబై వీధుల్లో ప్రవేశపెట్టడానికి.. అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.
దేశంలోనే మొట్టమొదటిసారిగా పాడ్ ట్యాక్సీ (Pod Taxi) సర్వీసులను స్టార్ట్ చేసేందుకు ముంబైలో పనులు శరవేగంగా సాగుతున్నాయి. ముంబైలో నిత్యం నరకం చూపే ట్రాఫిక్ సమస్యకు పర్మినెంట్‌గా చెక్ పెట్టడమే లక్ష్యంగా, ఎప్పుడూ బిజీగా ఉండే రద్దీ ప్రాంతమైన బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC) ఏరియాలో ఈ సరికొత్త పాడ్ ట్యాక్సీ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ముంబై అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ పరిధిలో సుమారు 3.36 కిలోమీటర్ల పొడవైన మార్గంలో మొత్తం 8 స్టేషన్లను జాయింట్ చేసేలా ఒక భారీ పాడ్ ట్యాక్సీ(Pod Taxis) నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇవి మామూలు రోడ్లపై కాకుండా మెట్రో రైళ్ల లాగానే భూమికి పైన నిర్మించే స్పెషల్ ఎలివేటెడ్ ట్రాక్‌లపై రన్ అవుతాయి.
చూడటానికి చిన్న సైజ్ కార్లలా ఉండే ఈ అల్ట్రా మోడ్రన్ ట్యాక్సీలకు డ్రైవర్ ఉండరు. ఇవి పూర్తిగా కంప్యూటర్ బేస్‌డ్ అండ్ పర్యావరణానికి హాని చేయని ఎలక్ట్రిక్ లేదా బ్యాటరీ సాయంతో నడుస్తాయి. ఈ నెట్‌వర్క్‌లో ప్రయాణించే ప్రతి పాడ్ ట్యాక్సీ(Pod Taxi)లో ఒకేసారి ఆరుగురు ప్రయాణికులు కూర్చుని జర్నీ చేయొచ్చు.
ఈ ట్యాక్సీల గరిష్ట వేగం గంటకు 40 కిలోమీటర్లు. దీనిలో హైలైట్ ఏంటంటే, ప్రయాణికులు స్టేషన్లలో గంటల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. ప్రతి 15 సెకన్లకోసారి ఒక పాడ్ ట్యాక్సీ అందుబాటులోకి వచ్చేలా దీనిని డిజైన్ చేస్తున్నారు.
ముంబైలో మెట్రో , లోకల్ రైళ్లలో ప్రయాణించి, బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ ఏరియాలోని వేలాది కార్పొరేట్ ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులకు ఈ సర్వీసులు ఒక వరంలా మారబోతున్నాయి. రైల్వే స్టేషన్ల నుంచి ఆఫీసులకు చేరుకునే లోపు మధ్యలో ఫేస్ చేసే ట్రాఫిక్ ఇబ్బందులను, టైమ్ వేస్ట్‌ని తగ్గించడమే ఈ ప్రాజెక్టు యొక్క మెయిన్ టార్గెట్ అని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అయితే ఈ లగ్జరీ అండ్ హైటెక్ పాడ్ ట్యాక్సీల్లో జర్నీ చేయాలంటే జేబుకు కాస్త చిల్లు పడే అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకూ ఉన్న అంచనాల ప్రకారం.. ఈ పాడ్ ట్యాక్సీలో ప్రతి ఒక్క కిలోమీటర్ ప్రయాణానికి దాదాపు 21 రూపాయల వరకు ఛార్జ్ వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ అద్భుతమైన ప్రాజెక్టును వచ్చే 2031వ సంవత్సరానికి పూర్తి చేసి సాధారణ ప్రజలకు , ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకురావాలని అక్కడి అధికారులు టార్గెట్‌గా పెట్టుకున్నారు.
ముంబై వంటి మెట్రో సిటీలో ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే, భవిష్యత్తులో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ వంటి ఇతర మెయిన్ సిటీలకు కూడా ఈ పాడ్ ట్యాక్సీలను విస్తరించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.
Pawan Kalyan : ఢిల్లీకొచ్చి మెడలు వంచుతామన్న వాళ్లేరి?.. ఢిల్లీ వేదికగా పవన్ పవర్‌ఫుల్ ప్రశ్న
