Edge Computing : క్లౌడ్ కంప్యూటింగ్ తెలుసు.. మరి ఎడ్జ్ కంప్యూటింగ్ అంటే ఏంటి?

Edge Computing : క్లౌడ్ కంప్యూటింగ్‌లో డేటా అంతా ఎక్కడో దూరంగా ఉండే సెంట్రలైజ్‌డ్ సర్వర్‌కు వెళ్లి, అక్కడ ప్రాసెస్ అయ్యి తిరిగి మన మొబైల్, కంప్యూటర్ స్క్రీన్‌పైకి వస్తుంది.

Edge Computing

ఇంటర్నెట్ ప్రపంచంలో మనం ఏ ఇన్ఫర్మేషన్ దాయాలన్నా లేదా యాక్సెస్ చేయాలన్నా క్లౌడ్ కంప్యూటింగ్ (Cloud Computing) పైనే ఆధారపడుతున్నాం. అయితే రోజురోజుకు పెరుగుతున్న ఇంటర్నెట్ డివైజెస్ , డేటా భారం వల్ల క్లౌడ్ సర్వర్ల స్పీడ్ తగ్గుతుంది.

ఈ సమస్యకు లేటెస్ట్ టెక్నికల్ సొల్యూషన్‌గా తెరపైకి వచ్చిన కొత్త టెక్నాలజీయే ఎడ్జ్ కంప్యూటింగ్ (Edge Computing). సాధారణంగా క్లౌడ్ కంప్యూటింగ్‌లో డేటా అంతా ఎక్కడో దూరంగా ఉండే సెంట్రలైజ్‌డ్ సర్వర్‌కు వెళ్లి, అక్కడ ప్రాసెస్ అయ్యి తిరిగి మన మొబైల్, కంప్యూటర్ స్క్రీన్‌పైకి వస్తుంది. కానీ ఎడ్జ్ కంప్యూటింగ్ టెక్నాలజీలో సమాచారం ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో, దానికి అత్యంత దగ్గరలో అంటే లోకల్ డివైజ్ లోనే డేటా ప్రాసెస్ చేయబడుతుంది.

ఈ టెక్నికల్ చేంజ్ వల్ల డేటా ప్రయాణించే సమయం (Latency) గణనీయంగా తగ్గుతుంది. ఇంటర్నెట్ వేగం , బ్రాండ్ విడ్త్ సమస్యలు లేకుండా పనులన్నీ క్షణాల్లోనే పూర్తవుతాయి. రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న 5జీ నెట్‌వర్క్ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్లకు ఈ ఎడ్జ్ కంప్యూటింగ్ చాలా ఇంపార్టెంట్ కాబోతుంది.

ఉదాహరణకు, రోడ్లపై ప్రయాణించే డ్రైవర్ లెస్ కార్లు (Driverless Cars) సెకనులో వందో వంతు కాలంలోనే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు డేటా క్లౌడ్ సర్వర్‌కు వెళ్లి మళ్లీ తిరిగి రావాలంటే టైమ్ పడుతుంది. అదే ఎడ్జ్ కంప్యూటింగ్ వాడితే కార్లలోని సెన్సార్లు అప్పటికప్పుడే లోకల్‌గా డేటాను విశ్లేషించి బ్రేకులు వేయాలా వద్దా అనే నిర్ణయాన్ని చాలా ఫాస్టుగా తీసుకుంటాయి.

Edge Computing

మెడికల్ రంగంలో కూడా రిమోట్ సర్జరీలు, దూర ప్రాంతాల నుంచి రోబోల ద్వారా చేసే ఆపరేషన్లు చేయడానికి ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే, ఇండస్ట్రీలో ఉండే భారీ మిషన్ల పనితీరును గమనించడానికి, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులలో ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఎడ్జ్ కంప్యూటింగ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

క్లౌడ్ కంప్యూటింగ్‌ను పూర్తిగా భర్తీ చేయడం ఈ టెక్నాలజీ ఉద్దేశం కాదు కానీ.. దానికి తోడుగా ఉంటూ ఇంటర్నెట్ స్పీడును పెంచడం దీని లక్ష్యం. ఫ్యూచర్‌లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) పరికరాల వాడకం మరింతగా పెరిగే కొద్దీ, ఎడ్జ్ కంప్యూటింగ్ (Edge Computing) టెక్నాలజీ మన డిజిటల్ లైఫ్ స్టైల్‌ను మరింత వేగవంతంగా , సేఫ్టీగా మార్చడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Iran: వారిద్దరినీ లేపేస్తే రూ.558 కోట్లు..ట్రంప్, నెతన్యాహులపై ఇరాన్

Exit mobile version