IPS Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్.. పరారీ నుంచి కస్టడీ వరకూ వరుస వివాదాలతో బిగుస్తున్న ఉచ్చు

IPS Uday Krishna Reddy : సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని... ఉదయ్ కృష్ణారెడ్డి తీవ్రంగా వేధించారన్న ఆరోపణలపై ఆయనను మిర్యాలగూడ వద్ద హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు

IPS Uday Krishna Reddy

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి(IPS Uday Krishna Reddy) వేధింపుల కేసు.. మరోసారి ఊహించని టర్న్ తీసుకుంది. సొసైటీలో చట్టాన్ని, శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కలిగిన ఉన్నత అధికారి హోదాలో ఉన్న వ్యక్తి.. ఒంటిపై పూర్తిస్థాయి ఖాకీ దుస్తులు పడకముందే వరుస వివాదాలు, నేరారోపణల్లో చిక్కుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.

సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని… ఉదయ్ కృష్ణారెడ్డి తీవ్రంగా వేధించారన్న ఆరోపణలపై మంగళవారం ఆయనను మిర్యాలగూడ వద్ద హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం విచారణ నిమిత్తం ఆయనను హైదరాబాద్‌లోని అత్తాపూర్‌కు తరలించారు.

తన తోటి ట్రైనీ ఐపీఎస్ అయిన ఉదయ్ కృష్ణారెడ్డి(IPS Uday Krishna Reddy) తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీ (ఎన్‌పీఏ)లో ట్రైనింగ్‌ పొందుతున్న ఓ లేడీ ట్రైనీ ఐపీఎస్ అధికారిణి.. జూలై 18వ తేదీనన రాజేంద్రనగర్ సబ్‌డివిజన్ పరిధిలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేయడం కలకలం రేపింది.

దీంతో ఎంక్వైరీ చేసిన పోలీసులకు ఆమె ఆరోపణలలో నిజం కనిపించడంతో.. ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదైన వెంటనే ఉదయ్ సూసైడ్ ఎటెంప్ట్ చేశారన్న వార్త ప్రచారంలోకి వచ్చింది.

కానీ అది కేవలం అందరినీ తప్పు దోవ పట్టించడానికి చేసిన ప్రయత్నమే అని, ఆయన అతిగా ఆల్కహాల్ తీసుకోవడం వల్లే స్పృహ తప్పారని, ఆయన బాడీలో ఎలాంటి విషపూరిత పదార్థాలు లేవని తేలడంతో ఉదయ్ మరోసారి విమర్శల పాలయ్యారు.

అంతేకాకుండా చికిత్స తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఉదయ్ కృష్ణారెడ్డి.. పోలీసుల ఎంక్వైరీకి సహకరించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయి మరో పొరపాటు చేశారు. జాతీయ పోలీస్ అకాడమీలో ఇచ్చిన పర్మినెంట్ అండ్ టెంపరరీ అడ్రస్‌లలో పోలీసులు వెతికినా కూడా ఆయన లభించలేదు.

చివరకు ఉదయ్ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో.. కావాలనే పరారయ్యారనే ప్రచారం జరిగింది. దీంతో పోలీసులు హైదరాబాద్, ఒంగోలు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు పోలీసులకు తన ఆచూకి తెలియడంతో.. తాను పారిపోలేదని, బామ్మ అనారోగ్యం వల్ల మాత్రమే స్వగ్రామానికి వచ్చానని కవర్‌ చేసే ప్రయత్నాలు చేశారు.

IPS Uday Krishna Reddy

నిజానికి తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని చెబుతూ ఉదయ్ కృష్ణారెడ్డి వేసిన క్వాష్ పిటిషన్‌పై.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో, ఆ పిటిషన్‌పై బుధవారం విచారణ జరగాల్సి ఉంది. సరిగ్గా హై కోర్టు విచారణకు ఒక్కరోజు ముందే మిర్యాలగూడలో పోలీసులు ఉదయ్‌ను ఊహించని పరిణామాల మధ్య అదుపులోకి తీసుకోవడం విశేషం.

పోలీసు అధికారిగా చట్టానికి లోబడి నడుచుకోవాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తి.. వేధింపులకు పాల్పడటం వంటి ఆరోపణలు ఎదుర్కోవడం ఒక ఎత్తయితే , ఆ తర్వాత అనారోగ్యం పేరుతో డ్రామాలు ఆడటం, డిశ్చార్జ్ అయ్యాక పరార్ కావడం వంటి వరుస తప్పులు చేయడం వల్ల లీగల్ సమస్యలు మరింత సంక్లిష్టంగా మారినట్లే అయింది.మొత్తానికి జూలై 29న ఈ కేసులో హైకోర్టు తీసుకోబోయే నిర్ణయంపైన అందరి దృష్టి నెలకొంది.

Kitchen Cleaning : వంటిల్లు గుబాళించాలా? ఖర్చులేని ఈ సహజ సిద్ధమైన చిట్కాలు పాటించి చూడండి..

Exit mobile version