Just LifestyleLatest News

Kitchen Cleaning : వంటిల్లు గుబాళించాలా? ఖర్చులేని ఈ సహజ సిద్ధమైన చిట్కాలు పాటించి చూడండి..

Kitchen Cleaning : నైట్‌ కుకింగ్ పని పూర్తయి సింక్, డస్ట్ బిన్ క్లీన్ చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు జిడ్డు, బ్యాడ్ స్మెల్ అలాగే ఉండిపోతాయి.

Kitchen Cleaning

ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచినా కిచెన్‌ను నీట్‌గా మెయింటెయిన్‌ చేయడంలో చిన్నపాటి తప్పు చేసినా చాలు ఒక రకమైన స్మెల్ ఇల్లంతా వ్యాపిస్తుంది. పొద్దున్నే టీ, టిఫిన్‌ల దగ్గర నుంచి రాత్రి డిన్నర్ వరకు రోజంతా కిచెన్‌లో రకరకాల వంటలు వండుతారు. హడావుడిగా చేసే పనులతో వాష్ బేసిన్‌లో గిన్నెలు పేరుకుపోవడం, చెత్త డబ్బా సరిగ్గా మూత పెట్టకపోవడం వల్ల దుర్వాసన సమస్య ఎక్కువవుతుంటుంది.

ముఖ్యంగా కూరలు మాడిపోయినప్పుడు లేదా నాన్‌వెజ్ వంటకాలు చేసినప్పుడు ఎంత చిమ్నీ ఉన్నా కూడా ఆ వాసన గోడలకు, గాలికి పట్టుకుని ఓ పట్టాన అక్కడి నుంచి పోదు. దీనికోసం మార్కెట్లో దొరికే కెమికల్ స్ప్రేలు వాడకుండానే ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన వస్తువులతో ఈ బ్యాడ్ స్మెల్‌ను ఈజీగా మాయం చేయొచ్చని నిపుణులు అంటున్నారు.

సాధారణంగా మనం వంటల్లో వాడే బేకింగ్ సోడా కిచెన్‌లోని స్మెల్‌ను పీల్చుకోవడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కర్రీలు మాడిపోయి కిచెన్ అంతా పొగ, స్మెల్ అలుముకున్నప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి ప్లాట్‌ఫామ్ పైన లేదా స్టౌ పక్కన ఉంచితే అది గాలిలోని బ్యాడ్ స్మెల్‌ను త్వరగా పీల్చేస్తుంది.

అలాగే ఫిష్ లేదా చికెన్, మటన్ వండినప్పుడు వచ్చే నీచు వాసనను పోగొట్టటానికి వెనిగర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వెనిగర్‌ను చిన్న గిన్నెల్లో పోసి కిచెన్ కార్నర్స్‌లో ఉంచడం వల్ల స్మెల్ తగ్గుతుంది. ఒకవేళ స్మెల్ బాగా ఘాటుగా ఉంటే, వెడల్పాటి పాత్రలో నీళ్లు, వెనిగర్, కొన్ని నిమ్మతొక్కలు వేసి స్టౌ మీద సన్నని ఫ్లేమ్‌పై వేడి చేస్తే కిచెన్ త్వరగా ఫ్రెష్‌గా మారిపోతుంది.

నైట్‌ కుకింగ్ పని పూర్తయి సింక్, డస్ట్ బిన్ క్లీన్ చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు జిడ్డు, బ్యాడ్ స్మెల్ అలాగే ఉండిపోతాయి. ఇలాంటి టైమ్‌లో కమలా పండ్ల తొక్కలు, దాల్చినచెక్క ముక్కలను నీటిలో వేసి 5 నిమిషాల పాటు మరిగిస్తే వంటిల్లంతా ఫ్రెష్‌నెస్ సంతరించుకుంటుంది.

అలాగే ఫిష్‌ను క్లీన్ చేసినప్పుడు వచ్చే నీచు స్మెల్‌ను పోగొట్టడానికి వేడి నీటిలో లెమన్ జ్యూస్, దాని తొక్కలు వేసి ఆ నీటిని ఒక బాటిల్‌లో పోసి స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది.

Kitchen Cleaning
Kitchen Cleaning

మనం రోజూ వాడే యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క వంటి మసాలా దినుసులను వాటర్‌లో వేసి బాగా మరిగించి, ఆ నీటిని చల్లార్చి స్ప్రే బాటిల్‌లో పోసుకుంటే అది ఇంట్లోనే తయారు చేసుకునే నేచురల్ రూమ్ ఫ్రెష్‌నర్ లా పనిచేస్తుంది.

ఈ చిట్కాలన్నింటితో పాటు కిచెన్‌లో సూర్యరశ్మి, లైటింగ్ వచ్చేలా మంచి వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం, ఎప్పటికప్పుడు తడి చెత్తను బయట పారేయడం వల్ల కిచెన్ ఎప్పుడూ నీట్‌గా, మంచి స్మెల్‌తో ఉంటుంది.

Paradox Of Choice : ఎక్కువ ఆప్షన్లు ఉంటే ప్రశాంతతను దూరం చేస్తాయా? ఆప్షన్స్ ఎక్కువైతే డెసిషన్స్ కష్టమేనా?

Related Articles

Back to top button