Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణపతి దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు…ఈసారి 11 రోజులు కాదు 12 రోజుల ఉత్సవాలు

Khairatabad Ganesh : ప్రతి వీధిలోనూ పోటీపడి మండపాలు పెట్టి ఉత్సవాలు నిర్వహించినా, ఖైరతాబాద్ బడా గణనాధుడు కొలువుదీరే వైభవం, అక్కడ ఉట్టిపడే ఆధ్యాత్మిక శోభ వేరుగా ఉంటుంది.

Khairatabad Ganesh

వినాయకుడి నవరాత్రులు ప్రారంభమయ్యాయంటే .. తెలంగాణ నలుమూలల నుంచి అలాగే ఇతర రాష్ట్రాల భక్తుల కళ్లన్నీ హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేషుడి వైపే ఉంటాయి. ప్రతి వీధిలోనూ పోటీపడి మండపాలు పెట్టి ఉత్సవాలు నిర్వహించినా, ఖైరతాబాద్ బడా గణనాధుడు కొలువుదీరే వైభవం, అక్కడ ఉట్టిపడే ఆధ్యాత్మిక శోభ వేరుగా ఉంటుంది.

ఏటా ఒక సరికొత్త రూపంతో ఆకట్టుకునే ఈ మహాగణనాథుడి ప్రయాణం 70 ఏళ్లకి చేరింది. 1954లో నాటి స్వాతంత్ర్య సమరయోధుడు, స్థానిక కౌన్సిలర్ అయిన సింగరి శంకరయ్య కేవలం ఒక్క అడుగు విగ్రహంతో అక్కడి లోకల్ లైబ్రరీ గదిలో తొలిసారి వినాయక చవితి పండుగను ప్రారంభించారు.

9 ఏళ్ల పాటు ఒక్కో అడుగు పెంచుకుంటూ 9 అడుగుల వరకూ ఆ గదిలోనే పూజలు జరిపారు. 10వ అడుగుకి విగ్రహం సైజ్ పెద్దది కావడంతో లైబ్రరీ బయట ఏర్పాటు చేశారు. అలా క్రమంగా పెరుగుతూ వచ్చిన గణపతి విగ్రహం ఎత్తు 2014 వ సంవత్సరానికి ఏకంగా 60 అడుగులకు చేరింది.

అయితే భక్తుల నుంచి వచ్చిన సెంటిమెంట్ వేడుకోలు వల్ల 70 ఏళ్ల వేడుకల మార్క్ ఆధారంగా 70 అడుగుల బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఆ నెంబర్ ఆధారంగానే ఏటా ఒక అడుగు పెంచడం లేదా తగ్గించడం చేస్తున్నారు.

Khairatabad Ganesh

అలా ఈ ఏడాది 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతిని తీర్చిదిద్దారు.పెరిగిన ధరల వల్ల ఈసారి విగ్రహ బడ్జెట్ సుమారు రూ.1.20 కోట్లకు చేరింది. 1978 నుంచి కూడా తమిళనాడుకు చెందిన రాజేంద్రన్ అనే శిల్పి నేతృత్వంలోనే ఈ లంబోధరుడి విగ్రహం తయారవుతోంది.

సాధారణంగా ప్రతీ ఏడాది 11 రోజులు జరిగే ఈ నవరాత్రి ఉత్సవాలు ఈసారి 12 రోజుల పాటు సాగుతున్నాయి. సెప్టెంబర్ 25వ తేదీన అనంత చతుర్దశి ముహూర్తం రావడంతో నిమజ్జనాన్ని 12వ రోజుకి జరిపారు.

Moroccan Red Clay : క్లియోపాత్రా బ్యూటీ సీక్రెట్ ఇదేనట.. ఈ నేచురల్ క్లే ఇంట్లోనే ఇలా వాడండి..

Exit mobile version