Rakhi : రాఖీ సంబరాలతో కళకళలాడుతున్న భాగ్యనగరం.. మార్కెట్లలో వెరైటీ కలెక్షన్స్, డిజైనర్ రాఖీలు..

Rakhi : రూ. 10 నుంచి ప్రారంభమయ్యే సాధారణ రాఖీల దగ్గర నుంచి.. వందలు, వేల రూపాయల విలువ చేసే హై-ఎండ్ డిజైనర్ రాఖీల వరకు షాపుల్లో కలర్‌పుల్‌గా కనిపిస్తున్నాయి.

Rakhi

నేను నీకు రక్ష.. నువ్వు నాకు రక్ష అంటూ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే నిస్వార్థమైన ప్రేమానుబంధాన్ని చాటి చెప్పే పండుగ.. రాఖీ పూర్ణిమ. తన అన్నయ్య లేదా తమ్ముడి మణికట్టుపై సోదరి కట్టే చిన్న దారపు పోగు కేవలం ఒక తాడు కాదు, ఇద్దరి జీవితాలను కలిపి ఉంచే ఒక బలమైన నమ్మకమైన బంధంగా రాఖీ గురించి చెబుతారు.

తన అన్నయ్య లేదా తమ్ముడు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, అన్నింటిలోనూ విజయాన్ని సాధించాలని అతని సోదరి మనస్ఫూర్తిగా కోరుకుంటే.. ఆమె జీవితంలో ఎలాంటి కష్టం రాకుండా ఒక కొండంత అండగా ఉంటానని ఆ అన్నయ్య ఇచ్చే భరోసా ఈ పండుగ ప్రత్యేకతగా చెబుతారు. అంతటి పవిత్రమైన రాఖీ పండుగ దగ్గర పడుతుండటంతో, తమ సోదరుల టేస్ట్‌కు తగ్గట్టుగా కొత్త మోడల్స్ కొనడానికి ఇప్పటి నుంచే ఆసక్తి చూపిస్తున్నారు.

దీంతో ఇప్పుడు హైదరాబాద్‌లోని మెయిన్ మార్కెట్లు కొనుగోలుదారుల సందడితో కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది మార్కెట్‌లోకి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా కొత్త కొత్త వెరైటీ కలెక్షన్స్ అందుబాటులోకి వచ్చాయి. రూ. 10 నుంచి ప్రారంభమయ్యే సాధారణ రాఖీల దగ్గర నుంచి.. వందలు, వేల రూపాయల విలువ చేసే హై-ఎండ్ డిజైనర్ రాఖీల వరకు షాపుల్లో కలర్‌పుల్‌గా కనిపిస్తున్నాయి.

ఏజ్ గ్రూప్‌తో సంబంధం లేకుండా అందరికీ రకరకాల మోడల్స్ ఈసారి మార్కెట్‌లో కనివిందు చేస్తున్నాయి. చిన్నపిల్లలని అట్రాక్ట్ చేసే కార్టూన్ క్యారెక్టర్ రాఖీలతో పాటు, కుర్రకారు కోసం లేటెస్ట్ ట్రెండీ మోడల్స్, పెద్దవారి కోసం ముత్యాలు, జరీ , మెరిసే స్టోన్స్‌, చక్ర కాన్సెప్ట్‌తో రూపొందించిన స్పెషల్ రాఖీలు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.

Rakhi

అయితే ఈసారి హైదరాబాద్ వాసులే కాకుండా తెలంగాణ జిల్లాల నుంచి, ఆంధ్రప్రదేశ్ , పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారులు, సామాన్య జనం వేలాదిగా వచ్చి భాగ్యనగరంలో డిజైనర్ రాఖీలను(Rakhi) కొనడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. పండుగకు ముందే ప్లాన్ చేసుకుని హోల్‌సేల్ అండ్ రిటైల్ మార్కెట్లలో తమ షాపింగ్ పూర్తి చేసుకుంటున్నారు. దూరప్రాంతాలలో ఉన్న తమ సోదరులకు కొరియర్ ద్వారా పంపించాలనుకున్నవారు ఇంకాస్త ముందుగానే తమ రాఖీల షాపింగ్‌ను పూర్తి చేసుకున్నారు.

కాగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కొనుగోలుదారులు ఇక్కడి మార్కెట్ ధరలపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అన్ని షాపుల్లో ధరలు చాలా రీజనబుల్‌గా ఉన్నాయని.. తాము అనుకున్నదాని కంటే తక్కువ ధరకే క్వాలిటీ ఉన్న రాఖీలు లభించాయని ఆనందం వ్యక్తం చేశారు. మొత్తంగా రాఖీ(Rakhi) పండుగ తెచ్చే సంతోషంతో పాటు మార్కెట్లలో ఈ ఏడాది రాఖీల వ్యాపారం పెరిగి వ్యాపారుల ముఖాల్లో నవ్వులు పోటీ పడుతున్నాయి.

Camphor Hair Mask : జుట్టు చిట్లిపోతోందా? కర్పూరంతో ఇంట్లోనే వేసుకునే మ్యాజిక్ హెయిర్ మాస్క్..

Exit mobile version