Women’s Premier League : శతక్కొట్టిన నాట్ సీవర్ బ్రంట్..ఆర్సీబీని చిత్తు చేసిన ముంబై
Women's Premier League : మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్రలో తొలి సెంచరీ నమోదైంది. ఇప్పటి వరకూ ఎవ్వరికీ సాధ్యం కాని సెంచరీ రికార్డును ముంబై బ్యాటర్ నాట్ సీవర్ బ్రంట్ అందుకుంది
Women’s Premier League
మహిళల ప్రీమియర్ లీగ్(Women’s Premier League) చరిత్రలో తొలి సెంచరీ నమోదైంది. ఇప్పటి వరకూ ఎవ్వరికీ సాధ్యం కాని సెంచరీ రికార్డును ముంబై బ్యాటర్ నాట్ సీవర్ బ్రంట్ అందుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో బ్రంట్ ఈ ఘనత సాధించింది. బ్రంట్ సెంచరీతో చెలరేగి భారీస్కోరు అందించడంతో ఆర్సీబీని ముంబై చిత్తు చేసింది. దీని ద్వారా ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ కు సరైన ఆరంభం దక్కలేదు.
16 పరుగులకే సజన వికెట్ కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ హీలీ మాథ్యూస్ , నాట్ సీవర్ బ్రంట్ తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో వికెట్ కు 131 పరుగులు జోడించారు. ఈ సమయంలో హీలీ హాఫ్ సెంచరీ సాధించి ఔటవగా.. బ్రంట్ మాత్రం దూకుడు కొనసాగించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తో కలిసి ముంబైకి భారీస్కోరు అందించింది. ఇలా 57 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సర్ తో సెంచరీ పూర్తి చేసుకుంది.
దీని ద్వారా డబ్ల్యూపీఎల్ చరిత్రలో శతకం సాధించిన తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది. గతంలో ఈ మహిళల ప్రీమియర్ లీగ్ (Women’s Premier League) లో ఏ క్రికెటర్ కూ ఇది సాధ్యం కాలేదు. బ్రంట్ సెంచరీతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో లారెన్ బెల్ 2, శ్రేయాంకా పటేల్ , డిక్లార్క్ తలో వికెట్ తీశారు.

200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరంభంలోనే చేతులెత్తేసింది.పవర్ ప్లేలోనే సగం వికెట్లు కోల్పోయింది. స్మృతి , హ్యారిస్, గౌతమి నాయక్, జార్జియా, రాధా యాదవ్ తక్కువ స్కోరుకే ఔటయ్యారు. తర్వాత రిఛా ఘోష్ మెరుపు బ్యాటింగ్ తో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది.
చివరికి ఆర్సీబీ 9 వికెట్లకు 184 పరుగులే చేయగలిగింది. చివరి మూడు ఓవర్లలో విధ్వంసం సృష్టించిన రిఛా ఘోష్ కేవలం 50 బంతుల్లో 90 (10 ఫోర్లు, 6 సిక్సర్లు) పరుగులతో నాటౌట్ గా నిలిచింది. కాగా ఈ విజయంతో ముంబై ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
Phone Tapping : సంతోష్ రావుకు సిట్ నోటీసులు..ఇక మిగిలింది కవిత, కేసీఆరేనా ?



