Dust Cleaning : రోజూ తుడిచినా ఇంట్లో దుమ్ము పేరుకుపోతోందా?ఈ సింపుల్ ట్రిక్స్ పాటించండి..
Dust Cleaning : ఇంటిని ఎంత క్లీన్ చేసినా మళ్లీ దుమ్ము పేరుకుపోతోందా? తలుపుల ఖాళీలు, ఫ్యాన్స్, ఏసీ ఫిల్టర్స్ వల్ల వచ్చే డస్ట్‌ను అరికట్టే సింపుల్ హ్యాక్స్ చూడండి..
Dust Cleaning
మార్నింగ్ లేచాక ఇల్లంతా ఊడ్చి, మాప్ పెట్టి అద్దంలా మెరిపించినా సరే.. సాయంత్రానికి ఫర్నిచర్ మీద దుమ్ము లైట్‌గా పేరుకుపోతూ ఉంటుంది . ఎంత శుభ్రం చేసినా(Dust Cleaning)ఈ దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాక చాలామంది జుట్టు పీక్కుంటుంటారు.
నిజానికి మనం చేసే చిన్న నిర్లక్ష్యాలు, గమనించని పొరపాట్ల వల్లే దుమ్ము ఎంట్రీ ఇస్తుంది. ఇంటిని పూర్తిగా డస్ట్ రహితంగా మార్చడం కష్టమే అయినా, కొద్దిపాటి జాగ్రత్తలతో దుమ్ము రాకుండా ఈజీగా అడ్డుకట్ట వేయొచ్చు.
ముఖ్యంగా డోర్స్, విండోస్ గట్టిగా క్లోజ్ చేసినా కూడా, వాటి ఫ్రేమ్‌లు, గోడల మధ్య ఉండే సన్నని ఖాళీల ద్వారా గాలితో పాటు దుమ్ము కూడా లోపలికి వచ్చేస్తుంది. అందుకే ముందుగా ఆ ఖాళీలను మంచి స్ట్రిప్పింగ్తో కవర్ చేయాలి. దీనివల్ల దుమ్ము ఒకటే కాదు వర్షపు తేమ, చిన్నచిన్న పురుగులు కూడా రాకుండా ఉంటాయి.
ఇక బయట నుంచి రాగానే షూ, చెప్పులు ఇంట్లోకి ఎట్టి పరిస్థితులలోనూ తీసుకురాకూడదు. షూస్‌ను బయటే విప్పడం అనే పద్ధతిని అలవాటు చేసుకోవాలి. మెయిన్ ఎంట్రన్స్ వద్ద లోపల, బయట రెండు డోర్ మ్యాట్లు వేయాలి. మన ఇంట్లోని పెట్ ఏనిమల్స్ బయటకు వెళ్లొచ్చినప్పుడు వాటి పాదాలను కడగడం, అవి పడుకునే మ్యాట్లను తరచూ ఉతకడం చేయాలి.
చాలామంది కింద ఉన్న ఫర్నిచర్‌ను మాత్రమే తుడుస్తారు కానీ సీలింగ్ ఫ్యాన్లు, ఫ్రిడ్జ్ పైన, అల్మరాల పైభాగం, సోఫాల వెనుక భాగాన్ని పట్టించుకోరు. అక్కడ చేరే దుమ్మే మనం ఫ్యాన్ వేసినపుడు గాలికి ఇల్లంతా పరుచుకుంటుంది. ఇక దుమ్మును ఎక్కువగా పీల్చుకునే కార్పెట్లు, సోఫా కుషన్లను రెగ్యులర్‌గా వ్యాక్యూమ్ క్లీనర్‌తో క్లీన్ చేయాలి.
బెడ్ షీట్లను వీక్‌కు ఒకసారి హాట్ వాటర్‌తో ఉతికితే బెటర్. ఏసీ ఫిల్టర్లలో దుమ్ము ఉంటే కనుక అది గాలి ద్వారా అది మళ్లీ రూమ్‌లోకే వ్యాపిస్తుంది. ఎప్పుడైనా క్లీనింగ్(Dust Cleaning)పని పెట్టుకునేటప్పుడు కూడా ఒక పద్ధతి పాటించాలి. ముందు పైన ఉండే ఫ్యాన్లు, షెల్ఫ్‌లు తుడిచి, ఆ తర్వాత టీపాయ్, టీవీ వంటివి తుడాలి. ఆఖరుగా ఫ్టోర్ను తుడవాలి.
విండోస్‌కు కిటికీలకు సన్నని యాంటీ డస్ట్ నెట్లు, అలాగే మందపాటి కర్టెన్లు వాడటం, గదిలో ఎయిర్ ప్యూరిఫైయర్లు లేదంటే ఇండోర్ మొక్కలను ఉంచడం వల్ల గాలి క్లీన్ అయి దుమ్ము సమస్య చాలా వరకు తగ్గుతుంది.
Decision : లైఫ్‌లో సరైన డెసిషన్ తీసుకోలేకపోతున్నారా? కన్ఫ్యూజన్కు ఇలా చెక్ పెట్టండి..





