Credit Card : క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 6 తప్పులు అస్సలు చేయొద్దు..

Credit Card : ఒకప్పుడు డెబిట్ కార్డు వాడినంత ఈజీగా ఇప్పుడు క్రెడిట్ కార్డును వాడేస్తున్నారు. ఇప్పుడు ఒక సౌకర్యవంతమైన ఆర్థిక పరికరంగా చాలామంది దీనిని వాడుతున్నారు

Credit Card

ఒకప్పుడు డెబిట్ కార్డు వాడినంత ఈజీగా ఇప్పుడు క్రెడిట్ కార్డును వాడేస్తున్నారు. ఇప్పుడు ఒక సౌకర్యవంతమైన ఆర్థిక పరికరంగా చాలామంది దీనిని వాడుతున్నారు. మన దగ్గర డబ్బులు లేకపోయినా, మన అకౌంట్‌లో బ్యాలెన్స్ లేకపోయినా కూడా అత్యవసర సమయాల్లో క్రెడిట్ కార్డ్(Credit Card) ఆదుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.

కానీ క్రెడిట్ కార్డు(Credit Card)ను ఎలా వాడాలో తెలియకపోతే మాత్రం అది తీరని అప్పుల్లోకి నెట్టేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కొంతమంది ఆకర్షణీయమైన రివార్డ్ పాయింట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్ల కోసం అట్రాక్ట్ అయి అనవసరమైన ఖర్చులు చేస్తుంటారని అంటున్నారు. ముఖ్యంగా ఆరు సందర్భాలలో మాత్రం క్రెడిట్ కార్డు(Credit Card)ను వాడకపోవడమే అందరి ఆర్థిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.

మొదటిది, ఆన్‌లైన్ సేల్స్ చూసి ఆవేశంగా షాపింగ్ అస్సలు చేయకూడదు. మనకు అవసరం లేకపోయినా కూడా కొంతమంది కేవలం ఆఫర్ ఉంది కదా అని కార్డు గీసేస్తుంటారు. దీని వల్ల వచ్చే నెలలో బిల్లు భారంగా మారుతుంది. అందుకే మన దగ్గర నగదు ఉన్నప్పుడు అలాగే ఆ వస్తువు అవసరం బాగా ఉన్నప్పుడే కార్డుతో కొనాలి.

రెండవది, ఒక అప్పు తీర్చడానికి మరో కార్డును వాడటం కూడా చేయకూడదు. క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక మరో కార్డుతో తీర్చాలనుకోవడం అనేది ఒక విషవలయం వంటిదని అంటారు నిపుణులు. దీనివల్ల వడ్డీ మీద వడ్డీ పెరిగిపోయి చివరకు ఆర్థిక విషయంలో మీ లెక్క తప్పుతుంది.

మూడో పొరపాటు, ఎలాంటి ప్రణాళిక లేకుండా ఐఫోన్ , ఖరీదైన ల్యాప్‌టాప్ వంటి పెద్ద వస్తువులను కొనడం చేయకూడదు . బిల్లు వచ్చినప్పుడు పూర్తి మొత్తం చెల్లించలేక కేవలం మినిమం డ్యూ (Minimum Due) మాత్రమే కడితే, మిగిలిన బ్యాలెన్స్ మీద బ్యాంకులు 36 నుంచి 42 శాతం వరకు భారీ వడ్డీని వసూలు చేస్తుంటాయి.

నాలుగోది అలాగే అతి ముఖ్యమైనది ఏటీఎం నుంచి క్రెడిట్ కార్డుతో డబ్బు తీయడం అసలే చేయకూడదు. ఎందుకంటే డెబిట్ కార్డుతో డబ్బు తీసినట్లు క్రెడిట్ కార్డుతో ఏటీఎం నుంచి విత్ డ్రా చేస్తే కనుక, తీసిన మరుక్షణం నుంచే వడ్డీ లెక్క మొదలవుతుంది. దీనికి ఎక్స్‌ట్రా ట్రాన్సాక్షన్ ఛార్జీలు కూడా ఉంటాయి.

Credit Card

ఐదోది, రెంట్స్ పే చేయడం లేదా వాలెట్ లోడ్ చేయడం వంటి లావాదేవీలకు కార్డు వాడకపోవడమే బెటర్. వీటిపై బ్యాంకులు ఎక్స్‌ట్రా సర్వీస్ ఛార్జీలు వేస్తాయి. ఇవి మనకు మరింత భారంగా మారుతాయి.

చివరిది అలాగే ఆరోది మీ ఆదాయానికి మించి కార్డు పరిమితిని వాడటం అస్సలు చేయకూడదు అంటారు నిపుణులు. ఎప్పుడూ మీ ఆదాయం కంటే కూడా తక్కువగానే ఖర్చు చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే క్రెడిట్ కార్డును ఎప్పుడూ ఒక ఆయుధంలా వాడుకోవాలి తప్ప, అది మనపైన పెత్తనం చేసేలా చేసుకోకూడదు. అప్పులు లేని జీవితమే అసలైన సంపద అని తెలుసుకుంటే క్రెడిట్ కార్డు వాడకం మరింత ఆహ్లాదంగా , అనువుగా ఉంటుంది.

RCB vs RR : రాయల్ ఫైట్ లో గెలిచేదెవరు ?…బెంగళూరుతో తలపడనున్న రాజస్థాన్

Exit mobile version