Egg Price : సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న కోడిగుడ్డు.. భారీగా పెరిగిన ట్రే రేట్

Egg Price : లోకల్‌గా గుడ్ల ప్రొడక్టివిటీ తగ్గడానికి కోళ్లలో జరిగే మౌల్టింగ్ ప్రాసెస్ అనే ఒక పద్ధతి కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు.

Egg Price

మధ్యతరగతి, పేద కుటుంబాల్లో నాన్‌వెజ్, కూరగాయల ధరలు పెరిగినప్పుడల్లా అంతా కోడిగుడ్ల వైపే మొగ్గు చూపుతారు. అందులోనూ తక్కువ ఖర్చులో ఎక్కువగా ప్రొటీన్ దొరికే హెల్దీ ఫుడ్ ఇదే కావడంతో చాలామంది ఎగ్స్‌ను డైలీ తింటారు. కానీ ఇప్పుడు ఆ కోడిగుడ్డు (కోడిగుడ్డు)కూడా సామాన్యుడికి గుదిబండగా మారింది.

రెండు వారాల క్రితం వరకు రూ. 6 లోపే దొరికిన గుడ్డు.. ఇప్పుడు కిరాణా షాపుల్లో ఏకంగా రూ. ఏడున్నర నుంచి రూ. 8 వరకు పలుకుతోంది. నెల క్రితం రూ. 160 ఉన్న ముప్పై గుడ్ల ట్రే ధర ఇప్పుడు ఏకంగా రూ. 220 కి చేరింది.

ఈ ధరల పెరుగుదల(Egg Price) వెనుక అంతర్జాతీయ కారణాలతో పాటు కొన్ని టెక్నికల్ రీజన్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో దేశీయ గుడ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా అమెరికా వంటి విదేశాలకు ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఎగుమతులు జరుగుతున్నాయి.

దీనికి తోడు ఇరాన్ యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయంగా ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు పెరిగాయి. అలాగే కోళ్లకు పెట్టే దాణా ధరలు, పౌల్ట్రీ ఫారాలలో పనిచేసే కార్మికుల వేతనాలు కూడా భారీగా పెరగడం కూడా ఈ రేట్ల పెరుగుదలకు ఒక ప్రధాన కారణంగా మారినట్లు తెలుస్తోంది.

కానీ వీటన్నింటికంటే ముఖ్యంగా లోకల్‌గా గుడ్ల ప్రొడక్టివిటీ తగ్గడానికి కోళ్లలో జరిగే మౌల్టింగ్ ప్రాసెస్ అనే ఒక పద్ధతి కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. కోళ్లు మరీ ఎక్కువ వెయిట్ పెరిగిపోకుండా ఉండటానికి పౌల్ట్రీ రైతులు కొన్ని రోజుల పాటు వాటికి దాణా తగ్గించి కేవలం వాటర్ మాత్రమే ఇచ్చి.. ఆ తర్వాత నెమ్మదిగా దాణా శాతాన్ని పెంచుతారు.

Egg Price

ఈ ప్రక్రియ జరిగేటప్పుడు దాదాపు 20 రోజుల పాటు కోళ్లు అస్సలు గుడ్లు పెట్టవు. ప్రస్తుతానికి మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే సుమారు 600 మంది పౌల్ట్రీ రైతులు 3 కోట్ల లేయర్ కోళ్లను పెంచుతున్నారు. సాధారణంగా ఇక్కడ రోజుకు కోటి డెబ్బై లక్షల గుడ్లు ఉత్పత్తి అవ్వాల్సి ఉండగా, ఈ మౌల్టింగ్ ప్రాసెస్ వల్ల ఉత్పత్తి ఒక్కసారిగా పడిపోయింది.

ప్రస్తుతానికి సామాన్యులకు రిలీఫ్ లభించేలా పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు వర్షాకాలం ప్రారంభం కావడంతో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల గుడ్ల ప్రొడక్టివిటీ మరింత తగ్గే ఛాన్స్ ఉందని పౌల్ట్రీ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

Sudan : తీవ్ర స్థాయికి సూడాన్ సంక్షోభం..ఘోరవిపత్తు చూడబోతున్నామా ?

Exit mobile version