Gold Rates
గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు మళ్లీ పైపైకి వెళుతున్నాయి.అమెరికా,ఇరాన్ యుద్ధానికి బ్రేక్ పడిందంటూ వార్తలు వచ్చినా గందరగోళ పరిస్షితులు నెలకొన్న నేపథ్యంలో బంగారం ధర బుధవారం పెరిగింది. బులియన్ మార్కెట్ వివరాల ప్రకారం చూస్తే హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇవాళ(బుధవారం) రూ.1,46,670 రూపాయలుగా ఉంది.
నిన్న మంగళవారంతో పోలిస్తే రూ.3760 పెరిగింది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర(Gold Rates) రూ.3450 పెరిగి రూ.1,34,450కి చేరింది. గత వారం రోజులుగా బంగారం ధర తగ్గుతూ వచ్చింది. మార్చి 18 నుంచి చూసుకుంటే దాదాపు రూ.10 వేల వరకూ తగ్గింది. గత వారం ఇదే రోజున రూ.1,57,420 రూపాయలు ఉండగా..
ఇప్పుడు రూ.1,46,670కు వచ్చింది. మరోవైపు వెండి ధర కూడా పెరిగింది. నిన్నటితో పోలిస్తే కేజీ వెండి పది వేలు పెరిగి రూ.2,60,000కు చేరింది. గత వారం ఇదే రోజు రూ.2,75,000 ఉన్న కేజీ వెండి ధర తగ్గుతూ వచ్చి ఇప్పుడు మళ్లీ జంప్ అవుతోంది.
గత కొంతకాలంగా బంగారం, వెండి ధరలు(Gold Rates) రికార్డు స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో గోల్డ్ మార్కెట్ పై ఒత్తిడి పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే ధరలు పెరుగుతాయి. అయితే గత వారం రోజుల్లో మాత్రం పూర్తిగా భిన్నమైన పరిస్థితి కనిపించింది.
నిజానికి ఈ ఏడాది జనవరి బంగారం ధర గరిష్ట స్థాయికి చేరింది. మార్చి మధ్యలో మళ్లీ నాలుగు నెలల కనిష్ట ధరకు వచ్చింది. దీంతో ఒకరకమైన అనిశ్చితి, గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునే వారు కన్ఫ్యూజన్ లో పడ్డారు.
అసలు ఇప్పుడు కొనొచ్చా… రానున్న రోజుల్లో లక్ష లోపుకు ధర దిగొస్తుందన్న వార్తలు నిజమేనా అన్న దానిపై ఆరా తీస్తున్నారు. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం యుద్ధం జరిగినన్ని రోజులు, ముగిసిన తర్వాత కూడా లక్ష లోపుకు వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకని బంగారం కొనే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తున్నారు.
RCB : ఆర్సీబీ సేల్ @ 16 వేల కోట్లు…గంటల్లోనే రాజస్థాన్ రికార్డు బ్రేక్
