Silver :ఒక్కరోజే భారీగా పెరిగిన సిల్వర్ రేట్.. దిగొచ్చిన బంగారం ధరలు

Silver : హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1లక్ష56వేల 220 కి చేరింది.

Silver

బంగారం కొనాలనుకునే వారికి , మార్కెట్ ట్రెండ్స్ గమనించే వారికి కీలకమైన అప్‌డేట్ వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న ఆర్థిక పరిణామాల వల్ల.. ఇవాళ బులియన్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఒకదానికొకటి పూర్తి భిన్నమైన దిశలో కదిలి అటు కొనుగోలుదారులను, ఇటు పెట్టుబడిదారులను కూడా ఆశ్చర్యపరిచాయి.

కొన్ని రోజులుగా ఒడిదుడుకులకు లోనవుతున్న పుత్తడి ధరలు సోమవారం ఉదయం ఊరటనివ్వగా, సిల్వర్ ధర మాత్రం ఒక్కసారిగా భారీగా పెరిగి షాక్ ఇచ్చింది. గ్లోబల్ మార్కెట్లో అమెరికన్ డాలర్ , ట్రెజరీ ఈల్డ్స్ బలోపేతం అవడం వల్ల అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 12 డాలర్లు తగ్గి ఇప్పుడు 4,535 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ అంతర్జాతీయ ఒత్తిడి దేశీయ మార్కెట్ పైన కూడా స్పష్టంగా కనిపించింది.

భారత దేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడిపై రూ. 710 తగ్గగా,జ్యువెలరీ తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారంపై రూ. 650 వరకూ తగ్గింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన సిటీలు అయిన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1లక్ష56వేల 220 కి చేరింది. అలాగే అదే నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1లక్ష43వేల200 వద్ద కొనసాగుతోంది.

ఇతర మెట్రో నగరాలైన ముంబై, కోల్‌కతా, చెన్నైలలో కూడా ఇవే ధరలు కొనసాగుతూ ఉండగా, దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం రేట్లు కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం రూ. 1లక్ష56వేల370 గా, 22 క్యారెట్ల ధర రూ. 1లక్ష43,వేల350 గా రికార్డయింది.

బంగారం ధరలు తగ్గుముఖం పడితే, వెండి (Silver) మాత్రం దీనిని పూర్తి రివర్స్ ట్రెండ్ చూపించింది. మూడు రోజులుగా వెండి ధరలు విపరీతంగా పడిపోతూ వచ్చాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే కిలో సిల్వర్‌పై ఏకంగా రూ. 30,000 వరకు తగ్గి కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చింది.

Silver

అయితే సోమవారం ఉదయం మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి మాత్రం సీన్ రివర్స్ అయింది. ఒక్కరోజే కిలో సిల్వర్‌పై ఏకంగా రూ. 10,000 వరకూ భారీగా పెరిగింది. ఈ ఆకస్మిక పెరుగుదలతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం , చెన్నై నగరాలలో కిలో వెండి(Silver ) ధర మళ్లీ రూ. 3లక్షల మార్కును టచ్ చేసింది.

కాగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాలలో ప్రస్తుతం కిలో సిల్వర్ రేటు రూ. 2లక్షల 90వేలు వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ధరలన్నీ ఉదయం మార్కెట్ ప్రారంభంలో నమోదైనవి మాత్రమే. అంతర్జాతీయ మార్కెట్ కదలికలు, ద్రవ్యోల్బణ పరిస్థితులు , దేశీయ డిమాండ్‌ను బట్టి ఈ రేట్లు మారుతూ ఉంటాయి కాబట్టి కొనుగోలుదారులు లైవ్ ధరలను గమనించి నిర్ణయం తీసుకోవాలని గుర్తించుకోవాలి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version