Ketan : నన్ను బెదిరించాడు.. లవర్‌ను ఇరికించేస్తున్న సియా

Ketan : తాను కేతన్‌ను హత్య చేయకపోతే పర్సనల్ ఫోటోలు లీక్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేసాడంటూ సియా పోలీసులకు చెప్పింది.

Ketan

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పూణే యువ పారిశ్రామిక వేత్త కేతన్(Ketan) హత్య కేసులో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కాబోయే భార్య సియా, ఆమె ప్రియుడే ఈ హత్యకు పాల్పడ్డారని తేలిపోవడంతో.. పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

దీనిలో భాగంగా నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరి ఒకరిపై ఆరోపణలు చేసుకుంటూ ప్లాన్ మొత్తం చెప్పేశారు. వారు చెప్పిన షాకింగ్ నిజాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

కేతన్‌(Ketan)ను హత్య చేయాలని చేతన్ తనపై ఒత్తిడి తెచ్చాడని సియా గోయల్ చెబుతోంది. ఈ మొత్తం మర్డర్ ప్లాన్‌ను అతనిపైకి నెట్టేసింది. ఒకవేళ తాను కేతన్‌ను హత్య చేయకపోతే పర్సనల్ ఫోటోలు లీక్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేసాడంటూ సియా పోలీసులకు చెప్పింది. మొదటి సారి హత్యాయత్నం చేసినప్పుడు చేతన్ ఏడ్చాడనీ, అతని ఒత్తిడితోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు విచారణలో సియా చెప్పడం సంచలనంగా మారింది.

మరోవైపు చేతన్ చెప్పిన విషయాలు సియా చెప్పిన మాటలకు భిన్నంగా ఉన్నాయి. హత్య చేసే ఉద్దేశం తనకు అస్సలు లేదని.. పారిపోయి పెళ్లి చేసుకుందామని తాను చెబితే సియా మాత్రం కేతన్ బతికుండగా అది కుదరదని చెప్పినట్టు విచారణలో వెల్లడించాడు.

తాను పారిపోతే కుటుంబం పరువు పోతుందని, అందుకే కేతన్‌ను చంపేసి ప్రమాదంగా చిత్రీకరిద్దామంటూ ఆమెనే ప్లాన్ చేసిందని పోలీసుల ముందు చెప్పుకొచ్చాడు. అసలు ఈ మర్డర్ ప్లాన్ మొత్తం సియానే చేసిందని కేతన్ ఆరోపించాడు. దీంతో నిందితులిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఇలా షాకింగ్ నిజాలు వెల్లడించడం హాట్ టాపిక్ అవుతోంది.

Ketan

మరోవైపు కేతన్‌కు బట్టతల ఉందన్న కారణంతోనే సియా ఈ హత్యకు పాల్పడిందన్న వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని సంబంధం కుదుర్చుకునే సమయంలోనే సియాకు, ఆమె కుటుంబానికి తాము చెప్పినట్టు కేతన్ తండ్రి వెల్లడించారు. తన కుమారుడితో పెళ్లి ఇష్టం లేకపోతే ఆ విషయాన్నితమతో చెప్పాల్సిందని..తామే వెంటనే పెళ్లి రద్దు చేసే వారిమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే కేతన్ హత్య కేసు విచారణపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును వాదించేందుకు ప్రముఖ లాయర్ ఉజ్వల్ నికమ్‌ను పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించింది. తమ కుమారుడి హత్య కేసులో న్యాయం చేయాలంటూ అతని తల్లిదండ్రులు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన తర్వాత.. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ విషయం గురించి సీఎంఓ నుంచి ప్రకటన వచ్చింది.

Divorce : విడిపోవాలనుకుంటే 6 నెలలు ఆగక్కరలేదు.. కూలింగ్ పీరియడ్‌పై మరోసారి చర్చ

Exit mobile version