Ketan Agarwal
మహారాష్ట్రలోని లోహగడ్ కోట అనగానే ఒకప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరత్వానికి, శూరత్వానికి ప్రతీకగా గుర్తుకు వచ్చేది. పదో శతాబ్దానికి చెందిన ఈ చారిత్రక కట్టడం, అక్కడి అందమైన ప్రకృతి దృశ్యాలు, ట్రెక్కింగ్ ఇష్టపడే వారికి మాత్రం హాట్ ఫేవరేట్ ప్లేస్‌గా బాగా ప్రసిద్ధి పొందింది. అందుకే ఈ అపురూపమైన కట్టడానికి యునెస్కో గుర్తింపు కూడా దక్కింది.
కానీ, కొద్దిరోజులుగా ఈ అద్భుతమైన పర్యాటక ప్రాంతం టూరిస్టులతో మరింత బిజీబిజీగా మారిపోయింది. చరిత్రను చూడటానికి వచ్చే జనాలు కంటే.. అక్కడ ఇటీవల జరిగిన ఘోరమైన క్రైమ్ స్పాట్‌ను చూడటానికి వస్తున్న వారి సంఖ్యే ఎక్కువ అయింది.
కేతన్ అగర్వాల్(Ketan Agarwal) అనే యువకుడిని తన కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి లోయలోకి తోసి చంపేసిన ఘటన మహారాష్ట్రలో ఎలాంటి సెన్సెషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ ఘోరం జరిగినప్పటి నుంచి లోహగడ్ కోటకు వచ్చే టూరిస్టుల సంఖ్య యాభై శాతం పెరిగిపోయింది.
సాధారణ రోజుల్లో వందల్లో వచ్చే సందర్శకులు, ఇప్పుడు వేలల్లో తరలివస్తున్నారు. పోలీసులు నేరం జరిగిన స్థలాన్ని పరిశీలించడానికి లోహగడ్ కోట ఎంట్రీని నిలిపివేస్తుంటే.. లోపలికి వెళ్లలేకపోయామే అని నిరాశపడుతున్నవారు అక్కడ ఎందరో కనిపిస్తున్నారు.
అంతేకాదు అక్కడకు వస్తున్న ప్రతీ ఒక్కరి నోటా ..కేతన్(Ketan Agarwal) హత్య గురించిన మాటలే వినిపిస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆ అబ్బాయిని ఎక్కడి నుంచి తోసేశారు. అసలు అక్కడ ఏం జరిగి ఉంటుంది అని ఆరా తీస్తూ ఆ స్పాట్‌ను వెతుక్కుని మరీ వెళ్లి చూసి వస్తున్నారు.
అయితే ఇక్కడ మనందరం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఒక చారిత్రక ప్రదేశానికి దాని విశిష్టతను బట్టి వెళ్లడం చూశాం ..కానీ, ఒక మనిషి ప్రాణం పోయిన చోటును, అందులోనూ అంత దారుణంగా హత్యకు గురైన స్థలాన్ని చూడటానికి జనాలు ఇంతలా ఎగబడటం నిజంగా ఆశ్చర్యకరమే.
నిజానికి మానవ నైజంలో ఒక విచిత్రమైన గుణం ఉంది. ఎక్కడైనా ఒక విషాదం లేదా క్రూరమైన ఇన్సిడెంట్ జరిగితే, దాని గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ, ఆరాటం మనుషుల్లో ఎక్కువగా పెరుగుతుంటుంది. దీనినే సైకాలజీలో డార్క్ టూరిజం అని కూడా అంటారు. ఎదుటివారి జీవితంలో జరిగిన ఘోరాన్ని చూసి, మనసులో ఒక రకమైన సంచలనాన్ని అనుభవించడానికే జనాలు ఇలాంటి ప్రదేశాలకు వెళ్తుంటారని మానసిక నిపుణులు అంటున్నారు.
What’s App : వాట్సాప్‌లో నో మోర్ ఫోన్ నెంబర్స్.. మీ యూజర్‌నేమ్ ఇప్పుడే లాక్ చేసుకోండి
