Bigg Boss 10 Telugu Day 24
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నాలుగో వారం ప్రారంభంలోనే టోటల్ డామినేషన్ థీమ్‌తో హౌస్‌లో బిగ్ బాస్ పెద్ద మంటే పెట్టాడు. కంటెస్టెంట్లను టీమ్ భైరవ, టీమ్ సప్తశక్తి అని రెండు గ్రూపులుగా విడగొట్టడంతో మొదలైన గొడవలకు టీవీ స్పీకర్లు బ్లాస్ట్ అయిపోతాయా అన్నంత రేంజ్‌లో గొడవ నడిచింది. ఒకరినొకరు డౌన్ చేసుకుంటూ మాటలు వదిలేయడమే కాదు.. ఏకంగా శ్రిష్టి, ముఖేశ్ గాయపడటం హౌస్‌లో వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది.
కెప్టెన్ అపూర్వకి, ముఖేశ్‌కి ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే డిష్ వాషింగ్, కెప్టెన్ రూమ్ ఖాళీ చేసే విషయంలో చాలా పెద్ద గొడవ జరిగింది. మీటింగ్ పెడితేనే కండీషన్స్ పాటిస్తానని ముకేశ్‌తేల్చేయడంతో అపూర్వ ఇమ్మీడియట్‌గా మీటింగ్ పెట్టింది. తన ప్లేస్‌ను చులకనగా చూస్తున్నారని, త్రిగుణ్ అండ్ ముకేశ్ తనను కంపల్సరీగా కెప్టెన్ అపూర్వ అనే పిలవాలని రూల్ పాస్ చేసింది.
కానీ తాను పిలవని, ఏం చేసుకుంటావో చేసుకోమని త్రిగుణ్ అపూర్వ ఫేస్ ముఖం మీదే చెప్పేశాడు. మరోవైపు తనను కావాలనే బ్యాడ్‌గా ప్రొజెక్ట్ చేస్తోందంటూ అపూర్వపై షాలినీ ఫైర్ అయింది. ఇక మిథిలేష్ టూ డేస్ మాత్రమే ఉండి రూ.15 లక్షలు పట్టుకెళ్లాడని, అగ్నిపరీక్ష టీమ్ అంతా ఒక్కటేనని త్రిగుణ్, దేబ్జానీ మాట్లాడటం.. మిడ్ నైట్ కెప్టెన్ రూమ్ నుంచి త్రిగుణ్ డ్రింక్స్ దొంగిలించడం హౌస్‌లో గరంగరమ్‌గా మారాయి.
ఇక మెయిన్ టోటల్ డామినేషన్ టాస్క్‌లో భాగంగా.. బిగ్ బాస్ ఇచ్చిన కత్తులను లాక్కోవడానికి ప్రాంక్ సాకుతో నరేష్‌ను రోహిత్, సుధీర్, రాంప్రసాద్ ఎత్తుకెళ్లి అతని దగ్గర కత్తి లాక్కున్నారు. దీంతో నరేష్ హర్ట్ అయ్యాడు. దీనికోసం సప్తశక్తి టీమ్ రివెంజ్‌గా ఝాన్సీపై మూకుమ్మడిగా దాడి చేసి కత్తి లాక్కోవడానికి చాలా ట్రై చేసింది.
ఆ తర్వాత రథం నిర్మాణం టాస్క్‌లో రోహిత్, షాలినీ సంచాలకులుగా ఉండగా.. అపూర్వ మాట్లాడటానికి వస్తే షాలినీ ఆమెపై ఒక్కసారిగా విరుచుకుపడింది. ప్రతీసారి తన మధ్యలోకి దూరుతున్నావంటూ షాలినీ గట్టిగా అరవడంతో ఇద్దరి మధ్య పెద్ద యుద్దమే జరిగింది.
గేమ్‌లో జరిగిన తొక్కిసలాటలో శ్రిష్టి కాలికి దెబ్బ తగలడంతో.. మెడికల్ రూమ్‌కి వెళ్తూ తన కత్తిని షాలినీకి ఇచ్చింది. అది గమనించిన అపూర్వ వెంటనే షాలినీ దగ్గరున్న కత్తిని లాక్కోవాలంటూ సైగ చేయడంతో భైరవ టీమ్ అంతా షాలినీ మీద ఒక్కసారిగా పడింది.
దీంతో(Bigg Boss 10 Telugu Day 24) మెడికల్ రూమ్‌లో ఉన్న అమ్మాయి కత్తి లాక్కోవడం ఏంటంటూ త్రిగుణ్, రోహిత్ ఓ రేంజ్‌లో గొడవపడ్డారు. రీస్టార్ట్ అయ్యాక అమన్ వల్ల ముకేశ్ కాలికి కూడా దెబ్బ తగిలింది. మొత్తానికి ఈ(Bigg Boss 10 Telugu Day 24) రచ్చ మధ్య మొదటి రౌండ్‌లో టీమ్ భైరవ గెలవడంతో.. రథం పార్ట్‌ను దక్కించుకుంది.
