Bigg Boss New Captain : బిగ్ బాస్ కొత్త కెప్టెన్ త్రిగుణ్.. సుధీర్‌కు ఊహించని ట్విస్ట్

Bigg Boss New Captain : బిగ్‌బాస్ హౌస్‌లో ఫ్రైడే ఎపిసోడ్ త్రిగున్ కెప్టెన్సీ , రోహిత్ , అమన్ ఫైట్, సుధీర్ ఎలిమినేషన్ సస్పెన్స్ డ్రామాతో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగింది.

Bigg Boss New Captain

బిగ్‌బాస్ హౌస్‌లో రోజురోజుకూ పాలిటిక్స్ ముదిరిపోతున్నాయి. అమన్ శ్వేతకు సపోర్ట్ చేసిన విషయంపై రోహిత్, నీతూ మధ్య చర్చతోనే ఫ్రైడే రోజు ప్రారంభమైంది. గ్రీన్ లెవెల్ కంటెస్టెంట్స్‌కు కెప్టెన్సీ టాస్క్ ప్రకటించగా, నాగార్జున ఇచ్చిన పనిష్మెంట్ వల్ల అమన్‌కు ఆ ఛాన్స్ దక్కకపోవడంతో.. అమన్ ఎమోషనల్ అయ్యాడు.

ఇక కెప్టెన్సీ(Bigg Boss New Captain) రేసు కోసం ముగ్గురు సపోర్టర్లను ఎన్నుకోవాల్సి రాగా, ఈ సెలక్షన్ విషయంలో పెద్ద గొడవే జరిగింది. అమన్ ఏమో త్రిగుణ్ గెలవాలని కోరుకోవడం, కొందరు ముకేశ్ అని రోహిత్ వద్దు అనడంతో రోహిత్ ,అమన్‌ మధ్య పెద్ద వాగ్వాదమే నడిచింది. చివరికి ఓటింగ్ వేయడం ద్వారా అమన్ సపోర్టర్‌గా ఫైనల్ అయ్యాడు.

ఈ టాస్క్‌లో సంచాలక్‌గా వ్యవహరించిన రోహిత్ పర్యవేక్షణలో ఆట రసవత్తరంగా సాగింది. త్రిగుణ్ చివరి వరకు పోరాడి గెలవడంతో పాటు అల్టిమేట్ గోట్‌గా నిలిచి కెప్టెన్‌గా(Bigg Boss New Captain) పీఠం ఎక్కాడు. అదొక్కటే కాదు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నంతకాలం ప్రతి వారం కెప్టెన్సీ కంటెండర్ రేసులో త్రిగుణ్ ఉండే గోల్డెన్ ఛాన్స్‌ను కూడా దక్కించుకున్నాడు. అయితే ముకేష్ ఓడిపోవడంతో ఓవర్‌గా రియాక్ట్ అవుతూ త్రిగుణ్‌ను అభినందించడానికి కూడా రాలేదు. ఇక త్రిగున్ కెప్టెన్ అవ్వడంతో రోహిత్ ఫేస్ మొత్తం మాడిపోయింది.

ఆ తర్వాత థమ్స్ అప్ గేమ్, బిర్యానీ విందుతో హౌస్‌లో కాస్త జోష్ వచ్చినా..సడన్‌గా బిగ్‌బాస్ ఇచ్చిన ఎలిమినేషన్ ట్విస్ట్ హౌస్‌మేట్స్‌కు గట్టి షాక్‌ తగిలింది. రెడ్ లెవెల్‌లో ఉన్న ఝాన్సీ, శ్వేత, రామకృష్ణ, రోహిత్, సుధీర్‌లో ఎవరిని పంపాలో చెబుతూ గ్రీన్ లెవెల్ సభ్యులు వారి తలపై బాటిల్ పగలకొట్టి రీజన్లు చెప్పారు. అయితే సందర్బం కాకపోయినా రోహిత్ మాత్రం తన పాత నైజాన్ని బయటపెడుతూ, త్రిగుణ్‌పై అనవసరంగా నెగెటివిటీని ప్రదర్శిస్తూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు.

చివరకు ఆడియన్స్ ఓట్ల ప్రకారం చూసి సుధీర్ ఎలిమినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించడంతో.. సుధీర్ టీమ్ సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ముకేష్ తన వద్ద ఉన్న మ్యాజిక్ పవర్‌ను యూజ్ చేసి ఝాన్సీ ఎలిమినేషన్ ఫ్రీ పవర్‌ను తెప్పించడంతో, ఆ పవర్‌ను ఝాన్సీ సుధీర్ కోసం వాడి అతని ఎలిమినేషన్‌ను ఒక వీక్‌ నుంచి తప్పించింది. మొత్తానికి ఈ రోజు ఆట చూస్తే త్రిగున్‌ను దెబ్బకొట్టడానికి రోహిత్, ముకేష్ ఒక్కటయ్యారని, అలాగే రోహిత్ ,అమన్ బంధం పూర్తిగా చెడిపోయిందని అర్థమవుతోంది.

Dizziness : తరచూ తల తిరుగుతోందా? బాడీలో ఈ ప్రాబ్లెమ్స్ ఉన్నాయేమో చెక్ చేయండి..

↑
Exit mobile version