Dizziness : తరచూ తల తిరుగుతోందా? బాడీలో ఈ ప్రాబ్లెమ్స్ ఉన్నాయేమో చెక్ చేయండి..

Dizziness : కొన్నిసార్లు పడుకుని లేచినప్పుడు, మామూలుగా పనులు చేసుకుంటున్నప్పుడు కూడా తల తిరుగుతూ ఉంటుంది. అయితే దీనికి రీజన్స్ ఏంటి? షుగర్, బీపీ, చెవి సమస్యల ప్రభావం ఉంటుందా?

Dizziness

డైలీ లైఫ్‌లో చాలామంది ఎదుర్కొనే మెయిన్ ఆరోగ్య సమస్యల్లో తల తిరగడం (Dizziness) ఒకటి. అయితే కేవలం పడుకుని ఒక్కసారిగా లేచినప్పుడు లేదంటే కుర్చీలోంచి సడన్‌గా లేచి నిలబడినప్పుడు మాత్రమే కళ్లు తిరుగుతాయని అనుకుంటారు.

కానీ కొంతమందికి మామూలుగా ఇంట్లోనో, ఆఫీసులోనో రెగ్యులర్‌ పనులు చేసుకుంటున్నప్పుడు, ఒక్కోసారి నడుస్తున్నప్పుడు కూడా తల తిరిగినట్లు అయి బ్యాలెన్స్ తప్పుతూ ఉంటుంది. అయితే దీనిని కేవలం నీరసం అనుకుని తేలికగా తీసిపారేయకూడదని.. దీని వెనుక కొన్ని ఆరోగ్య కారణాలు దాగి ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు.

సాధారణంగా పనులు చేస్తున్నపుడో, పడుకుని లేచిన సమయంలోనో తల తిరగడానికి(Dizziness) మెయిన్ రీజన్ మన లోపలి చెవిలో ఉండే ‘వెస్టైబ్యులర్ సిస్టమ్’ (Vestibular System) దెబ్బతినడం కావొచ్చు. మన బాడీ బ్యాలెన్స్ (Balance) కాపాడుకోవడంలో చెవి లోపలి భాగాలు కీలక పాత్ర పోషిస్తాయన్న విషయం చాలామందికి తెలీదు.

అందుకే ఎప్పుడైనా చెవి లోపల ఇన్ఫెక్షన్ లేదంటే అక్కడ ఏదైనా లోపం ఏర్పడితే (Vertigo) నడుస్తున్నప్పుడు, తల తిప్పినప్పుడు గదంతా గుండ్రంగా తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాకుండా కొన్ని సార్లు తీవ్రమైన విటమిన్ బి12, ఐరన్ (Anemia) లోపాలున్నప్పుడు కూడా నడుస్తున్నపుడు శరీరం అలసిపోయి తల తిరుగుతూ ఉంటుంది.

మరికొన్నిసార్లు డయాబెటిస్, బీపీ, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలున్నవారిలో కూడా సాధారణ సమయంలో ఒక్కోసారి కళ్లు తిరుగుతుంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి పనుల ప్రెజర్‌లో బ్లడ్ షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పడిపోతే (హైపోగ్లైసీమియా) పనులు చేస్తున్నపుడు కళ్లు బైర్లు కమ్ముతాయి.

అలాగే బీపీలో అప్ అండ్ డౌన్ ఉన్నా, ఫ్యాటీ లివర్ వల్ల బాడీలో మెటబాలిజం మందగించి వ్యర్థాలు పేరుకుపోయినా విపరీతంగా నీరసం వచ్చి సాధారణ సమయంలో కూడా తల తిరుగుతుంది. ఇక సర్వైకల్ స్పాండిలైసిస్ ఉన్నవారికి కూడా మెడ వంచినపుడు, మెడ పక్కకు తిప్పినపుడు తల తిరిగినట్లు అవుతుంది.

ఈ సమస్య నుంచి బయటపడాలంటే రోజూ బాడీకి సరిపడా నీళ్లు తాగడం, ఎక్కువ టైమ్ కడుపు ఖాళీగా ఉంచకుండా సమయానికి ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం. ఎపుడైనా పనులు చేస్తున్నప్పుడు తల తిరిగినట్లు అనిపిస్తే వెంటనే ఆ పనులు ఆపి ఒకచోట ప్రశాంతంగా కూర్చోవాలి.

ఈ సమస్య పదే పదే వేధిస్తుంటే మాత్రం లేట్ చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన బ్లడ్ టెస్ట్‌లు, ఈఎన్‌టీ (ENT) చెక్‌అప్‌ చేయించుకోవడం మంచిది.

Healthy Relationship : చిన్న విషయానికే కొట్టుకునే స్థాయికి వెళ్తున్నారా?రిలేషన్‌షిప్‌ను కాపాడుకునే సింపుల్ సైకాలజీ టిప్స్

↑
Exit mobile version