GSLV-F18 Rocket
టెక్నికల్ రంగంలో భారతదేశం మరోసారి తన సత్తా చాటుతూ అంతరిక్షంలో సరికొత్త జెండా పాతేసింది. ప్రపంచం మొత్తం అమెరికాకు చెందిన జీపీఎస్ (GPS) సిస్టమ్‌పై ఆధారపడుతూ ఉంటే,భారత్ మాత్రం తమ సొంత నావిగేషన్ వ్యవస్థ అయిన నావిక్ (NavIC)ను మరింత బలపరుస్తూ సగర్వంగా గర్జించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట వేదికగా అక్టోబర్ 30 వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 11.51 గంటలకు ఆకాశంలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్18 (GSLV-F18) రాకెట్, ఎంతో సంక్లిష్టమైన NVS-03 శాటిలైట్‌ను అనుకున్న సమయానికి భూస్థిర కక్ష్యలో కూర్చోబెట్టింది. ఈ ప్రయోగంతో భారత దేశ సరిహద్దుల చుట్టూ 1,500 కి.మీ. వరకూ ఎలాంటి జీపీఎస్ నెట్వర్క్ సాయం లేకుండానే దిశానిర్దేశం చేసుకునే రేంజ్‌కి భారతదేశం చేరుకుంది.
ఈ ప్రయోగంలో మరో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ఉపగ్రహానికి గుండెకాయ వంటి అటామిక్ క్లాక్‌ను ఇస్రో సైంటిస్టులు కేవలం భారతదేశ స్వదేశీ పరిజ్ఞానంతోనే తయారు చేశారు. దీనివల్ల కాల నిర్ధారణ (Period determination)చాలా కచ్చితంగా జరుగుతుంది. అంతేకాకుండా, ఇప్పటివరకు ఉన్న సిగ్నల్స్‌కు తోడుగా సాధారణ మొబైల్ ఇన్స్ట్రమెంట్స్లోనూ పనిచేసే ఎల్-1 (L1) సిగ్నల్‌ను కూడా ఈ NVS-03లో పొందుపరిచారు.
అంటే రాబోయే రోజుల్లో మన మొబైల్స్‌లో లొకేషన్లు చూసుకోవడానికి, రోడ్లపై వెహికల్స్, ట్రైన్స్, సముద్రంలో నౌకల ట్రాకింగ్ కోసం ఇతర దేశాల అప్లికేషన్లపై ఆధారపడే అవసరం లేకుండా ఇండియా నావిక్ సేవలనే డైరెక్టుగా వాడుకోవచ్చు. ఇక డిఫెన్స్ రంగానికి సంబంధించి.. ఇది ఇండియన్ ఆర్మీకి ఒక పెద్ద అస్త్రంగా మారనుంది.
గతంలో కొన్ని ఉపగ్రహాల్లో చిన్నచిన్న సమస్యలు రావడం వల్ల నావిక్ సేవల్లో కొంత ఆలస్యం జరిగింది. అయితే ఈ నాలుగో శాటిలైట్ కక్ష్యలోకి చేరడంతో నావిక్ సిస్టం తన పూర్తిస్థాయి కెపాసిటీని మళ్లీ సొంతం చేసుకుందని ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ సంతోషం వ్యక్తం చేశారు.
అంతేకాదు ఇస్రో కొత్త రికార్డులను తిరగ రాయడమే అలవాటుగా మార్చుకుందా అన్నట్లుగా మారింది. 420 టన్నుల బరువున్న రాకెట్‌ను(GSLV-F18 Rocket) ఆకాశంలోకి పంపడమే కాకుండా, గత జీఎస్ఎల్వీ ప్రయోగం జరిగిన కేవలం 56 రోజుల తేడాలోనే మరో రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించి..యావత్ ప్రపంచ శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరిచింది.
Passive Resistance : చెప్పినవన్నీ చేస్తామంటారు..కానీ నచ్చిందే చేస్తారు.. మీరూ అదే టైపా?
