Bigg Boss Nominations : నామినేషన్స్‌లో త్రిగుణ్ చుట్టూ తిరిగిన డ్రామా.. ఈసారి ఎలిమినేట్ అయ్యేది అతనేనా?

Bigg Boss Nominations : ఈ వారం నామినేషన్స్ ముగిసేసరికి ముకేశ్ గౌడ, త్రిగుణ్, దేబ్జానీ, అమన్, రోహిత్, షాలిని, నరేష్,చరణ్, సృష్టి.. ఈ 9 మంది డేంజర్ జోన్‌‌లో ఉన్నారు.

Bigg Boss Nominations

రాత్రికి రాత్రే ఈక్వేషన్స్ మార్చేయడం, స్నేహితులే శత్రువులుగా మారిపోవడం పాలిటిక్స్‌ను మించిన మైండ్‌సెట్‌ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో కామన్ అయిపోయాయి. కాకపోతే ఈ నాలుగో వారంలో మాత్రం నామినేషన్స్ ఫైర్ మొత్తం ఒక్కడి చుట్టూ నడిచాయా అన్నట్లుగా సాగాయి.

రూల్స్ చెప్పడం వరకు మాత్రమే అతను అని, తను మాత్రం అస్సలు పాటించడనే బ్యాడ్ నేమ్ తెచ్చుకున్న త్రిగుణ్ ఈసారి హౌస్‌మేట్స్ అందరికీ కూడా టార్గెట్ అయ్యాడు. ఈ ఎపిసోడ్‌లో మాటల తూటాలు, పర్సనల్ అటాక్స్ గట్టిగానే పేలాయి. నామినేషన్ల కంటే ముందు రణరంగంలో రథనిర్మాణం అనే ఆటతో పాటు మూడు దశల్లో రెండు గేమ్స్ గెలిచిన భైరవ టీమ్‌కి బిగ్ బాస్ స్పెషల్‌గా అభినందనలు తెలిపి, నామినేషన్స్‌‌లో ఓ అడ్వాంటేజ్ ఇచ్చారు.

భైరవ టీమ్‌లోని ప్రతీ ఒక్కరికీ ఒకరిని నామినేట్ చేసే అవకాశం రాగా, సప్తశక్తి జట్టుకి మాత్రం బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. వాళ్ల టీమ్ నుంచి కేవలం ఇద్దరికి మాత్రమే నామినేట్ చేసే హక్కు ఉంటుందని, ఆ ఇద్దరు ఎవరో మీరే తేల్చుకోవాలని చిన్న మెలిక పెట్టారు.

ముఖంపై నురుగ స్ప్రే చేసి నామినేట్ చేయాలని చెప్తూ.. ఆల్రెడీ డైరెక్ట్ నామినేషన్‌లో ఉన్న ముకేశ్, కెప్టెన్ అపూర్వకు సేఫ్ కార్డ్ ఇచ్చారు. సప్తశక్తిలో ఉన్న త్రిగుణ్ తనకు ఆ ఛాన్స్ కావాల్సిందేనని మొండికేసి నామినేట్ చేసే ఛాన్స్ దక్కించుకోగా, నరేష్‌‌కి కూడా ఆ అవకాశం లభించింది.

త్రిగుణ్ రోహిత్‌ని నామినేట్(Bigg Boss Nominations) చేస్తూ పర్సనల్ అటాక్ షురూ చేశాడు. మాట్లాడేటప్పుడు అనుకోకుండా ఉమ్ము పడితే రోహిత్ ఓవర్ యాక్షన్ చేశాడని, షాలినికి ఐ లవ్యూ చెప్పానంటూ ఫేక్ నెరేటివ్ సెట్ చేస్తున్నాడని ఫైర్ అయ్యాడు. దానికి రోహిత్ ఉమ్ము పడితే అసహ్యంతో తుడుచుకున్నానని చెబుతూ తన క్యారెక్టర్‌ని బ్యాడ్ చేయడానికే త్రిగుణ్ ఇలా చేస్తున్నాడని అన్నాడు.

మరోవైపు నరేష్ అమన్‌ని నామినేట్ చేస్తూ.. మొదటి రెండు వారాల్లో ఉన్న అమన్ వేరు అని, ఇప్పుడు ప్రతీ గొడవలో దూరుతున్నాడని, సంచాలక్‌గా సరిగా చేయడని, పనిలో బద్ధకం ఎక్కువైందని రీజన్స్ చెప్పాడు. దీనికి అమన్ ఇది ముందే ప్లాన్ చేసుకుని చేస్తున్న నామినేషన్‌లాగే ఉందని సెటైర్ వేశాడు.

ఆ తర్వాత ఝాన్సీ.. సృష్టిని నామినేట్ చేయగా, అమన్ .. త్రిగుణ్‌ మ్యానిప్యులేటర్‌గా మారి పక్కనోళ్ల చేతిలో తోలుబొమ్మ అవుతాడని అనుకోలేదని, మిథిలేష్ విషయంలో ఆగం అయి సారీ చెప్పి మళ్లీ అదే రిపీట్ చేశాడనే రీజన్‌ చెప్పి నామినేట్ చేశాడు. ఈ గొడవలో త్రిగుణ్ అరేయ్ ఒరేయ్ అని అనడంతో అమన్ ఫుల్ ఫైరయ్యాడు. చివరకు త్రిగుణ్ రెండు చేతులు జోడించి సారీ అమన్ గారూ, ఏదో తమ్ముడు అనుకుని అన్నానని చెప్పాడు.

హౌస్ కెప్టెన్ అపూర్వ కూడా త్రిగుణ్‌కి గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఇతను దూత కాదని హౌస్‌కి పెద్ద మోతలా తయారయ్యాడని, రోహిత్‌ని ఆడంగి వేషాలు వేస్తున్నావని అనడం, ఇక్కడున్న ఆడపిల్లలకి సిగ్గులేదనడం, అనని మాటలను అన్నట్లు చెప్పడంపై నిలదీసింది. త్రిగుణ్ తనకిచ్చిన లేడీ త్రిగుణ్ అనే ట్యాగ్ చెండాలంగా ఉందని చాలా రీజన్సే చెబుతూ కడిగి పడేసింది.

Bigg Boss Nominations

ఇక మిగిలిన వారి విషయానికి వస్తే రామ్ ప్రసాద్.. షాలినిని, రోహిత్.. దేబ్జానీని, వర్షిణి.. సృష్టిని నామినేట్ చేశారు. వంశీ, సుధీర్‌ ఇద్దరూ కూడా చరణ్‌నే నామినేట్ చేయగా.. వంశీ,చరణ్‌ల మధ్య గట్టిగా అరుపులు, కేకలతో పెద్ద వార్ నడిచింది. చివరికి సుధీర్ కూల్‌గా నామినేషన్ల ప్రాసెస్‌ను ముగించారు.

ఈ వారం నామినేషన్స్(Bigg Boss Nominations) ముగిసేసరికి ముకేశ్ గౌడ, త్రిగుణ్, దేబ్జానీ, అమన్, రోహిత్, షాలిని, నరేష్,చరణ్, సృష్టి.. ఈ 9 మంది డేంజర్ జోన్‌‌లో ఉన్నారు. ప్రస్తుతానికి వర్చువల్ ఓటింగ్ ట్రెండ్స్ చూస్తుంటే చరణ్, సృష్టిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని..లేదంటే బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్(Bigg Boss Nominations) షాక్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదన్న టాక్ నడుస్తోంది.

October 2026 Festivals : అక్టోబర్‌లో పండుగల జాతర.. దసరా, బతుకమ్మ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాల వరకు..

↑
Exit mobile version