Bigg Boss Safe Zone : బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్ల రీలోడ్ ..సేఫ్ జోన్‌లోకి ఆ టీమ్.. స్విమ్మింగ్ పూల్‌లో హాట్ రొమాన్స్..

Bigg Boss Safe Zone : సాంగ్స్ రాగానే కంటెస్టెంట్లంతా స్విమ్మింగ్ పూల్‌లోకి దిగి హీట్‌ పుట్టించే స్టెప్పులేశారు. ఈ సమయంలో వర్షిణి,ముకేశ్ పూల్‌లో చేసిన రొమాన్స్ అందరినీ ఆకట్టుకుంది.

Bigg Boss Safe Zone

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్‌లో రోజులు గడుస్తున్న కొద్దీ .. హౌస్‌మేట్స్ మధ్య డబుల్ గేమ్‌లు, రొమాంటిక్ ట్రాక్‌లు , మైండ్ గేమ్‌లు నెక్స్ట్ లెవెల్‌కి చేరుతున్నాయి. లాస్ట్ వీకెండ్‌లో ఝాన్సీ, ముకేశ్ గెలుచుకున్న గిఫ్టులు వారి దగ్గరకు చేరుకోవడంతో హౌస్‌లో బజ్ మొదలైంది.

ఒకవైపు చరణ్ దేబ్జానీతో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే, మరోవైపు అపూర్వ ఆడుతున్న డబుల్ గేమ్‌ను త్రిగుణ్..రోహిత్ వద్ద బయటపెట్టేసి పెద్ద స్కెచ్చే వేశాడు. రీలోడ్ లీడర్‌బోర్డ్‌లో పాయింట్లు గెలిచి నామినేషన్ల డేంజర్‌ నుంచి తప్పించుకోవడానికి కంటెస్టెంట్లు ఆడే టాస్కులు హౌస్‌లో హీట్‌ని పెంచేశాయి. ప్రస్తుతం అపూర్వ..చరణ్, అమన్..త్రిగుణ్, ముకేశ్..ఝాన్సీ, నరేష్..రామ్ ప్రసాద్, రోహిత్..షాలినీ పెయిర్స్‌గా విడిపోయి నామినేషన్ల నుంచి బయటపడటానికి ట్రై చేస్తున్నారు.

దీనిలో భాగంగానే బిగ్ బాస్ కంటెస్టెంట్లకు బాల్స్‌ గేమ్ ఇచ్చాడు. జంటలలో ఒకరు ఐదు బాల్స్ తీసుకెళ్లి అక్కడున్న కొన్ని హోల్స్‌లో వేయాల్సి ఉంటుంది. స్పీడ్‌గా పూర్తి చేసినవారు వెనుక వారి బాల్స్‌ను తొలగించే ఛాన్స్ ఉండటంతో టాస్క్ మరింత క్యూరియాసిటీగా మారింది.

వంశీ, దేబ్జానీ సంచాలకులుగా ..అమన్, షాలినీ, అపూర్వ, రామ్ ప్రసాద్, ముకేశ్ గేమ్‌లోకి దిగారు. పక్కా ప్లానింగ్‌తో ఆడిన అమన్ ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా.. రామ్ ప్రసాద్, ముకేశ్, షాలినీ, అపూర్వ ఆ తర్వాతి ప్లేసుల్లో నిలిచారు. ఈ టాస్క్‌తో అమన్,త్రిగుణ్ జోడీకి ఎక్కువ పాయింట్లు రావడంతో వారు నామినేషన్స్ నుంచి సేఫ్(Bigg Boss Safe Zone) అయిపోయారు. టాస్క్ ముగిశాక అపూర్వతో రోహిత్ మాట్లాడటం చూసిన షాలినీ రచ్చ మొదలుపెట్టింది. అయితే రోజురోజుకు అగ్నిపరీక్ష టీమ్‌లో గొడవలు పెరుగుతున్నాయని చెబుతూ అందరినీ కూల్ చేయడానికి రోహిత్ గట్టిగానే ప్రయత్నించాడు.

అయితే హౌస్‌లో టెన్షన్ పెరిగిన ప్రతిసారీ బిగ్ బాస్ సాంగ్స్ వేసి అట్మాస్పియర్‌ను కూల్ చేయడం కామన్.దీనిలో భాగంగానే సాంగ్స్ రాగానే కంటెస్టెంట్లంతా స్విమ్మింగ్ పూల్‌లోకి దిగి హీట్‌ పుట్టించే స్టెప్పులేశారు. ఈ సమయంలో వర్షిణి,ముకేశ్ పూల్‌లో చేసిన రొమాన్స్ అందరినీ ఆకట్టుకుంది. మరోవైపు షాలినీ , రోహిత్‌ టైమ్ దొరికినప్పుడల్లా హగ్గులతో సందడి చేశారు.

ఆ తర్వాత నామినేషన్ల నుంచి ఎస్కేప్ అవడానికి మిగిలిన వారికి బిగ్ బాస్ ..చిత్రం భళారే విచిత్రం అనే సెకండ్ టాస్క్ ఇచ్చాడు. వర్షిణి, త్రిగుణ్, అమన్ సంచాలకులుగా ఉండగా.. సంచాలక్ చెప్పిన బొమ్మను ఒకరు గీయాలి, మరొకరు స్టోర్ రూమ్ నుంచి ఆ వస్తువును వెతికి తీసుకురావాలి.

Bigg Boss Safe Zone

ఈ టాస్క్‌లో అపూర్వ, షాలినీ, ఝాన్సీ, నరేష్ డ్రాయింగ్ గీయగా.. రామ్ ప్రసాద్, రోహిత్, ముకేశ్, చరణ్ వస్తువులను తీసుకురావడానికి రెడీ అయ్యారు. అద్భుతమైన కో ఆర్డినేషన్‌తో ఆడిన నరేష్ , రామ్ ప్రసాద్ టాప్ ప్లేస్‌ను దక్కించుకోగా, అపూర్వ,చరణ్ సెకండ్ ప్లేస్‌లో, షాలినీ , రోహిత్ థర్డ్ ప్లేస్‌లో నిలిచారు. ముకేష్ ,ఝాన్సీ జంట లాస్ట్ ప్లేస్‌తో అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది.

ఓవరాల్ లీడర్‌బోర్డ్ పాయింట్ల టేబుల్‌లో నరేష్ ,రామ్ ప్రసాద్ టాప్‌లో దూసుకుపోతున్నారు. అమన్,త్రిగుణ్ తర్వాత ఈ రౌండ్‌లో నామినేషన్ల డేంజర్ నుంచి తప్పించుకునే(Bigg Boss Safe Zone) లక్కీ పెయిర్ ఎవరనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుస్తుంది.

Instant VS Filter Coffee : మీరు తాగే కాఫీ మీ ఏజ్‌ను పెంచుతుందా? ఇన్‌స్టంట్ వెర్సస్ ఫిల్టర్ కాఫీల గురించి నిజాలేంటి?

↑
Exit mobile version