Bigg Boss Weekend Episode : బిగ్‌బాస్ హౌస్‌లో ఊహించని షాక్‌లు.. కంటెస్టెంట్ల బండారం బయటపెట్టిన కింగ్ నాగ్..

Bigg Boss Weekend Episode : టోటల్‌గా అగ్ని పరీక్ష బ్యాచ్ చేస్తున్న గ్రూపిజం, సింపతీ గేమ్‌లకు చెక్ పెడుతూ హోస్ట్ నాగార్జున ఇచ్చిన క్లాస్ హౌస్‌లో అందరికీ గట్టి షాకే ఇచ్చింది.

Bigg Boss Weekend Episode

బిగ్‌బాస్ హౌస్‌లో వీకెండ్ ఎపిసోడ్(Bigg Boss Weekend Episode) వస్తోందంటే చాలు, కంటెస్టెంట్లకు వెన్నులో వణుకు స్టార్టవుతుంది. వీక్ అంతా ఏం చేసినా, కెమెరాలకు కనిపించేలా ఎంత బిల్డప్ ఇచ్చినా.. వీకెండ్ రగడలో కింగ్ నాగార్జున ఎంట్రీ ఇస్తే ఆ అసలు కలర్స్ అన్నీ బయటపడాల్సిందే. ముందు రోజు ఎపిసోడ్ చూశాక అయితే వీళ్ల ఓవరాక్షన్‌కు ఎండ్ కార్డ్ ఎక్కడ పడుతుందా అని ఆడియన్స్ తెగ డిస్కషన్ పెట్టారు.

నిజానికి శనివారం ఎపిసోడ్(Bigg Boss Weekend Episode) ఎంట్రీనే నెక్స్ట్ లెవెల్ హీట్‌తో స్టార్ట్ అయింది. డైరెక్టుగా షాలినిని కన్ఫెషన్ రూమ్‌కి రమ్మన్న నాగ్.. అక్కడ నడుస్తున్న కుట్రలను ఒక్కొక్కటిగా బయటపెట్టారు. నామినేషన్స్ టైమ్‌లో సరైన రీజన్స్ ఏమీ లేకుండానే ముందే ప్లాన్ చేసుకొని..సెలబ్రిటీలను ఎలా టార్గెట్ చేశారో గ్రూపు రాజకీయలను క్లియర్ వీడియోలతో సహా చూపించారు. కన్ఫెషన్ రూమ్‌లో మాట్లాడిన విషయాలను సీక్రెట్‌గా ఉంచాలనే రూల్‌ను గుర్తుచేస్తూ, తప్పును కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తే కుదరదని షాలినికి నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఇక ఆ తర్వాత చిన్నదానికి పెద్దదానికి ఊగిపోతూ అరుస్తున్న అపూర్వ పద్ధతిపై నాగార్జున గట్టిగానే క్లాస్ పీకారు. గేమ్స్ సరిగ్గా ఆడకపోవడమే కాకుండా, సంచాలక్‌లతో గొడవ పడటం.. రామ్ ప్రసాద్ మామూలుగా ఎఫ్‌ఐఆర్ అనే పదాన్ని అనడం..దానికి అఫైర్ అంటూ క్రియేట్ చేసిన ఓవరాక్షన్‌ను వీడియోతో సహా చూపించారు. అందరికీ సారీ చెప్పాల్సిందేనని నాగ్ అనడంతో అపూర్వ క్షమాపణ చెప్పింది.

ఆ వెంటనే సరదాగా త్రిగుణ్, చరణ్, రామ్ ప్రసాద్, నరేష్‌తో అపూర్వను పొగడమంటూ ఇచ్చిన టాస్క్ మాత్రం బాగానే నవ్వులు పంచింది. ఇక లాస్ట్ వీక్ డిజాస్టర్ కెప్టెన్‌గా నిలిచిన అపూర్వకు 30 మార్కులే వేస్తే, వర్షిణికి మాత్రం 65 మార్కులు ఇచ్చినా కూడా.. ఆమె చేసిన తప్పులను ఎత్తిచూపించారు. వర్షిణి కెప్టెన్సీలో రోహిత్, షాలిని బాత్రూమ్‌లు కడగకపోయినా చూసిచూడనట్లు వదిలేయడంపై సీరియస్ అయ్యారు.

మరోవైపు డ్రాయింగ్ గేమ్‌లో ముఖేశ్‌కు సీక్రెట్‌గా హింట్స్ ఇచ్చిన ఝాన్సీని పాయింట్ అవుట్ చేయడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. అమన్ గేమ్‌ను మెచ్చుకుంటూనే, ముఖేశ్‌ను బూతులు తిట్టిన వ్యవహారాన్ని మాత్రం నాగ్ తప్పుబట్టారు. చరణ్ ఇంకా ఆటలోకి రాకుండా కేవలం ఫ్లర్టింగ్‌కే పరిమితం కావడంపై సెటైర్‌లు వేశారు.

ఇక ఈ శనివారం ఎపిసోడ్‌(Bigg Boss Weekend Episode)లో ..ఎవరికి హౌస్‌లో ఉండే అర్హత లేదు అనే ఇంటూ మార్క్ టాస్క్ ఇవ్వాల్సిన గేమ్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. హౌస్ మేట్స్ అందరూ ఒకరిపై ఒకరు తమ కోపాన్ని ప్రదర్శిస్తూ స్టాంపులు వేసుకోగా..రోహిత్‌కు ఏకంగా ఐదు ఓట్లు రావడంతో అసలు విషయం బయటపడింది.

త్రిగుణ్ చేసిన మంచి పనులను పట్టించుకోకుండా రోహిత్ వేస్తున్న తప్పుడు లెక్కలను నాగ్ రివీల్ చేశారు. షాలినితో ముచ్చట్లు పెట్టడం మానేసి ఆటపై ఫోకస్ పెట్టాలని, లేదంటే ఆడియన్స్ రోహిత్ గేమ్‌ను ఎలా తిరస్కరిస్తున్నారో కళ్లకు కట్టినట్లు చూపించారు. అయినా కూడా ఏం మారకుండా మళ్లీ షాలిని దగ్గరికి వెళ్లి సింపతీ కోసం రోహిత్ ప్రయత్నించడం చూసి ఆడియన్స్ మరింత చిరాకు పడ్డారు..

Bigg Boss Weekend Episode

చివర్లో త్రిగుణ్, అపూర్వ మధ్య జరిగిన గొడవలో అపూర్వ తన ఫ్యామిలీని టార్గెట్ చేసిందని త్రిగుణ్ అనడంతో.. నాగ్ ఆ విషయంలో అపూర్వది తప్పు అని తేల్చి చెప్పేశారు. దీంతో తట్టుకోలేక అపూర్వ మళ్లీ ఏడుపు అస్త్రాన్ని వదలడంతో పాటు నాగ్ మీదే రివర్స్‌లో ఫైర్ అవ్వడం చూసి అందరూ షాక్ అయ్యారు.

టోటల్‌గా అగ్ని పరీక్ష బ్యాచ్ చేస్తున్న గ్రూపిజం, సింపతీ గేమ్‌లకు చెక్ పెడుతూ హోస్ట్ నాగార్జున ఇచ్చిన క్లాస్ హౌస్‌లో అందరికీ గట్టి షాకే ఇచ్చింది. మరి ఈ వీకెండ్ ఎండింగ్‌లో భాగంగా సండే ఎపిసోడ్‌లో ఇద్దరు కంటెస్టెంట్లు బయటికి వెళ్లనున్నారన్న టాక్ రావడంతో ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పీక్స్‌కు వెళ్లింది.

Devi Navaratrulu : మొదలయిన దసరా వేడుకలు..ఒక్కో చోట ఒక్కోలా దసరా నవరాత్రులు..

↑
Exit mobile version