Captain’s Contender
బిగ్ బాస్ హౌస్‌లో తాజాగా నడుస్తున్న బడ్డీ అప్ సందడి ఊపందుకుంది. మాజీ కంటెస్టెంట్లు ఒక్కొక్కరుగా హౌస్‌లోకి ఎంటర్ అయి కరెంట్ కంటెస్టెంట్లతో కలిసి టాస్కులలో చెమటోడ్చుతున్నారు. ఇమ్ము, సంజన, కళ్యాణ్ పడాల, దివ్య తర్వాత లేటెస్ట్ ఎపిసోడ్లో డెమాన్ పవన్, టేస్టీ తేజ,రీతూ, శోభా శెట్టి ఎంట్రీ ఇచ్చి హౌస్‌లో హీట్‌ను పీక్స్‌కి తీసుకెళ్లారు. గతంలో ఆర్కే, శివ్ కంటెండర్లుగా(Captain’s Contender) నిలవగా.. తాజా టాస్కులతో అమన్, దేబ్జానీ కూడా ఫైనల్ కెప్టెన్సీ రేసులో చేరిపోయారు.
ముందుగా హౌస్‌లోకి అడుగుపెట్టిన పవన్, రీతూ మధ్య మునుపటిలా కాకుండా ఏదో తెలీని సైలెన్స్ కనిపించినట్లు ఆడియన్స్ గుర్తుపట్టారు. పెద్దగా మాటలు లేకపోయినా, డ్యాన్స్ టాస్క్‌తో గేమ్ మొదలైనా కానీ.. ఆ డ్యాన్స్ గేమ్ అంతగా కిక్ ఇవ్వలేదు . అయితే దీనిలో రీతూతో ముకేష్, పవన్‌తో దేబ్జానీ జతకట్టి ఆడిన టాస్క్ మాత్రం హౌస్‌ను మొత్తం ఓ జోష్‌లోకి తీసుకుని వెళ్లింది.
ఈ గేమ్‌లో సంచాలక్‌గా వ్యవహరించిన త్రిగుణ్ కండీషన్ల విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా నిలబడ్డాడు. స్విమ్మింగ్ పూల్‌లో బాల్స్ పడేయడమే కాకుండా.. బాస్కెట్ కిందకు లాగి తీయడం వంటివి రాంగ్ అంటూ ముకేష్‌ను అడ్డుకున్నాడు. గేమ్‌లో మాత్రం ఎవరూ తగ్గేదేలే అన్నట్టు తలపడ్డారు.
ముకేష్, డీమాన్ పవన్ కిందామీద పడుతూ పోరాడగా.. ఆ జోరులో పవన్ టీ షర్ట్ కూడా చినిగిపోయింది. మరోవైపు రీతూ, దేబ్జానీ కూడా ఉడుం పట్టుతో గట్టిగా ఆడారు. చివరకు ఈ టాస్కులో దేబ్జానీ, పవన్ విజయం సాధించడంతో దేబ్జానీ కంటెండర్(Captain’s Contender) రేసులోకి దూసుకెళ్లింది.
ఆ తర్వాత శోభా శెట్టి, టేస్టీ తేజ హౌస్‌లోకి వచ్చి ఓ ఇంట్రస్టింగ్ గేమ్ ఆడించారు. హౌస్ మేట్స్ ఎవరితో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తారు, ఎవరితో కట్ చేస్తారనే ఈ టాస్క్‌లో త్రిగుణ్.. వంశీతో కంటిన్యూ చేస్తానని, వర్షిణితో ఫ్రెండిషిప్ కట్ చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత ముకేష్.. వర్షిణితో కంటిన్యూ అవుతానని, సుధీర్‌తో ఫ్రెండిషిప్ కట్ చేస్తానని స్పష్టం చేశాడు.
తర్వాత జరిగిన టాస్క్‌లో నరేష్, తేజ ఒక టీమ్‌గా ఉండగా.. అమన్, శోభా మరో టీమ్‌గా గేమ్‌లోకి దిగారు. సంచాలక్‌గా ఉన్న వర్షిణి నరేష్‌కు పదే పదే బాల్ ఇస్తుందని.. ఇది అన్ ఫెయిర్ అంటూ శోభా, అమన్ వాదనకు దిగారు. అయినా గేమ్‌ను ఆపి, చివరకు అమన్, శోభా టీమ్ విజయం సాధించడంతో.. అమన్ కెప్టెన్సీ కంటెండర్‌గా(Captain’s Contender) నిలిచాడు.
మరోవైపు చివరి వరకూ వచ్చి కూడా ఓడిపోవడంపై నరేష్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ప్రతిసారీ తన గేమ్‌లో ఇలానే అవుతోందని, తన చేతులతోనే తానే గేమ్ అంతా పాడు చేసుకుంటున్నానంటూ డిజప్పాయింట్ అవుతాడు. రామ్ ప్రసాద్ అతనికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేయగా.. సంచాలక్ తీరుపై అమన్ అసహనాన్ని వ్యక్తం చేస్తూ బుధవారం ఎపిసోడ్‌ను మరింత హీటెక్కించాడు.
Sleep Mask : రోజూ స్లీప్ మాస్క్ వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే స్కిన్ దెబ్బతింటుందట..
