Nominations
బిగ్ బాస్ షోలో పదకొండో వారం నామినేషన్స్ ప్రాసెస్ ఊహించని మలుపులతో, హై వోల్టేజ్ డ్రామాలతో సాగిపోయింది. ఈసారి హౌస్‌లోకి డిక్టేటర్స్ థీమ్‌ను తీసుకురావడంతో పాటు గత సీజన్లతో పాటు ఈ సీజన్‌లో ఎలిమినేట్ అయి వెళ్లిన మాజీ కంటెస్టెంట్లను కొంతమందిని స్పెషల్ గెస్ట్‌లుగా పంపారు బిగ్ బాస్. వాళ్లే నామినేషన్(Nominations) ప్రాసెస్‌ను రన్ చేయడంతో హౌస్‌లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వారి వీక్ పాయింట్స్‌ను డైరెక్ట్‌గా ఎత్తి చూపిస్తూ మాజీలు వేసిన ప్రశ్నలకు కంటెస్టెంట్లు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
మంగళవారం ఎపిసోడ్‌లో ఈ సీజన్ కంటెస్టెంట్లు సృష్టి, చరణ్, చైత్ర, శ్వేత మాజీలుగా హౌస్‌లోకి దూసుకొచ్చారు. రాగానే ఎవరినీ సేవ్ చేయకుండా డైరెక్టుగా పాయింట్‌కి వెళ్లిపోయారు. ముందుగా ఎంట్రీ ఇచ్చిన సృష్టి.. వర్షిణి ఇప్పటివరకు ఒక్క ఫిజికల్ టాస్కు కూడా సరిగ్గా ఆడలేదని, ఎప్పుడూ భయపడుతూనే ఉంటుందని పాయింట్ అవుట్ చేసింది.
ఇక చైత్ర ఎంట్రీ ఇచ్చి మాటల్లో చూపించే జోష్‌ను వంశీ ఆటలో కనిపించనీయడం లేదని ఫైర్ అయింది. ఇదే చరణ్ వచ్చి సుధీర్‌ని నామినేట్ చేసి అతని స్ట్రాటజీలపై నిలదీశాడు. శ్వేత కూడా రంగంలోకి దిగి రాంప్రసాద్‌ను నామినేట్ చేసింది.
ఈ నామినేషన్ల(Nominations) పరంపరలో భాగంగా మాజీలు హౌస్‌లో ఉన్నవారికి డ్యాగర్ ఇస్తే వారు మరో కంటెస్టెంట్‌ను నామినేట్ చేయాలనే రూల్ పెట్టారు. దీంతో హౌస్‌లో ఉన్న మిగతా సభ్యులు కూడా ఒకరిని ఒకరు నామినేట్లు వేసుకున్నారు. వర్షిణి, అమన్ మధ్య జరిగిన డిస్కషన్స్, త్రిగుణ్ , రాంప్రసాద్ మధ్య నడిచిన వార్ ఇంట్లో వేడిని మరింత పెంచింది. ముఖ్యంగా అంతకుముందు రోజు జరిగిన విషయాలపై ఝాన్సీ మాట్లాడిన మాటలకు సుధీర్ ఎమోషనల్ అవడంతో హౌస్‌లో అందరినీ ఆలోచనలో పడేసింది.
అయితే ఈ వారం కెప్టెన్‌గా ఉన్న నరేష్‌కి బిగ్ బాస్ ఒక పవర్‌తో పాటు మరో బాధ్యతను కూడా అప్పగించారు. హౌస్‌మేట్స్‌లో ఇద్దరిని డైరెక్టుగా నామినేట్ చేయాలని ఆదేశించడంతో..నరేష్ ఆలోచించకుండా శివ్, ఆర్కే పేర్లను చెప్పాడు. ముఖ్యంగా ఆర్కే తనకిచ్చిన పనులను సరిగ్గా చేయకుండా తప్పించుకుంటున్నారంటూ నరేష్ రీజన్ చెప్పాడు.
ఈ పాయింట్ మీద హౌస్‌లో పెద్ద గొడవే జరగగా.. మధ్యలో త్రిగుణ్ కలుగజేసుకోవడంతో ఆర్కే ఫుల్ ఫైర్ అయ్యాడు. దీంతో మాటలు తూలితే బాగోదని, ఈ వారం నిన్నే బయటకు పంపిస్తామంటూ మిగతా కంటెస్టెంట్లు కూడా ఆర్కేపైకి దూసుకెళ్లడంతో హౌస్ అట్మాస్పియర్ ఒక్కసారిగా టెన్షన్‌గా మారింది.
చివరకు ఈ 11 వారం ఎలిమినేషన్ లెక్కలను ఒకసారి చూస్తే కనుక.. ప్రస్తుతం కెప్టెన్ నరేష్ ఒక్కడే సేఫ్ జోన్‌లో నిలిచాడు. అతన్ని మినహాయిస్తే మిగిలిన హౌస్‌మేట్స్ అంతా కూడా ఈ వీక్ నామినేషన్స్ బరిలో నిలిచారు. మరి ఈసారి ఆడియన్స్ ఓటింగ్ ద్వారా హౌస్‌ని ఎవరు వీడుతారు? ఎవరి ఆట ముగుస్తుంది? అనేది రాబోయే వీకెండ్ ఎపిసోడ్లలో తెలుస్తుంది.
PAN Card Name Change : పాన్ కార్డులో పేరు తప్పుగా ఉందా? ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో ఇలా మార్చుకోండి
