Just NationalLatest News

PAN Card Name Change : పాన్ కార్డులో పేరు తప్పుగా ఉందా? ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో ఇలా మార్చుకోండి

PAN Card Name Change : పాన్ కార్డులో మీ పేరు కానీ ఇంటిపేరు కానీ తప్పుగా పడితే టెన్షన్ పడాల్సిన పనిలేదు. NSDL పోర్టల్ ద్వారా ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో ఈజీగా సరిచేసుకోవచ్చు.

PAN Card Name Change

బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా, ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలన్నా చివరకు ఏ చిన్న ఆర్థిక లావాదేవీలకైనా పాన్ కార్డు చాలా అవసరం. అయితే చాలామందికి తమ పాన్ కార్డులలో నేమ్స్ తప్పుగా పడటం(PAN Card Name Change), పెళ్లి తర్వాత ఇంటిపేరు మారడం , ఆధార్ కార్డుతో పేరు మ్యాచ్ కాకపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి. దీని కోసం ఎక్కడికీ తిరగకుండా మీ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారానే ఇంట్లోనే కూర్చుని పేరును ఎలా చేంజ్ చేసుకోవాలో ఇప్పుడు సింపుల్‌గా చూద్దాం.

అయితే ఆన్‌లైన్‌లో మార్చడాని కంటే ముందు మీ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉందో లేదో చూసుకోవాలి. నంబర్ లింక్ అయి ఉంటే ఎలాంటి పేపర్లు కూడా వేరే వేరే ఆఫీసులకు పోస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా నిమిషాల్లోనే పని పూర్తవుతుంది.

ముందుగా ఎన్‌ఎస్‌డీఎల్ (NSDL / Protean) లేదా యుటీఐఐటీఎస్ఎల్ (UTIITSL) అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ అప్లికేషన్ టైప్‌ (Application Type) లో చేంజ్ ఆర్ కరెక్షన్ ఇన్ ఎగ్జిస్టింగ్ పాన్ డేటా (Changes or Correction in existing PAN Data) ను, కేటగిరీలో ఇండివిడ్యువల్ (Individual) ను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ సరైన పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ నమోదు చేసి సబ్మిట్ చేయాలి. వెంటనే మీ స్క్రీన్ మీద 26 అంకెల టోకెన్ నెంబర్ వస్తుంది.

తరువాతి స్టెప్‌లో సబ్మిట్ డిజిటల్లీ త్రూ ఈకేవేసీ అండ్ ఈ సైన్ (Submit digitally through e-KYC & e-Sign) ఆప్షన్ ఎంచుకుంటే మీ ఆధార్‌లోని వివరాలు డైరెక్టుగా వచ్చేస్తాయి. ఒకవేళ కొత్త ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలనుకుంటే మాత్రం సబ్మిట్ స్కాన్‌డ్‌ ఇమేజెస్ త్రూ ఈ సైన్ (Submit scanned images through e-Sign) సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పాన్ కార్డుపై రావాల్సిన సరికొత్త పేరును ఎంటర్ చేసి, ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు లేదంటే మ్యారేజ్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేయాలి.

చివరగా ప్రాసెస్ పూర్తి చేయడానికి ఆన్‌లైన్‌లోనే UPI లేదా క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా దాదాపు రూ. 106 నుంచి రూ. 110 వరకు ఛార్జ్ పే చేయాలి. పేమెంట్ అయ్యాక మీ ఆధార్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి ఈ-సైన్ పూర్తి చేస్తే పని పూర్తయినట్లే.

అప్లై చేసిన 15 నుంచి 20 రోజుల్లో కొత్త పాన్ కార్డు డైరెక్టుగా మీ ఇంటికి వస్తుంది. అలాగే డిజిటల్ కాపీ (e-PAN) మీ ఈమెయిల్‌కి చేరుతుంది. పాన్ కార్డులోని పేరు ఆధార్ కార్డుతో కరెక్ట్‌గా మ్యాచ్ అయితే ఫ్యూచర్‌లో ఎలాంటి ఇబ్బందులు రావు.

Akvan Cyclone : ఏపీకి అక్వాన్ తుపాన్ ముప్పు..నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం

Related Articles

Back to top button