Wild Card Entry
సండే వచ్చిందంటే చాలు బిగ్ బాస్ లవర్స్‌కు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ పండుగ వచ్చేస్తుంది. ఎందుకంటే శనివారం, ఆదివారం ఎపిసోడ్‌లో నాగార్జున వేసే పంచ్‌లు, ఇచ్చే క్లాసులతో హౌస్ ఎంత హీటెక్కుతుందో అంతే ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటాయి.
ఇక ఈ సండే ఎపిసోడ్‌లో ఒకే రోజు ఇద్దరు కంటెస్టెంట్లను బయటకు గెంటేస్తూ షాకిచ్చిన నాగార్జున.. అది సరిపోదన్నట్లు ఏకంగా ఐదుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను(Wild Card Entry) హౌస్‌లోకి పంపి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ మాస్టర్ ప్లాన్‌తో హౌస్‌లో ఈక్వేషన్స్ పూర్తిగా తలకిందులు అయిపోయాయి.
ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే నాగార్జున ఎంట్రీ ఇచ్చి నరేష్, ముకేశ్, రోహిత్, అపూర్వ, చరణ్, షాలిని నామినేషన్స్ హీట్‌ను టచ్ చేశారు. ఆడియన్స్ ఓట్ల ప్రకారం లీస్ట్‌లో ఉన్న వాళ్లను తేల్చే క్రేజీ టాస్క్ పెట్టడంతో అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఫైనల్‌గా ఓట్ల లెక్కల్లో వెనుకబడిన అపూర్వ ఎలిమినేట్ అయిపోయింది.
ఇన్నాళ్లు హౌస్‌లో అంత నోరు పెట్టి అందరి మీద అరిచి గోల చేసిన అపూర్వ, బయటికి వెళ్లేటప్పుడు మాత్రం కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు. అంతేకాదు, స్టేజి మీదకు రాగానే మిగిలిన హౌస్ మేట్స్ గురించి ఒక్కో చేదు నిజం చెప్పాలంటూ నాగార్జున ఇచ్చిన టాస్క్‌లో.. అపూర్వ అందరి బండారాలు బయటపెట్టింది. రోహిత్ ఓవర్ కాన్ఫిడెన్స్ అలాగే రామ్ ప్రసాద్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోవడం, షాలిని గురించి అయితే తను పూర్తిగా రోహిత్ చేతిలో కీలుబొమ్మగా మారిపోయిందని చెప్పి బయటకు వెళ్లిపోయింది.
ఇక అసలైన మసాలా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇక్కడే స్టార్ట్ అయ్యాయి. మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా సీరియల్ హీరో శివ కుమార్ స్టేజిపైకి అదిరిపోయే డ్యాన్స్‌తో ఎంట్రీ ఇచ్చాడు. తన కాబోయే వైఫ్ ప్రియాంక జైన్ గురించి చెప్పిన శివ, హౌస్‌లోకి వెళ్లకముందే అందరినీ టార్గెట్ చేసేసాడు. మెయిన్‌గా షాలినిని..తను కప్ కోసం కాదని, రోహిత్ కోసం వచ్చిందని తొలి పటాకా పేల్చాడు.
శివతో పాటు మిగిలిన నలుగురు వైల్డ్ కార్డ్స్ అయిన నటి దక్షి గత్తికొండ, నీతూ నటరాజ్ మాస్టర్, డ్యాన్సర్ శ్వేతా నాయుడు, అలాగే అగ్నిపరీక్ష ఫేమ్ రామకృష్ణ తమ తమ ఎంట్రీలతో రచ్చ రంబోలా చేశారు. వీళ్లందరూ హౌస్‌లోకి రాగానే అందరి టార్గెట్ షాలినీ ఒక్కర్తే అయిపోయింది. షాలిని ఆడుతున్న తీరును, కేకలు వేయడాన్ని ప్రతి ఒక్కరూ స్టేజిపైనే ఎత్తిచూపారు.
వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ(Wild Card Entry) ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ ఒక క్రేజీ ఛాలెంజ్ ఇచ్చారు. చేతిలో రెండు సేఫ్టీ బ్యాడ్జ్‌లు, 2 లక్షల క్యాష్ సూట్‌కేస్ ఇచ్చి.. మ్యాజిక్ పవర్ ఉన్న వాళ్లతో టాస్క్ ఆడమన్నారు. అయితే ఈ టాస్క్‌ల్లో శివ, దక్షి, శ్వేతా, రామకృష్ణ తాము ఆడిన మ్యాచ్‌లలో ఓడిపోవడంతో.. ఆ ప్రైజ్ మనీ అమౌంట్ విన్నర్ ప్రైజ్ మనీకి యాడ్ అయింది.
అయితే నీతూ నటరాజ్ మాస్టర్ మాత్రం త్రిగుణ్‌తో ఆడి గెలిచి మ్యాజిక్ పవర్‌ను కైవసం చేసుకుంది. ఇక ఓడిపోయిన ఈ వైల్డ్ కార్డ్(Wild Card Entry) కంటెస్టెంట్స్ అందరికీ వాష్‌రూమ్స్ క్లీనింగ్, గిన్నెలు తోముకోవడం, కిచెన్ డ్యూటీ వంటి పనులను పనిష్మెంట్‌గా అప్పజెప్పారు.
ఇక ఈ సండే వీకెండ్ ఎపిసోడ్ ఎండింగ్‌లో బిగ్ బాస్ ఇచ్చిన మరో ట్విస్ట్ ఏంటంటే.. ఎలిమినేషన్‌లో సేఫ్ కాని నరేష్, ముకేశ్, రోహిత్ వైల్డ్ కార్డ్స్ ఇచ్చిన బ్యాడ్జ్‌లతో సేవ్ అయిపోయారు. ఇక మిగిలిన చరణ్, షాలినిని ఒక గదిలో ఉంచి హౌస్ మేట్స్‌తో బ్యాలెట్ బాక్స్ ఓటింగ్ వేయించారు. అమన్ ఒక్కడే చరణ్‌కు ఓటు వేయగా.. మిగిలినవారంతా షాలిని ఉండాలని కోరుకున్నారు. దీంతో చరణ్ ఎలిమినేట్ అయి స్టేజిపైకి వచ్చాడు. నాగ్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ త్రిగుణ్, ఝాన్సీ, సుధీర్ మనిషి ముందు ఒకలా, వెనక ఒక మాట మాట్లాడతారని ఓపెన్‌గా చెప్పేశాడు.
మొత్తానికి ఈ సండే ఎపిసోడ్‌లో డబుల్ ఎలిమినేషన్‌తో ఇద్దరిని బయటకు పంపి ఏకంగా ఒకేసారి ఐదుగురు వైల్డ్ కార్డ్స్‌ను దింపి బిగ్ బాస్ గేమ్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు. వచ్చే ఎపిసోడ్ నుంచి ఈ కొత్త వాళ్లతో హౌస్‌లో ఎలాంటి మంటలు అంటుకుంటాయో, పాత కంటెస్టెంట్లు వీళ్లని ఎలా ఫేస్ చేస్తారో చూడాలి .
Fish Pulusu Prasadam : దుర్గమ్మకి చేపల పులుసు నైవేద్యం..200 ఏళ్ల నాటి నుంచీ కొనసాగుతున్న వింత ఆచారం
