Dhurandhar
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ హీరోగా ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో.. వచ్చిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ధురంధర్. గతేడాది డిసెంబర్ నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను కురిపించి.. ఏకంగా 1300 కోట్ల రూపాయల వసూళ్లతో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
ఈ గ్రాండ్ సక్సెస్ ఇచ్చిన జోష్‌తో దీనికి కంటిన్యూగా ధురంధర్ ది రివేంజ్ పేరుతో సీక్వెల్‌ను కూడా ఆడియన్స్ ముందుకు తెచ్చారు. ఈ ఏడాది మార్చి 19న రిలీజైన ఈ రెండో భాగం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ .. ఏకంగా 1900 కోట్లకు పైగా కలెక్షన్ల వర్షం సాధించింది. దీంతో అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ ఇండియన్ మూవీ లిస్టులో ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించింది.
కాగా ఇప్పుడు ఓటీటీ ప్రియుల కోసం ఈ మూవీ యూనిట్ ఊహించని ఒక అదిరిపోయే సర్ప్రైజ్ అనౌన్స్ చేసింది. ధురంధర్ మొదటి భాగానికి సంబంధించిన అన్‌కట్ వెర్షన్‌ను అంటే థియేటర్లలో కట్ చేసిన సీన్లతో కలిపి.. డిజిటల్ వేదికలపైకి తీసుకువస్తున్నారు. ఒకే రోజు రెండు ప్రముఖ ఓటీటీ సంస్థలలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.
నెట్‌ఫ్లిక్స్‌తో పాటు జియో హాట్‌స్టార్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మే 22 నుంచి ఈ అన్‌కట్ వెర్షన్ అందుబాటులోకి వస్తున్నట్లు ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లు అధికారికంగా ప్రకటించాయి. సుమారు 3 గంటల 52 నిమిషాల డ్యురేషన్‌తో ఈ ఫస్ట్ భాగం అలరించబోతోంది. అంటే ఈరోజు అర్ధరాత్రి నుంచే ఈ క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలోకి అడుగుపెట్టేస్తుందన్న మాట.
ఇక మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ధురంధర్ సీక్వెల్ ఇండియా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్‌ను కూడా ఫిక్స్ చేశారు. జూన్ 4వ తేదీ రాత్రి 7 గంటల నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా ఈ మూవీ ఇండియాలో స్ట్రీమింగ్ కాబోతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ మూవీ అందుబాటులోకి రాబోతోంది.
అయితే విదేశాల్లో ఉన్న ఆడియన్స్ కోసం మాత్రం ఇప్పటికే ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ ద్వారా అందుబాటులో ఉంది. థియేటర్లలో రిలీజ్ అయిన వెర్షన్ కంటే కూడా ఓటీటీ వెర్షన్‌లో ఆడియన్స్‌కు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ పంచేలా కొన్ని సరికొత్త సన్నివేశాలను యాడ్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మొత్తంగా థియేటర్లలో ఈ మూవీ రన్ టైమ్ 3 గంటల 49 నిమిషాలు ఉండగా, ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోయే వెర్షన్ 3 గంటల 52 నిమిషాల డ్యురేషన్‌తో రాబోతోంది.
అలాగే సారా అర్జున్ హీరోయిన్‌గా నటించిన ఈ భారీ యాక్షన్ మూవీలో.. ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ లాంటి దిగ్గజ యాక్టర్స్ కీలక పాత్రలను పోషించారు.
Eggs :గుడ్లు తినేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? రోజుకు ఎన్ని ఎగ్స్ తినాలి?
