HealthJust LifestyleLatest News

Eggs :గుడ్లు తినేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? రోజుకు ఎన్ని ఎగ్స్ తినాలి?

Eggs : కొంతమంది గుడ్లు ఆరోగ్యానికి మంచివి కదా అని రోజుకు ఐదారు ఎగ్స్‌ను తినేస్తుంటారు. ఏది అయినా అతిగా తింటే నష్టమే జరుగుతుంది.

Eggs

పోషకాలతో నిండిన అద్భుతమైన నేచురల్ సూపర్ ఫుడ్ గుడ్డు అని డాక్టర్లు కూడా చెబుతూ ఉంటారు. ముఖ్యంగా బాడీ బిల్డింగ్ చేసేవారికి, ఫిట్‌నెస్ లవర్స్‌కు, చిన్నపిల్లలకు, వృద్ధులకు ఇది హై-క్వాలిటీ ప్రోటీన్‌ను అందించే.. ది బెస్ట్ అండ్ కాస్ట్ తక్కువ అయిన హెల్దీ ఫుడ్‌గా చెబుతారు. అందుకే బ్రేక్‌ఫాస్ట్ నుంచి వర్కవుట్ తర్వాత తీసుకునే డైట్ వరకు కూడా చాలా మంది తమ రోజువారీ ఆహారంలో గుడ్లను(Eggs) ఒక ముఖ్యమైన భాగంగా చేసుకుంటారు.

అయితే మనలో చాలా మందికి ఎగ్స్‌ను(Eggs )సరైన పద్ధతిలో ఎలా తినాలో, ఎన్ని తీసుకోవాలో అనే దానిపై అవగాహన ఉండదు. దీనివల్ల తెలీకుండానే కొన్ని తప్పులు చేస్తూ, బాడీకి అందాల్సిన సరైన పోషణను దూరం చేసుకుంటున్నారు. పోషకాహార నిపుణులు చెబుతున్నదాని ప్రకారం.. ఎగ్స్‌ను సరైన విధంగా తీసుకున్నప్పుడు మాత్రమే అవి శరీరానికి పూర్తి ప్రయోజనాలను అందిస్తాయి. లేదంటే ఆ తప్పుడు అలవాట్లు గుడ్డులోని పోషక విలువలను తగ్గించడమే కాదు.. జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు కూడా దారితీస్తాయట.

ఒక ఎగ్‌లో సుమారు 7 గ్రాముల బాగా నాణ్యత కలిగిన ప్రోటీన్ దొరుకుతుంది. దీంతో పాటు విటమిన్ ఎ, బి, బి12, డి, ఫోలేట్, సెలీనియంతో పాటు బాడీ మెకానిజానికి అవసరమయ్యే అనేక రకాల సూక్ష్మపోషకాలు దీనిలో సమృద్ధిగా ఉంటాయి. అయితే చాలామంది గుడ్లు తినేటప్పుడు రెండు పొరపాట్లు చేస్తుంటారు.

కొంతమంది వెయిట్ పెరుగుతామనే భయంతోనో, కొలెస్ట్రాల్ వస్తుందనే అపోహతోనో చాలా మంది గుడ్డులోని పచ్చసొనను (Egg Yolk) పూర్తిగా పక్కన పెట్టి తెల్లసొనను మాత్రమే తింటుంటారు. నిపుణుల ప్రకారం ఈ అలవాటు చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే గుడ్డులోని ముఖ్యమైన సూక్ష్మపోషకాలు, విటమిన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ ఆ పచ్చసొనలోనే దాగి ఉంటాయి. కాబట్టి బాడీకి సంపూర్ణ పోషణ అందాలంటే పచ్చసొనను కూడా తినాలి.

మరికొంతమంది గుడ్లు (Eggs) ఆరోగ్యానికి మంచివి కదా అని రోజుకు ఐదారు ఎగ్స్‌ను తినేస్తుంటారు. ఏది అయినా అతిగా తింటే నష్టమే జరుగుతుంది. అలా అవసరానికి మించి ఎగ్స్ తిన్నా కూడా మంచిది కాదు. దీని వల్ల శరీరంలో క్యాలరీలు, కొవ్వు శాతం పెరిగి వెయిట్ పెరగడం,గ్యాస్,ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.

గుడ్డులోని తెల్లసొనకు, పచ్చసొనకు కూడా పోషకాల ప్రాధాన్యత విడివిడిగా ఉంటుంది. గుడ్డు తెల్లసొనలో (Egg White) కేవలం ప్యూర్ ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. అలాగే దీనిలో ఫ్యాట్ అస్సలు ఉండదు. ఇది కండరాల నిర్మాణానికి, కణాల మరమ్మత్తుకు, వెయిట్ గెయిన్ అవకుండా చేయడానికి అద్భుతంగా తోడ్పడుతుంది.

ఇక పచ్చసొనలో హెల్తీ ఫ్యాట్స్, కీలకమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇది మైండ్ చురుగ్గా పనిచేయడానికి, శరీరంలో హార్మోన్లను బ్యాలెన్స్ చేయడానికి , కంటి చూపును మెరుగుపరచడానికి, శరీరానికి సంపూర్ణ శక్తిని ఇవ్వడానికి చాలా అవసరం. అందుకే ఈ రెండు భాగాలను కలిపి తిన్నప్పుడే పూర్తి స్థాయి పోషకాలు అందుతాయి.

ఒక రోజులో ఎన్ని గుడ్లు తినాలనే విషయంలో చాలా మందికి సందేహాలుంటాయి. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారు, అంటే ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు లేనివారు రోజుకు 1 నుంచి 2 గుడ్లను వైట్ అండ్ ఎల్లో సొనతో కలిపి తినొచ్చు.

Eggs
Eggs

ఒకవేళ వర్కవుట్స్ చేస్తూ ప్రోటీన్ ఎక్కువ కావాలనుకున్న వారు మాత్రం..రెండు పూర్తి ఎగ్స్‌తో పాటు అదనంగా తెల్లసొనల సంఖ్యను పెంచుకోవచ్చు. అయితే బరువు తగ్గాలనుకున్నవారు, గుండె జబ్బులున్నవారు , హై కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు మాత్రం పచ్చసొన విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉండాలి.

వీరు డాక్టర్లు లేదా న్యూట్రిషనిస్ట్ సలహాతో పచ్చసొనను వారానికి రెండు, మూడు సార్లు మాత్రమే తీసుకోవాలి. కానీ రోజువారీగా 1 లేదా 2 గుడ్ల తెల్లసొనను మాత్రం హ్యాపీగా తీసుకోవచ్చు. గుడ్లను ఉడకబెట్టి (Boiled Eggs) తినడం అనేది అన్నింటికంటే సురక్షితమైన, ఉత్తమమైన పద్ధతిగా డాక్టర్లు చెబుతారు. ఎందుకంటే ఇలా చేస్తే గుడ్డులోని పోషకాలేమీ నశించవు. దీంతో మన బాడీకి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి.

Vijay Cabinet:విజయ్ మంత్రివర్గంలోకి మరో 23 మంది ఎమ్మెల్యేలు.. రేసులో మిగిలిన పార్టీలకు తుది విడతలో ఛాన్స్ ఉంటుందా?

Related Articles

Back to top button