Klin Kara : క్లీంకార ఫోటో పోస్ట్ చేసిన ఉపాసన..వైరల్ గా మెగా ప్రిన్సెస్

Klin Kara : రామ్ చరణ్, ఉపాసన గారాల పట్టి క్లింకార కొణిదెల పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా తమ ముద్దుల కూతురు ఫేస్ రివీల్ చేశారు చెర్రీ దంపతులు

Klin Kara

మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కు రాంచరణ్, ఉపాసన సర్ ప్రైజ్ ఇచ్చారు. మెగా అభిమానులందరూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న చెర్రీ,ఉపాసన దంపతుల గారాలపట్టి క్లీంకార(Klin Kara) ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మెగా ఫ్యామిలీలో కొత్తతరం వారసురాలిగా జన్మించిన క్లీంకార(Klin Kara) ఫోటోలు అప్పుడప్పుడు కనిపించినా ఫేస్ మాత్రం కనిపించకుండా జాగ్రత్తపడేవారు.

తమ కుమార్తె ప్రైవసీకి భంగం కలగకుండా చెర్రి దంపతులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు అభిమానులు క్లీంకార ఫోటో చూపించాలంటూ అడిగినా సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆమె మూడో పుట్టినరోజు సందర్భంగా అందరికీ సర్ ప్రైజ్ ఇస్తూ ఫోటోను షేర్ చేశారు.

తల్లిదండ్రుల మధ్య కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్న క్లీంకార ఫోటో కొద్ది సమయంలోనే విపరీతంగా వైరల్ అయింది. కొద్ది గంటల్లోనే లక్షలాది లైక్స్, కామెంట్లు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

క్లీంకార ఫోటో చూసిన మెగా ఫ్యాన్స్ విపరీతంగా షేర్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అచ్చం అమ్మ ఉపాసన లాగానే ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. లిటిల్ మెగా క్వీన్, చెర్రీ గారాల పట్టి భలే క్యూట్ గా ఉందిగా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Klin Kara

ఈ సందర్భంగా మెగా ప్రిన్సెస్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. గతంలో బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ షోలో క్లీంకార గురించి చరణ్ సరదా వ్యాఖ్యలు చేశారు.తనను నాన్నా అని పిలిచిన రోజే అందరికీ ఆమె ఫేస్ రివీల్ చేస్తానంటూ వ్యాఖ్యానించారు.

ఇప్పుడు క్లీంకార(Klin Kara)కు మాటలు వచ్చి ఉంటాయంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. క్లీంకార 2023 జూన్ 20న జన్మించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉపాసన కవలలకు జన్మనిచ్చారు. అబ్బాయికి శివరామ్ , అమ్మాయికి అన్వీరా దేవి అంటూ పేర్లు పెట్టారు.

Pharma : ఫార్మా రంగానికి బిగ్ షాక్.. ఆ పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ బ్యాన్ ఎందుకు?

Exit mobile version