Pharma : ఫార్మా రంగానికి బిగ్ షాక్.. ఆ పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ బ్యాన్ ఎందుకు?
Pharma : ఎలాంటి ఉపయోగం లేని, పైగా సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చిపెట్టే 16 రకాల మందులను పూర్తిగా బ్యాన్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది
Pharma
దేశంలోని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే టార్గెట్‌గా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో అమ్ముతున్న 16 రకాల కాంబినేషన్ మెడిసిన్ (ఎఫ్‌డీసీ) తయారీ, సేల్స్‌ను , సప్లైని దేశవ్యాప్తంగా వెంటనే నిషేధిస్తూ ఆర్డర్స్ పాస్ చేసింది.
ఈ కాంబినేషన్ మెడిసిన్ వల్ల రోగాలు నయం అవుతాయనడానికి ..ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు లేవని ల్యాబ్ పరీక్షల్లో తేలడంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కఠిన చర్య తీసుకుంది. ప్రజలకు మేలు చేసే, డాక్టర్ల నమ్మకం ఉన్న మెడిసిన్ మాత్రమే అందరికీ దొరకాలనే ఉద్దేశంతో కేంద్ర ఆరోగ్య శాఖ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.
నిజానికి 2 లేదా అంతకంటే ఎక్కువ రకాల మెడిసిన్స్‌ను కలిపి ఒకే టాబ్లెట్ కానీ సిరప్ రూపంలో కానీ తయారుచేసే వాటిని కాంబినేషన్ మందులు అంటారు. ఇలాంటి మందుల వాడకం, తయారీపై సుప్రీంకోర్టు కొన్ని గైడ్‌లైన్స్ ఇవ్వడంతో మోదీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా ఏయే మందుల కలయికలు పేషెంట్లకు హాని కలిగిస్తాయో గుర్తించడానికి డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు.. ద్వారా ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ నిపుణుల కమిటీ ఇప్పుడు మార్కెట్లో ఉన్న కొన్ని కాంబినేషన్ మెడిసిన్స్‌ను క్షుణ్ణంగా పరీక్షించింది. దీనిలో భాగంగా రోగులకు ఎలాంటి ఉపయోగం లేని, పైగా సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చిపెట్టే 16 రకాల మందులను పూర్తిగా బ్యాన్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఆధారంగానే ఎక్కువగా వాడే కొన్ని యాంటీ బయాటిక్స్, స్కిన్ క్రీములు, కాస్మోటిక్స్‌కు చెందిన కాంబినేషన్ మందులపై కేంద్రం నిషేధ ముద్ర వేసింది.
ప్రభుత్వం ఇచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ 16 రకాల మందుల వల్ల రోగం తగ్గుతుందనే నమ్మకం ఎక్కడా లేదు. నిషేధించిన వాటిలో జనం రెగ్యులర్‌గా వాడే కొన్ని పెయిన్ కిల్లర్స్, నడుము, కండరాల నొప్పుల మెడిసిన్స్, చర్మవ్యాధుల లోషన్లు ఉన్నాయి. దేశంలోని డ్రగ్స్ చట్టం ప్రకారం పేషెంట్స్ సేఫ్టీ కోసమే ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
ఈ నిషేధాన్ని చాలా కఠినంగా అమలు చేయాలి అంటూ అన్ని స్టేట్స్ డ్రగ్ కంట్రోల్ అధికారులకు, పోలీసులకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఫార్మా(Pharma) కంపెనీలు, మెడికల్ షాపుల వారు ఈ మెడిసిన్ స్టాక్‌ను మార్కెట్ నుంచి వెంటనే వెనక్కి తీసుకోవాలని సూచించింది.
ఈ బ్యాన్ అయిన లిస్టులో అసిటైల్ సాలిసిలిక్ యాసిడ్‌తో కూడిన ఎథోహెప్టాజిన్, డైసైక్లోమిన్, పారాసిటమాల్, క్లినిడియం బ్రోమైడ్ లాంటి కాంబినేషన్స్ ఉన్నాయి. అలాగే గైక్లజైడ్ విత్ క్రోమియం పికోలినేట్, పారాసిటమాల్ కలయికతో వచ్చే లిగ్నోకైన్ వంటి వాటిని బ్యాన్ చేశారు.
వీటితో పాటు జనం మెడికల్ షాపుల్లో ఎక్కువగా కొనే అమోక్సిసిలిన్ విత్ సెర్రాటియోపెప్టిడేస్, అలాగే సెర్రాటియోపెప్టిడేస్ విత్ లాక్టోబాసిల్లస్ స్పోరోజెన్స్, సెఫురోక్సిమ్ విత్ సెర్రాటియోపెప్టిడేస్ వంటి యాంటీబయాటిక్స్ కూడా ఉన్నాయి. ఇక చర్మ సంరక్షణ కోసం వాడే విటమిన్-ఈ, జోజోబా ఆయిల్, ఆరెంజ్ ఆయిల్, వీట్ జెర్మ్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్ వంటివి కలిపి తయారుచేసే పలు లోషన్లను, క్రీములను కూడా కేంద్రం పూర్తిగా నిషేధించింది.

గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి డేంజరస్ మెడిసిన్స్‌పై గట్టి చర్యలు తీసుకుంది. కొన్నేళ్ల క్రితం ఒకేసారి ఏకంగా 344 రకాల కాంబినేషన్ మెడిసిన్స్‌పై కేంద్రం నిషేధం విధించి ఫార్మా(Pharma) కంపెనీలకు పెద్ద షాక్ ఇచ్చింది. ఆ తర్వాత కూడా మరో 14 రకాల ఔషధాలను బ్యాన్ చేశారు.
గతంలో బ్యాన్ అయిన వాటిలో ఎక్కువగా అమ్ముడయ్యే ఫీవర్, కోల్డ్, దగ్గు సిరప్‌లు, కొన్ని పాపులర్ పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు ఉన్నాయి. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే చాలామంది సొంతంగా మెడికల్ షాపులకు వెళ్లి ఇలాంటి మందులు కొని వాడేస్తుంటారు. దీనివల్ల లివర్, కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉండటం వల్లే ప్రభుత్వం ఇలాంటి అశాస్త్రీయ మందుల వాడకాన్ని అడ్డుకుంటుంది.
Living Relationship : సహజీవనం అత్యాచారం కేసు ఎలా అవుతుంది ?..అలహాబాద్ హైకోర్టు చీవాట్లు





