Ram Charan Comments : రామ్‌చరణ్ వ్యాఖ్యలపై నెటిజన్ల ఫైర్..రాజమౌళి,సుకుమార్‌ను అవమానించారంటూ రచ్చ

Ram Charan Comments : సినిమా థ్యాంక్స్ మీట్‌లో ఆనందంలో చెర్రీ చేసిన కొన్ని కామెంట్స్‌ను టార్గెట్ చేస్తూ ట్రోలర్స్ పెద్ద రచ్చే మొదలుపెట్టేసారు.

Ram Charan Comments

మూవీ ఎంత పెద్ద హిట్ అయింది.. బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూలు చేసింది అనే విషయాలతో సంబంధం లేకుండా.. కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకే బ్యాచ్ ఎప్పుడూ రెడీగానే ఉంటుంది. సెలబ్రిటీల నోటి వెంట చిన్న తప్పు మాట వస్తే చాలు, దాన్ని పట్టుకుని ఎప్పుడెప్పుడు నెగిటివ్ ట్రోల్స్ చేద్దామా అని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కాచుకుని కూర్చుంటారు.

ఇప్పుడు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తాజా సినిమా పెద్ది విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతోంది. ఒకవైపు ఈ మూవీలో జాన్వీ కపూర్ పాత్రను మితిమీరిన గ్లామరస్‌గా చూపించేసారనే విమర్శలు సాగుతూ ఉండగానే.. సినిమా థ్యాంక్స్ మీట్‌లో ఆనందంలో చెర్రీ చేసిన కొన్ని కామెంట్స్‌ను(Ram Charan Comments) టార్గెట్ చేస్తూ ట్రోలర్స్ పెద్ద రచ్చే మొదలుపెట్టేసారు.

హైదరాబాద్‌లో జరిగిన పెద్ది థ్యాంక్స్ మీట్‌లో రామ్‌చరణ్ మాట్లాడుతూ.. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు.

తాను సిటీలోని ఒక థియేటర్‌కు వెళ్లి సినిమా చూశానని.. కానీ అక్కడ కొన్ని సీన్స్‌కి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి.. తన రోజు మొత్తం హ్యాపీగా మారిపోయిందన్నారు. తాను అస్సలు ఊహించని సీన్స్‌కి కూడా థియేటర్లలో చప్పట్లు కొడుతున్నారని చరణ్ చెప్పుకొచ్చారు.

నిజం చెప్పాలంటే.. తన కెరీర్ ఫిల్మ్ లైబ్రరీలోనే ఈ సినిమా టాప్ 1 లేదా టాప్ 2 స్థానంలో నిలుస్తుందని చరణ్ చెప్పారు. సాధారణంగా ఏ హీరో అయినా.. తమ లేటెస్ట్ సినిమా సక్సెస్ జోష్‌లో ఇలా మాట్లాడటం కామనే.

కానీ ఇంటర్నెట్‌లోని నెగిటివ్ బ్యాచ్ మాత్రం రామ్ చరణ్ చేసిన ఈ కామెంట్‌ను పట్టుకుని నానా రచ్చ చేస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచిన మగధీర, రంగస్థలం, గ్లోబల్ రేంజ్ సంచలనం అయిన ఆర్ఆర్ఆర్ వంటి ల్యాండ్‌మార్క్ మూవీలను పక్కన పెట్టి.. చరణ్ ఈ కొత్త సినిమాను నెంబర్ వన్ అనడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

చరణ్‌కు అలాంటి లైఫ్ చేంజింగ్ హిట్స్(Ram Charan Comments) ఇచ్చిన గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ను..ఇది ఘోరంగా అవమానించడమేనని కొందరు పనిగట్టుకుని నెగిటివ్ ప్రచారాన్ని మొదలుపెట్టారు.

రెడ్డిట్ (Reddit) వంటి వేదికలపై కొందరు స్పందిస్తూ..రంగస్థలం, మగధీర, ఆర్‌ఆర్‌ఆర్ కంటే పెద్ది మూవీనే బెస్ట్ అంటే అది రాజమౌళి, సుకుమార్‌ను ఇన్సల్ట్ చేయడమేనని కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు మగధీర, రంగస్థలం చిత్రాలకు జరిగిన అతిపెద్ద అవమానమంటూ చరణ్ స్టేట్‌మెంట్‌ను తప్పుబడుతున్నారు.

Ram Charan Comments

దీంతో సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేయాల్సింది పోయి, హీరోలు ప్రమోషన్స్ కోసం అనే మాటలను కూడా ఇంతగా భూతద్దంలో పెట్టి చూడటం కేవలం ట్రోలింగ్ బ్యాచ్‌కే సాధ్యం అని మెగాభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు.

థియేటర్లలో కలెక్షన్ల సునామీని కురిపిస్తూ రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ మూవీపై.. ఈ నెగిటివ్ బ్యాచ్ చేస్తున్న ట్రోలింగ్.. రాబోయే రోజుల్లో ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.

Mamata Banerjee : బెంగాల్ రాజకీయాల్లో కలకలం..మమతా బెనర్జీ ఇంట్లో సీఐడీ సోదాలు..

Exit mobile version